లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Published Fri, Dec 9 2016 4:28 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
ఈక్విటీ బెంచ్మార్కులు శుక్రవారం ట్రేడింగ్లో లాభాల్లో ముగిశాయి. గత మూడు నెలల కాలంలో అతిపెద్ద వారాంత లాభాలుగా మార్కెట్లు రికార్డు కెక్కాయి. సెన్సెక్స్ 52.90 పాయింట్ల లాభంలో 26,747.18వద్ద, నిఫ్టీ 14.90 పాయింట్ల లాభంలో 8,261.75 పాయింట్ల లాభంలో ముగిశాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ లాభాలు పండించగా.. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, మహింద్రా అండ్ మహింద్రా, సిప్లా సెన్సెక్స్లో నష్టాలు గడించాయి. ప్రారంభ లాభాలను మార్కెట్లు నిలబెట్టుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రేట్లను యథాతథం కొనసాగిస్తున్నట్టు ప్రకటించి మార్కెట్లను నిరాశపరిచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఉద్దీపన ప్యాకేజీని కొనసాగిస్తుందనే అంచనాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 నుంచి మంచి వారాంత లాభాలను రెండు ఇండెక్స్లు నమోదుచేశాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు బలహీనపడి 67.45గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర కూడా 50 రూపాయల నష్టంతో రూ.27,727గా నమోదైంది.
Advertisement
Advertisement