సాక్షి, ముంబై : రోజంతా దూకుడు మీదున్న దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను నమోదు చేసాయి. మిడ్‌సెషన్ సమయానికి ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను చేరుకున్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు. నిఫ్టీ 170 పాయింట్లు దూసుకెళ్లాయి. తద్వారా 40,309 వద్ద సెన్సెక్స్, 12,103 పాయింట్ల వద్ద నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను నెలకొల్పాయి. చివర్లో కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో ముగింపులోనూ ఇండెక్సులు సరికొత్త రికార్డులను లిఖించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాళ్లకు ఎగువన ముగియడం విశేషం.
చివరకు సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్‌చేసి 40,268 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు ఎగసి 12,089 వద్ద ముగిసింది. మరోసారి కీలక వడ్డీరేటు కోత ఉంటుందన్నఅంచనాలు ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. మీడియా మినహా అన్ని సెక్టార్లు లాభాలనార్జించాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియల్టీ, బ్యాంక్స్ లాభపడ్డాయి. హీరో మోటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్, ఐబీ హౌసింగ్, హెచ్‌యూఎల్, టైటన్, కోల్ ఇండియా, ఆర్‌ఐఎల్, యస్ బ్యాంక్ టాప్ విన్సర్న్‌గా నిలిచాయి. గెయిల్ టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్‌టీపీసీ భారతి ఇన్‌ఫ్రాటెల్ స్వల్పంగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment