సాక్షి, ముంబై: వారం ఆరంభంలోనే స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సోమవారం ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆ తరువాత లాభాల్లోకి మళ్లాయి. ఇక అక్కడినుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గని కీలక సూచీ నిఫ్టీ రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది.1 5500 పాయింట్ల మార్క్‌ని సునాయాసంగా అధిగమించిన నిఫ్టీ15565 వద్ద ట్రేడ్ అవుతోంది. 'అటు సెన్సెక్స్ 479 పాయింట్లు ఎగిసి 51902 ఎగువన పటిష్టంగా కొనసాగుతోంది.
ఐటీ,ఆటో మినహా అన్ని రంగాలూ లాభాలతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ , ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్స్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఐటిసీ, భారతి ఎయిర్‌టెల్ లాభపడుతుండగా, ఎం అండ్ ఎం అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్,టాటామోటర్స్, విప్రో నష్టాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment