సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 512 పాయింట్లు ఎగియగా నిఫ్టీ 140 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. తద్వారా సెన్సెక్స్ 60 వేలకు, నిఫ్టీ 17800 పాయింట్ల మార్క్‌ను అధిగమించాయి.
బడ్జెట్‌పై ఆశలు, అంచనాలతో ఇన్వెస్టర్లు ఆశాజనంగా ఉన్నారు. దీంతో సూచీలు ఉ త్సాహంగా ఉన్నాయి. బడ్జెట్ ప్రకటన తరువాత ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు , బబ్రిటానియా, హిందాల్కో, టాటా స్టీల్ బాగా లాభపడుతుండగా అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మ, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 81.80 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment