సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయిలవద్ద ముగిశాయి. ఆరంభం నుంచి దూకుడుమీద ఉన్న మార్కెట్లు ముగింపువరకు అదే ధోరణిని కొనసాగించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ రంగాల భారీ లాభాలతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను అందుకున్న సెన్సెక్స్, నిఫ్టీ పటిష్ట స్థాయిలవద్ద ముగిశాయి. సెన్సెక్స్ 391పాయింట్లు ఎగిసి 33, 603 వద్ద, నిప్టీ106 పాయింట్ల లాభంతో 10, 440 వద్ద పటిష్టంగా ముగిశాయి.
మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత ఫలితాలను ప్రకటించిన భారతి ఎయిర్ టెల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. దాదాపు అన్ని బ్యాంకుల షేర్లు లాభాల్లో ముగియగా ఐటీ, ఫార్మ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐడియా, స్టేట్‌బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, వేదాంతా, హెచ్‌యూఎల్, హిందాల్కో, ఐటీసీ లాభాలను ఆర్జించగా, ఐషర్, భారతి ఇన్‌ఫ్రాటెల్ అశోక్ లేలాండ్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, జీ, టీసీఎస్, ఇన్‌ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, హెచ్‌పీసీఎల్ నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment