
Flipkart Big Bachat Dhamaal: ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఏడాది వరుస పెట్టి ఒక సేల్ తర్వాత మరొక సేల్ తీసుకొని వస్తుంది. తాజాగా బిగ్ బచత్ ధమాల్ పేరుతో మరొక సేల్ తీసుకొని వచ్చింది. మార్చి 4 నుంచి మార్చి 6 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో యుపీఐ లావాదేవీలపై రూ.1000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్, వేరబుల్స్, టీవి మోడల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
మోటరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి ఫోన్ల అమ్మకాలు కూడా ఈ సేల్‌లో భాగంగా ప్రారంభమవుతాయి. అలాగే, కస్టమర్లు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ మీద ప్రత్యేక డీల్స్ పొందవచ్చ. ఇంకా, వినియోగదారులు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలకు చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉండే 'లూట్ బజార్' కూడా ఇందులో ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్, పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ పై డీల్స్, ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్ గ్రేడ్ ఆప్షన్, మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్లను కూడా తీసుకురానున్నారు.
(చదవండి: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!)