సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డ్ స్థాయిలో ముగిశాయి. ముఖ్యంగా కీలక సూచీ సెన్సెక్స్ 34వేలకు ఎగువన పటిష్టంగా ముగిసింది. ఇదే బాటలో నిఫ్టీ 44 పాయింట్లు ఎగిసి 10,500కి ఎగువన 10, 536వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల పంటపడింది. మెటల్ సెక్టార్ టాప్ విన్నర్‌గా నిలిచింది.
సిప్లా, బాష్, వేదాంత, ఆర్‌ఐఎల్, భారతి ఎయిర్‌టెల్, భారీగా లాభ పడగా, ముఖ్యంగా డీఎల్‌ఎఫ్, సెయిల్, జెట్ ఎయిర్‌వేస్ 52వారాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మరోవైపు ఎస్‌డీఆర్ ప్రకటనతో ఆర్ కాం 40శాతానికిపై లాభపడడం విశేషం. జస్ట్ డయల్, జేపీ అసోసియేట్ లాభాలను ఆర్జించాయి.
ఇక కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఐవోసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment