merging
-
‘కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం తథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవు తుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆమ్ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని నిలదీశారు.సీఎం పదవిలో కొనసా గుతూ రాజకీయలబ్ధి కోసం రేవంత్‌రెడ్డి న్యాయస్థానంపై బురదచల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గమన్నారు. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని, అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యమన్నారు. కేసీఆర్‌ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్‌గా, హరీశ్‌రావుకు మంత్రిపదవి ఇవ్వడంతోపాటు, కవితకు రాజ్యసభ పదవి ఇవ్వడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులకు అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. గతంలోనూ బీఆర్ఎస్తో మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్‌ట్యాపింగ్ సహా అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీనే కాపాడుతోందని సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యమని ‘నువ్వు కొట్టినట్లు చెయ్... నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది’ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరు అని విమర్శించారు. -
ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్‌కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ పై చేసిన ఒక పోస్టింగ్‌లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన) ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. -
నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు..ఖాతాదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే!
భారత్‌లో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 120 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ ఇక పాత జ్ఞాపకంగా మిగిలి పోనుంది. తాజా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్ అకౌంట్ల కార్యకలాపాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగనున్నాయి. భారత్‌లో నమ్మకం నుంచే మొదలయ్యే బ్యాంకింగ్ బిజినెస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక దేశీ, విదేశీ బ్యాంకులు పోటీ పడ్డాయి. వాటిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన సిటీ బ్యాంక్ ఒకటి. సిటీ బ్యాంక్ సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. అలా 120 ఏళ్లగా సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు అమ్ముతున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడినట్లు సమాచారం. తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్‌లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం..రూ. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్ సేవల నుంచి తప్పుకుంది. ఆందోళనలో సిటీ బ్యాంక్ కస్టమర్లు ఇక సిటీ బ్యాంక్‌ను..యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్ యాజమాన్యం తన వెబ్ సైట్లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్స్క్షన్లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిటీ బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు: ► సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ► అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ► బ్యాంక్ అకౌంట్లు ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లలో ఎటువంటి మార్పు ఉండదు. ► సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్,క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు. ► క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ► క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ► లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్ కోసం అకౌంట్ నెంబర్‌తో పాటు డీపీ ఐడీ (Depository Participant Identification) అలాగే ఉండనుంది. లావాదేవీల కోసం జారీ చేసిన డీఐ స్లిప్‌లు (Delivery Instruction) చెల్లుబాటులో ఉంటాయి. ► సిటీ బ్యాంక్‌లో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► రుణాల కోసం, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది. -
ఎల్టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
14 నెలల్లోనే ఎక్సైడ్ లైఫ్ విలీనం పూర్తి
ముంబై: తమ అనుబంధ సంస్థ ఎౖక్సైడ్ లైఫ్‌ను రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో విలీనం చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో విభా పదల్కర్ తెలిపారు. సకాలంలో అనుమతులు ఇచ్చి తమకు ప్రోత్సాహం, మద్దతుగా నిలిచినందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ)తోపాటు, ఇతర నియంత్రణ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నమోదు చేసినట్టు ప్రకటించారు. ఎక్సైడ్ లైఫ్ విలీనానికి ముందు ఏపీఈ 11% వృద్ధి సాధించినట్టు చెప్పారు. పరిశ్రమకు అనుగుణంగానే తమ పనితీరు ఉందంటూ, లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించామని, మార్కెట్ వాటాను 14.6 శాతంనుంచి 15%పెంచుకున్నట్టు తెలిపారు. -
తప్పుడు వార్తలు రాస్తున్నారు: ఏపీ విద్యాశాఖ
సాక్షి, అమరావతి: ఏపీలో తరగతుల విలీనంపై కొన్ని పేపర్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయి చెప్పారు ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రాజశేఖర్. సోమవారం మధ్యాహ్నాం ఆయన సచివాలంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తరగతుల విలీనంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని ప్రక్రియని ఇప్పుడు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలు చేస్తున్నాం. పత్రికల్లో కథనాలు రాసేవాళ్ళు.. సమస్య ఏంటో చెప్తే మేము పరిష్కరిస్తాం. అంతేగానీ తప్పుడు వార్తలు రాయొద్దు. సంఘాలు, టీచర్లు కొన్ని పాలసీలను వ్యతిరేకిస్తున్నారు. కానీ మేం మాత్రం ప్రతీ నిర్ణయం విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్నాం. పిల్లలకు మంచి చేసే నిర్ణయాలనే మేము తీసుకుంటున్నాం. గతంలో నిర్ణయాలు విద్యార్థుల కోసం కాకుండా ఇతర కారణాలతో తీసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు మేం మాత్రం విద్యార్థుల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం’’ అని ఏపీ విద్యాశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రాజశేఖర్ స్పష్టం చేశారు. -
ఆర్థిక శాఖ పరిధిలోకి డీపీఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. డీపీఈ ఆర్థిక శాఖ కిందకు రావడం వల్ల మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్ ఉద్యమ్ విభాగ్)’ను చేర్చినట్టు కేబినెట్ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందుగా ఈ నిర్ణయం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా.. దాన్ని సైతం ఆర్థిక శాఖలో విలీనం చేసిన విషయం విదితమే. దీనికితోడు విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని కూడా ఆర్థిక శాఖ కిందకు తీసుకొచ్చారు. భారీ పరిశ్రమల శాఖ కింద 44 సంస్థలు భారీ పరిశ్రమల శాఖ ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించి కొనసాగనుంది. బీహెచ్ఈఎల్, సిమెంట్ కార్పొరేషన్, స్కూటర్స్ ఇండియా, హెచ్ఎంటీ, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తదితర 44 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు భారీ పరిశ్రమల శాఖ కింద కొనసాగుతాయి. ఈ శాఖ కింద ఉన్న కంపెనీల్లో చాలా వరకు మూతపడి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఉన్నవి కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వరం 2021–22 బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ మెగా ఐపీవోతోపాటు ఐడీబీఐలో వాటాల ఉపసంహరణ, బీపీసీఎల్, బీఈఎంల్, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. -
'పాక్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలపాలి'
ముంబై : పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో విలీనం చేసి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ భావిస్తే అందుకు తాము మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది. కరాచీ భారత్‌లో భాగం అవుతుందన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ఫడ్నవిస్ వ్యాఖ్యలపై స్పందించిన మాలిక్ ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..'పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా భారత్‌లో విలీనం కావాలని మేం భావిస్తున్నాం. బెర్లిన్ గోడను పడగొట్టగలిగితే.. పాక్, బంగ్లాదేశ్ భారత్‌లో ఎందుకు విలీనం కావు? ఒకవేళ ఈ మూడింటిని కలిపి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ కోరుకుంటే దాన్ని మేము స్వాగతిస్తాం'అని పేర్కొన్నారు. (బిహార్ ఫలితాలు: శివసేనకు ఎదురుదెబ్బ) ముంబై మున్సిపల్ ఎన్నికల్లోనూ(బిఎంసి)ము శివసేనతో కలిసే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా 15 నెలలు మిగిలి ఉన్నాయని, ఆయా పార్టీలను పటిష్ఠం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. తాము కూడా తమ పార్టీని బలపరిచేందుకు సిద్ధమవుతున్నామని, శివసేన కోరుకుంటే కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. (ఐదేళ్లలో ఏం చేశారంటే లాక్డౌన్ విధించానని చెప్పాలా? ) -
విలీనం సంపూర్ణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ శాసన సభాపక్షాన్ని అధికార టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న ఆ పార్టీ శాసనసభ్యుల వినతికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని ధ్రువీకరిస్తూ శాసనసభ కార్యదర్శి గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇన్నాళ్లూ శాసనసభలో 19 మంది సభ్యులుగల కాంగ్రెస్ పార్టీ బలం ఇకపై ఆరుకే పరిమితం కానుంది. ‘రాష్ట్ర శాసనసభలో 18 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంలో మాకు మూడింట రెండొంతుల బలం ఉంది. మమ్మల్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలి’ అంటూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తీర్మాన ప్రతిని అందజేశారు. భారత రాజ్యాంగం 10వ షెడ్యూలు నాలుగో పేరాలోని రెండో సబ్ పేరాను అనుసరించి తక్షణమే తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ శాసనసభా పక్షానికి చెందిన 12 మంది సభ్యుల విలీన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నట్లు టీఆర్ఎస్ శాసనసభాపక్షం కూడా స్పీకర్‌కు లేఖ రాసింది. దీంతో ఈ వినతిని స్పీకర్ ఆమోదిం చారు. రాజ్యాంగ నిబంధనల మేరకు 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేరుస్తూ స్పీకర్ కార్యా లయం గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేసింది. శాసనసభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సరసన కొత్తగా చేరిన శాసనసభ్యులకు సీట్లు కేటాయిస్తామని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నర్సింహారావు బులెటిన్‌లో పేర్కొన్నారు. స్పీకర్‌తో 12 మంది ఎమ్మెల్యేలు భేటీ... టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో తమను విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న స్పీకర్ నివాసంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం చీలికవర్గం నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ‘మేము కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. మేం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్లో చేరికపై తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని, రాజ్యాంగబద్ధంగానే టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేయాలని ప్రతిపాదించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి వివిధ సందర్భాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. అనంతరం ఇదివరకే టీఆర్ఎస్లో చేరిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి తరలి వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన శాసనసభ్యులకు నియోజకవర్గాల అభివృద్ధిలో సంపూర్ణ తోడ్పాటు ఇవ్వడంతోపాటు పార్టీ వ్యవహారాల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉత్తమ్ రాజీనామాతో కసరత్తు వేగవంతం... గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వారిలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు 11 మంది వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తమలో విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్న టీఆర్ఎస్.. కాంగ్రెస్ నుంచి కనీసం రెండొంతుల మంది.. అంటే 13 మంది శాసనసభ్యుల మద్దతు కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో శాసన సభ్యత్వానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాజీనామా చేయడాన్ని అనుకూలంగా మలుచుకుంది. గత ఏడాది డిసెంబర్లో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. నిబంధనల మేరకు బుధవారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించడంతో టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12కు పడిపోయింది. ‘పైలట్’ చేరికతో చకచకా పావులు... ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు విడతలవారీగా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఈ జాబితాలో ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక), వనమా వెంకటేశ్వర్రావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియా నాయక్ (ఇల్లెందు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), బీరం హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి) గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి) ఉన్నారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేల చేరిక నిలిచింది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరికకు మొగ్గు చూపారు. ఉత్తమ్ రాజీనామా, రోహిత్‌రెడ్డి చేరిక నేపథ్యంలో టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం దిశగా టీఆర్ఎస్ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం నేపథ్యంలో ఏడుగురు సభ్యుల బలమున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
ఇక ఫేస్బుక్ నుంచి వాట్సాప్ మెసేజ్
న్యూయార్క్: అదేంటి.. ఫేస్బుక్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ ఎలా పంపుతాం? అనే కదా.. అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి పంపుకోండి! అర్థం కాలేదు కదూ..? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌ను కలుపుతూ ఒకేసారి మెసేజ్‌లను పంపే సేవలను ప్రారంభించాలని ఫేస్బుక్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మూడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం వేర్వేరు మొబైల్ యాప్స్‌లా పనిచేస్తున్నాయి. కానీ, ఈ మూడూ ఒక ప్లాట్ఫామ్లో ఒకదాని నుంచి ఇంకో దానికి సులభంగా మెసేజ్ పంపించేలా వాటిని అనుసంధానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడంవల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ప్రైవసీకి సంబంధించి సమస్యలు తలెత్తుతాయా? అనే కోణాల్లో పరీక్షిస్తున్నారు. ఇవన్నీ విజయవంతమైతే ఇక ఫేస్బుక్లో ఉన్న వ్యక్తి వేరే వారికి వాట్సాప్ సందేశం కూడా పంపించొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది చివరికి, లేదా 2020 ప్రారంభంలో ఈ రకమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందంటున్నారు. -
‘బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కోత ఉండదు’
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్‌లను.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జైట్లీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని.. ఫలితంగా రుణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయని ప్రకటించారు. కానీ బ్యాంకుల వద్ద ఉన్న ఎన్పీఏలు ఫలితంగా నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దివాల చట్టం సాయంతో రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెవడమే కాక ఎన్పీఏలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. దీని గురించి జైట్లీ ‘2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ. 65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్ కోసం కేటాయించాం. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చాం. ఎన్పీఏలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలను చవి చూస్తున్నాయి’ అని జైట్లీ తెలిపారు. -
ఇక గ్రామీణ బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మరింత కన్సాలిడేషన్‌కి తెరతీస్తూ.. మరిన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీ) కూడా విలీనం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుతం 56 ఆర్ఆర్బీలు ఉండగా.. ఈ సంఖ్యను 36కి తగ్గించాలని యోచిస్తోంది. ఆర్ఆర్బీల స్పాన్సరర్స్లో రాష్ట్రాలు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతింపులు జరుపుతోంది. కేంద్ర ఆర్థిక శాఖలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఒకే రాష్ట్రంలోని ఆర్ఆర్బీలను విలీనం చేసేందుకు సంబంధించి స్పాన్సర్ బ్యాంకులు కూడా మార్గదర్శ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని వివరించారు. ఉత్పాదకత పెంచుకోవడానికి, ఆర్థికంగా మరింత పటిష్టంగా మారడానికి, గ్రామీణ ప్రాంతాల్లో రుణ లభ్యతను పెంచడానికి ఆర్ఆర్బీల విలీనం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆయా బ్యాంకులు వ్యయాలను తగ్గించుకోవడానికి, టెక్నాలజీ వినియోగంతో పెంచుకోవడంతో పాటు కార్యకలాపాలను విస్తరించుకోవడానికి కూడా ఉపయోగపడగలదని అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత మరో మెగా బ్యాంకును ఏర్పాటు చేసే దిశగా ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా ఆర్ఆర్బీల విలీన ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. 2005 నుంచే కన్సాలిడేషన్..: గ్రామీణ ప్రాంతాల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణ, బ్యాంకింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆర్ఆర్బీ 1976 చట్టం కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. కేంద్రం, రాష్ట్రాలు, స్పాన్సర్ బ్యాంకులతో పాటు ఇతరత్రా వనరుల నుంచి కూడా మూలధనాన్ని సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తు 2015లో సంబంధిత చట్టాన్ని సవరించారు. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో కేంద్రానికి 50%, స్పాన్సర్ బ్యాంకులకు 35%, రాష్ట్రాల ప్రభుత్వాలకు 15% వాటాలు ఉంటున్నాయి. ఆర్ఆర్బీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చే ఉద్దేశంతో 2005లోనే కన్సాలిడేషన్ ప్రయోగం జరిగింది. దీంతో 2005 మార్చి ఆఖరు నాటికి 196గా ఉన్న ఆర్ఆర్బీల సంఖ్య 2006 కల్లా 133కి తగ్గాయి. ఈ సంఖ్య ఆ తర్వాత 105కి, 2012 ఆఖరు నాటికి 82కి తగ్గింది. మరిన్ని విలీనాలతో ప్రస్తుతం 56కి దిగి వచ్చింది. సుమారు 21,200 శాఖలు ఉన్న ఆర్ఆర్బీలు 2016–17లో దాదాపు 17 శాతం వృద్ధితో రూ. 2,950 కోట్ల లాభాలు నమోదు చేశాయి. 2017 మార్చి ఆఖరుకి వివిధ పథకాల కింద ఆయా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 3.5 లక్షల కోట్లకు చేరాయి. -
వచ్చే నెలనుంచి కాలేజీల విలీన పక్రియ
ఎంజీయూ(నల్లగొండ రూరల్) : వచ్చే నెల నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలల విలీన ప్రక్రియను చేపడతామని రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన రీసెర్చ్ మెథడాలజీ మూడు రోజుల వర్క్ షాప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయని, అడ్మిషన్లు లేని డిగ్రీ, పీజీ కాలేజీలు 55, 20 శాతం అడ్మిషన్లు ఉన్న కాలేజీలు150 ఉన్నాయన్నారు. దోస్త్ ఆన్లైన్ (డిగ్రీ అడ్మిషన్లు)అడ్మిషన్లు 4 లక్షల 10 వేల సీట్లు ఉండగా గత ఏడాది 1 లక్ష 80 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. 400 డిగ్రీ కాలేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒక మండలంలో 2, 3 డిగ్రీ కాలేజీల నుంచి పూర్తిస్థాయి అడ్మిషన్లు లేనపుడు వాటిని విలీనం చేయడం వల్లా క్వాలిటి విద్య పెరగడంతో పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కొన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 200 కాలేజీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. 2018–19 కి విద్యార్థులు తరగతి గదుల్లో ఉండాలి.. ఉపాధ్యాయులు బోధించాలే... అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. యూనివర్సిటీకి, పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడడంతో పాటు అధ్యాపకులకు నైపుణ్యం పెంచేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థికి ఉద్యోగం, ఉపాధి లభించే విధంగా నైపుణ్యాలను పెంచుతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఇస్తామన్నారు. సీబీసీఎస్ విధానం విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. బయోమెట్రిక్ అన్ని కళాశాలల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరానికి చేరుకుంటారని అన్నారు. విద్యపై విద్యార్థులు దృష్టి సారించాలని, తరగతులకు రాకపోతే ఏమాత్రం ఫలితం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు నైపుణ్యం పెంచి ఉద్యోగం, ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం ప్రయత్నంతోనే విజయం సాధిస్తామన్నారు. ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యార్థికి నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవడానికి సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్‌గా రాలేకపోతే దూరవిద్య ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువు పైనే దృష్టి ఉండాలన్నారు. రూరల్ ఎంగేజ్‌మెంట్‌ను రాష్ట్రంలోనే మొదటిసారిగా యూనివర్సిటీలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన విధానంపై 23, 24, 25 తేదీల్లో 500 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్టార్ ఉమేశ్ కుమార్, రమేష్,రవి, లక్ష్మీ ప్రభా, సరిత, వసంత, తదితరులు పాల్గొన్నారు. అక్రమ నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక యూనివర్సిటీలో జరిగిన అక్రమ అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. నియామకాలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు వెల్లడించారు. -
రైల్వే బడ్జెట్ విలీనం మంచిదికాదు
ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేస్తూ కేంద్రకేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నాటి రైల్వే మంత్రి, నేటి బిహార్ సీఎం నితీష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. 92 ఏళ్ల ఆనవాయితీకి చరమగీతం పాడుతూ సాధారణ బడ్జెట్లో ఈ బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల దేశానికి ఎలాంటి మంచి చేకూరదని ఆయన విమర్శించారు. దీనివల్ల రైల్వే తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందని తెలిపారు. ఈ విషయంపై ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. 1924 నుంచి ప్రత్యేక బడ్జెట్‌గా కొనసాగుతూ వస్తున్న రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రిగా తనకున్న అనుభవం ప్రకారం రైల్వే బడ్జెట్‌కు మంగళం పాడటంతో ఇటు రైల్వేకు, అటు దేశానికి ఎలాంటి మంచి చేకూరదని వివరించారు. దీనివల్ల రైల్వే ఇప్పటివరకు కలిగిఉన్న తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని నితీష్ పేర్కొన్నారు. అటల్ బిహార్ వాజ్‌పేయి కాలంలో ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్, రైల్వే మంత్రిగా పనిచేశారు. రైల్వే నుంచి ప్రజలు చాలా ఆశిస్తుంటారని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, రైల్వే శాఖను సాఫీగా నడిచేలా చేయడానికి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ఉండటమే మంచిదని సూచించారు. ప్రభుత్వం ముందస్తు లాగానే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను కొనసాగించాలని చెప్పారు. తను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, చాలామంది మంత్రులు సాధారణ బడ్జెట్ కంటే రైల్వే బడ్జెట్‌పైనే ఎక్కువగా ఆసక్తిచూపేవారని గుర్తుచేసుకున్నారు. వారి రాష్ట్రాలకు, నియోజకవర్గాలకు కొత్త రైళ్లు మార్గాలు వస్తాయని ఆశించేవారని చెప్పారు. కొన్ని సార్లు రైల్వేమంత్రులు సమస్యలు ఎదుర్కొన్నా, రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండటమే మంచిదని నితీష్ సూచించారు. -
బ్యాంకుల విలీనం విరమించుకోవాలి
సీతమ్మధార: బ్యాంకుల విలీనం ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని బ్యాంకు యూనియన్ల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎ.ఎస్. ప్రభాకర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ బ్యాంకు వ్యతిరేక విధానాలకు నిరసనగా బ్యాంకుల బంద్‌లో భాగంగా సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంక్ ఆవరణలో శుక్రవారం ధర్నా చేపట్టారు. నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలబాటలో ఉన్న బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం విలీనం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకుల ప్రారంభానికి అనుమతులు ఇచ్చేస్తున్నారని ఆందోళన వ్యత్తం చేశారు. రూ.లక్షల కోట్లు బకాయి ఉన్న వారి పేర్లు మీడియా ద్వారా బయటపెట్టి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించరాదని కోరారు. సహకార బ్యాంకులను పటిష్టం చేయాలని, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాటి అనుబంధ బ్యాంకులలో విలీనం చేయాలని, వ్యవసాయ రంగానికి మరిన్ని రుణాలు ఇవ్వాలని కోరారు. పటిష్టమైన భారత్ కోసం పటిష్టమైన బ్యాంకింగ్ రంగాన్ని నిర్మించాలని పలువురు వక్తలు కోరారు. ధర్నాలో ఏఐఎస్‌ఈఏ నాయకుడు పీఎస్ మల్లేశ్వరరావు, యుఎఫ్‌బీయూ నాయకులు ఎన్.సాంబశివరావు, జె. కేశవరావు, జి. వాసుదేవరావు, బి.రమణమూర్తి, శంకరాజు, ఎ. యుగంధర్, ఎ.సుష్మ, పి.సరోజ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల బంద్ కారణంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. -
ఎస్వీ జూ పార్కు పరిధి పెంపు
– త్వరలో మేకలబండ కొండలు విలీనం – ఈ కొండల విస్తీర్ణం 200 హెక్టార్లు – తాజాగా 1200 హెక్టార్ల మాస్టర్‌ప్లాన్ లే అవుట్‌కు ప్రతిపాదనలు – సందర్శకుల కోసం ట్రెక్కింగ్ పాయింట్లు, వాచ్ టవర్ సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు పరిధి పెరగనుంది. పార్కుకు ఉత్తరాన 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మేకలబండ కొండ ప్రాంతాన్ని కూడా పార్కులో విలీనం చేయనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే మేకలబండ కొండల చుట్టూ హద్దులు ఖరారు చేసేందుకు జూలాజికల్ పార్కు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడున్న ఎస్వీ జూ పార్కు ప్రస్తుతం 289 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. మొదట్లో ఈ మేరకు మాస్టర్‌ప్లాన్‌కు అప్రూవల్ లభించింది. ప్రస్తుతం దీని పరిధి భాగా పెరిగింది. పార్కుకు దక్షిణాన ఉన్న లక్ష్మీపురం గ్రామం నుంచి కాలిబాటన వెళ్లి మేకలబండ కొండల్లోకి ప్రవేశిస్తోన్న ఎర్రస్మగ్లర్లు, కూలీలు సులువుగా శేషాచలంలోకి చొరబడుతున్నారు. వీరి చొరబాటును అరికట్టాలంటే ఇక్కడున్న మేకలబండ కొండల ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల పర్యవేక్షణకు అనువుగా మార్చుకోవాలి. ఈ దిశగా ఆలోచించిన అటవీ, జూ పార్కు అధికారులు మేకలబండను జూ పార్కు పరిధిలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పెరిగిన పరిధిని దృష్టిలో పెట్టుకుని మొత్తం 1200 హెక్టార్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ లే అవుట్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అక్కడి జూ అథారిటీ ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా అనుమతులు రాగానే మేకలబండ కొండ ప్రాంతంలో ప్రత్యేక అభివద్ధి పనులు చేపడతామని అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు పేర్కొన్నారు. సందర్శకుల కోసం అభివృద్ధి... త్వరలో మేకలబండ కొండల ప్రాంతాన్ని జూ పార్కులో విలీనం చేయనున్నాం. ఆ తరువాత పార్కులోకి ప్రవేశించే సందర్శకుల కోసం అక్కడ ట్రెక్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. కొండ మీదకు వెళ్లి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రెస్ట్రూములు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా భారీ వాచ్ టవర్ నిర్మించనున్నాం. కొండ మీద పార్కు మొత్తం వీక్షించేలా వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయనున్నాం. కొండల చుట్టూ ప్రహరీ నిర్మించి బయటి వారు లోనికి చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. జూ పార్కు విస్తీర్ణం పెరిగితే ఎక్కువ మొత్తంలో సఫారీలు ఏర్పాటు చేయడానికి వీలువుతుంది. – వై. శ్రీనివాసులరెడ్డి, క్యూరేటర్, ఎస్వీ జూపార్కు, తిరుపతి -
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
శ్రీకాకుళం అర్బన్ : ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందామని పలువురు వక్తలు అన్నారు. ‘బ్యాంకుల విలీనాలు ఎవరి కోసం?’ అనే అంశంపై శ్రీకాకుళం జిల్లా బెఫీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో పలు సంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెఫీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధి ఎం.శ్రీనివాసరావు, ఎస్బీఐ ప్రతినిధి ఎం.రమేష్‌లు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు. ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు అందాలని చెప్పే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే యోచనలో ఉందని దుయ్యబట్టారు. దీనిలో భాగంగానే ఐదు స్టేట్‌బ్యాంక్ అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. సీఐటీయూ ప్రతినిధి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టమన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు వీజీకె మూర్తి, ఎల్ఐసీ యూనియన్ ప్రతినిధి టేకి ఆచారి, వివిధ సంఘాల ప్రతినిధులు వీరభద్రరావు, గౌరినాయుడు, కొప్పల భానుమూర్తి, గొంటి గిరిధర్, పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్ల విలీనానికి నిరసనగా విద్యార్థుల ధర్నా
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పలు రకాల కారణాలతో విలీనం చేస్తే చూస్తు ఊరుకోబోమని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసఆచారి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాదిగా విద్యార్థులు సంక్షేమభవన్‌లో ధర్నా చేపట్టారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, మహేష్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస ఆచారి మాట్లాడుతూ.. జిల్లాలో 18 బీసీ, 23 ఎస్సీ వసతి గృహాలను విలీనం పేరుతో ప్రభుత్వం మూసివేసిందన్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో సంక్షేమ వసతి గృహాల్లో సీట్లు లభించక అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కూడా భోజనాలు పెట్టడం లేదని, నంద్యాల బొమ్మల సత్రం సమీపంలో ఉన్న బాలికల వసతి గృహాల్లో ఈ దుస్థితి నెలకొందన్నారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా నాయకులు సూర్య, ప్రశాంత్, శ్రీరామ్‌నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న విద్యార్థిలోకం
– హాస్టళ్ల విలీనానికి నిరసనగా సంక్షేమభవన్ ముట్టడి, బైఠాయింపు – జీఓ ప్రతుల కాల్చివేత కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను విలీనం చేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. మంగళవారం మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేష్, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రామకష్ణ, అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి సంక్షేమభవన్‌ను ముట్టడించారు. హాస్టళ్లను ఎత్తివేయరాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ పారదర్శకత, నాణ్యత పేరుతో ప్రభుత్వం సంక్షేమ వసతి గహాలను రద్దు చేయడంతో అనేక మంది గ్రామీణ∙విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులను రెసిడెన్సియల్ పాఠశాలల్లోకి ప్రవేశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుందని,అయితే వాటిల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేవని ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు లేఖ రాశారని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై ప్రేమ ఉంటే, ముందుగా రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించి, తర్వాత హాస్టళ్లను ఎత్తివేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో 18 బీసీ వసతి గహాలను విలీనం చేసిన ప్రభుత్వం తాజాగా 23 ఎస్సీ వసతి గహాలను విలీనం చేసేందుకు చర్యలు చేపట్టడం దురదష్టకరమన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సంక్షేమ వసతి గహాల్లోని విద్యార్థులు పదోతరగతిలో ఫలితాలు సాధిస్తున్నారని, తప్పుడు నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు.వసతిగహాల ఎత్తివేత విషయంలో మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి నాయకులు సుధాకర్, చిన్న, రాధాకష్ణ, శివ, పవన్, చెన్న కేశవ్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.