
కొద్ది రోజుల క్రితం ఇండియాలో పోకో ఇండియా తన పోకో ఎం2 రీలోడెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రూ.10,000లోపు బడ్జెట్ విభాగంలో దీనిని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా కొత్త స్మార్ట్‌ఫోన్ కాదు, ఇప్పటికే ఫేమస్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ రీలోడెడ్ వర్షన్. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్ విషయంలో పెద్దగా ఏమీ మార్పు లేవు, కానీ ర్యామ్ ఆప్షన్ మాత్రం మారింది. గతేడాది పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ + 64జీబీ, 6జీబీ + 128జీబీ మోడళ్లలో విడుదల అయింది. ఈ సారి సరికొత్తగా పోకో ఎం2 రీలోడెడ్ పేరుతో 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది.
పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ + 64జీబీ వేరియంట్ ప్రస్తుతం ధర రూ.9,499. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.8,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే మీరు పోకో ఎం2 రీలోడెడ్ 4జీబీ + 64జీబీ వేరియంట్‌ను రూ.599 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డ్‌తో మొదటిసారి కొన్నట్లయితే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. కొత్తగా విడుదల అయిన పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్, గతంలో రిలీజ్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో పెద్దగా ఏమి మార్పు లేదు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment