Axis Bank Announced Completed The Acquisition Of Citibank In India Consumer Business - Sakshi
Sakshi News home page

Citibank Merger With Axis Bank: నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు..ఖాతాదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే!

Published Wed, Mar 1 2023 12:42 PM | Last Updated on Wed, Mar 1 2023 1:57 PM

Axis Bank Announced Completed The Acquisition Of Citibank In India - Sakshi

భారత్‌లో ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 120 ఏళ్లుగా బ్యాంకింగ్‌ సేవలందిస్తున్న సిటీ బ్యాంక్‌ ఇక పాత జ్ఞాపకంగా మిగిలి పోనుంది. తాజా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్‌ అకౌంట‍్ల కార్యకలాపాలు యాక్సిస్‌ బ్యాంక్‌లో కొనసాగనున్నాయి.  

భారత్‌లో నమ్మకం నుంచే మొదలయ్యే బ్యాంకింగ్‌ బిజినెస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక దేశీ, విదేశీ బ్యాంకులు పోటీ పడ్డాయి. వాటిలో అమెరికాకు చెందిన ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన సిటీ బ్యాంక్‌ ఒకటి. సిటీ బ్యాంక్‌ సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. 

అలా 120 ఏళ్లగా సేవలందిస్తున్న సిటీ బ్యాంక్‌ గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌కు అమ్ముతున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడినట్లు సమాచారం.

తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. బిజినెస్‌ టుడే రిపోర్ట్‌ ప్రకారం..రూ. 11,603 కోట్లకు యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్‌ సేవల నుంచి తప్పుకుంది. 

ఆందోళనలో సిటీ బ్యాంక్‌ కస్టమర్లు
ఇక సిటీ బ్యాంక్‌ను..యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్‌ యాజమాన్యం తన వెబ్‌ సైట్‌లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్‌ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌క్షన్‌లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సిటీ బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు:

► సిటీ బ్యాంక్‌ మొబైల్ యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.  

► అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.  

► బ్యాంక్‌ అకౌంట్‌లు ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌, ఎంఐసీఆర్‌ కోడ్‌లలో ఎటువంటి మార్పు ఉండదు.

► సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్‌,క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు.  

► క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్‌లు పొందవచ్చు. 

► క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు.

► లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్‌ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

► సిటీ  బ్యాంక్‌ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి.

► సిటీ బ్యాంక్‌ డీమ్యాట్ అకౌంట్‌ కోసం అకౌంట్‌ నెంబర్‌తో పాటు డీపీ ఐడీ (Depository Participant Identification) అలాగే ఉండనుంది. లావాదేవీల కోసం జారీ చేసిన డీఐ స్లిప్‌లు (Delivery Instruction) చెల్లుబాటులో ఉంటాయి. 

► సిటీ బ్యాంక్‌లో తీసుకున్న ఇన్సూరెన్స్  పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్‌ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి.

► రుణాల కోసం, బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్‌ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్‌ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement