సాక్షి,ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డ్ జోరుకొనసాగింది. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. జీవితకాల గరిష్ట స్థాయి 41,163.79 ని తాకింది. అయితే మిడ్ సెషన్‌నుంచి కొంత ఊగిసలాడినా చివరకు సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 12151 వద్ద ముగిసాయి. ఇది రికార్డు ముగింపు కావడం విశేషం. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా తొలిసారిగా 32 వేల మార్కును అధిగమించింది.
భారతి ఎయిర్‌టెల్ యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ , టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, శాతం, హీరోమోటోకార్ప్, ఒఎన్‌జీసీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు హెవీ వెయిట్ రిలయన్స్ 10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. ఈ విషయంలో తొలి భారతీయ కంపెనీగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment