న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తాజాగా గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల కస్టమర్ల కోసం ‘సంపన్న్’ పేరిట ప్రీమియం బ్యాంకింగ్ సర్వీసులను ఆవిష్కరించింది. వీటితో వ్యవసాయోత్పత్తులపై డిస్కౌంట్లు, వ్యక్తిగత రుణ పథకాలు, రుణాలపై వడ్డీ రేట్లు మొదలైన అంశాల్లో ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని బ్యాంకు గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు మునీష్ సర్దా, రవి నారాయణన్ తెలిపారు.
వ్యాపార విస్తరణ, వాహనాలు.. గృహాల కొనుగోలు తదితర అవసరాలకు సులభతరంగా ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా సంపన్న్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. వీటికి తోడు అధిక పరిమితులతో ఉచిత డెబిట్..క్రెడిట్ కార్డులు, డీమ్యాట్ సేవలు, ప్రత్యేకంగా రిలేషన్ షిప్ మేనేజరుతో పాటు ఆరోగ్య..జీవిత బీమా కవరేజీలాంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని వారు పేర్కొన్నారు. రైతులు, వ్యాపారస్తులు, లఘు పరిశ్రమలు మొదలైన వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు సంపన్న్ తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment