హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలన్నింటినీ ఒకే చోట చూసుకునేందుకు వీలుగా యాక్సిస్ బ్యాంక్ తమ మొబైల్ యాప్‌లో వన్–వ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ రంగ బ్యాంకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది. దీనితో యాక్సిస్ బ్యాంక్‌యేతర ఖాతాలను కూడా తమ కస్టమర్లు.. అకౌంట్లకు జోడించుకుని బ్యాలెన్స్‌లు, వ్యయాలు, లావాదేవీల స్టేట్‌మెంట్లను ఒకే చోట చూసుకునేందుకు వీలుంటుందని బ్యాంకు ప్రెసిడెంట్ సమీర్ శెట్టి తెలిపారు.
అకౌంట్ అగ్రిగేటర్ విధానాన్ని ఉపయోగించి ఈ కొత్త తరహా బ్యాంకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్‌తో పలు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను చూసుకోవాల్సిన శ్రమ తప్పుతుందని, లింకు చేసిన ఖాతాల నుంచి కస్టమర్లు లావాదేవీల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని లేదా ఈమెయిల్‌కు పంపుకోవచ్చని తెలిపారు. ఒకవేళ వద్దనుకుంటే ఎప్పుడైనా ఆయా ఖాతాల లింకును తీసివేయొచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment