
సాక్షి, అమరావతి: హోంగార్డ్‌ల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ప్రశంసించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రభుత్వం హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతోపాటు పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షలకు ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు వివరించారు. హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment