
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్)ను అన్ని కాలపరిమితులపై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. బ్యాంక్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం మెజారిటీ ఖాతాలకు అనుసంధానంగా ఉండే ఏడాది కాల వ్యవధి రుణ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి, 8.35 శాతానికి చేరింది.
ఏడాది, మూడు, ఆరు నెలల కాలపరిమితులకు రుణ రేట్లు పావుశాతం పెంపుతో 8.15 శాతం–8.30 శాతం శ్రేణికి చేరాయి. రెండు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతంగా ఉంది. మూడేళ్ల రేటు 8.50 శాతానికి ఎగసింది. తదుపరి సమీక్ష వరకూ ఈ రేట్లు అమల్లో ఉంటాయని బ్యాంక్ ప్రకటన వివరించింది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment