సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్న సూచీలు రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 62వేల మార్క్‌ను తాకింది. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 61980వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18409 పద్ద పటిష్టంగా ముగిసాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కట్లకు ఊతమిచ్చాయి. అటు మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. కోటక్ మహీంద్ర, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ భారీగా లాభపడ్డాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.30 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment