సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజూ బుల్‌రన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో భారీగా లాభపడుతున్నాయి. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 615 పాయింట్లు ఎగిసి 50912వద్ద, నిఫ్టీ 184 పాయింట్ల లాభతో 15103 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రైవేట్ సర్వేలో చైనా సేవల రంగ కార్యకలాపాల వృద్ధి మందగించడం, ఒపెక్ దేశాల సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి నెలకొంది. బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు ఇవాళ్టి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆటో ఇండెక్స్ స్వల్పంగా నష్టపోతోంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐలు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ భారీగా లాభపడుతుండగా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment