సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఆరంభంలో కూడా తమ లాభాల హవాను కొనసాగించాయి. వరుసగా ఆరోరోజూ భారీగా లాభపడిన ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం కొత్త గరిష్టాలవద్ద ముగిసాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికను అమలుపరిచేందుకు ఆర్‌బీఐతో కలిసి పనిచేస్తామన్న కేంద్ర ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడ్డాయి. రోజంతా తన జోష్‌ను కొనసాగించిన మార్కెట్ ఒకదశలో 700 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరకు సెన్సెక్స్ 617 పాయింట్ల లాభంతో 51349 వద్ద, నిఫ్టీ 192 పాయింట్ల లాభంతో 15116 వద్ద స్థిరపడ్డాయి. దీంతో తొలిసారిగా సెన్సెక్స్ 51వేల ఎగువన, నిఫ్టీ 15వేల ఎగువన ముగియడం విశేషం.
ఐటీ, మెటల్, ఆటో షేర్లు 3 శాతం లాభంతో ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ, బ్యాంక్ సూచీలు 1-2.5 శాతం మధ్య పెరిగాయి. ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్స్ , బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బ్రిటానియా,హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్రా, దివీస్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment