న్యూయార్క్: అదేంటి.. ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ ఎలా పంపుతాం? అనే కదా.. అయితే ఇన్‌స్టాగ్రామ్ నుంచి పంపుకోండి! అర్థం కాలేదు కదూ..? ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌ను కలుపుతూ ఒకేసారి మెసేజ్‌లను పంపే సేవలను ప్రారంభించాలని ఫేస్‌బుక్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మూడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం వేర్వేరు మొబైల్ యాప్స్‌లా పనిచేస్తున్నాయి.
కానీ, ఈ మూడూ ఒక ప్లాట్‌ఫామ్‌లో ఒకదాని నుంచి ఇంకో దానికి సులభంగా మెసేజ్ పంపించేలా వాటిని అనుసంధానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడంవల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ప్రైవసీకి సంబంధించి సమస్యలు తలెత్తుతాయా? అనే కోణాల్లో పరీక్షిస్తున్నారు. ఇవన్నీ విజయవంతమైతే ఇక ఫేస్‌బుక్‌లో ఉన్న వ్యక్తి వేరే వారికి వాట్సాప్ సందేశం కూడా పంపించొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది చివరికి, లేదా 2020 ప్రారంభంలో ఈ రకమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment