Messenger apps
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
ఢిల్లీ: అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం 14 మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్‌బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది. ఇదీ చదవండి: మన్‌కీ బాత్ టైంలో పురిటి నొప్పులు, ఆపై.. -
టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టెలిగ్రామ్ వినియోగదారులు ఉచితంగానే దీని సేవలను పొందుతున్నారు. తాజాగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ యూజర్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపాడు. వచ్చే ఏడాది నుండి టెలిగ్రామ్ లో రాబోయే కొన్ని ఫీచర్స్ వాడుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే అని తెలిపారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ మాట్లాడుతూ.. మార్కెట్లో పోటీ కారణంగా ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి కొంత డబ్బులు అవసరమని అన్నారు. 2013లో పావెల్ దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ టెలిగ్రామ్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 500 మిలియన్ల యాక్టీవ్ యూజర్లను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.(చదవండి: వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపండి ఇలా) ప్రస్తుతం కంపెనీని విక్రయించే ఆలోచన లేదని, అందువల్ల నిధులు సమకూర్చడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని 36 ఏళ్ల దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్ మాజీ సోవియట్ యూనియన్ మరియు ఇరాన్ లలో ఒక ప్రముఖ సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంది. ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ప్రైవేట్ కమ్యూనికేషన్స్, సమాచారం, వార్తలను పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కంపెనీ నిర్వహణ ఖర్చులను చెల్లించాడనికి నేను నా వ్యక్తిగత పొదుపుల నుండి నగదు చెల్లించాను అని దురోవ్ చెప్పారు. ప్రస్తుతం ఫ్రీగా అందిస్తున్న సేవలను అలాగే కొనసాగించనున్నట్లు తెలిపారు. కానీ, కొత్తగా బిజినెస్ టీమ్స్, పవర్ యూజర్స్ కోసం తీసుకురాబోయే ఫీచర్ల కోసం మాత్రం ప్రీమియం యూజర్ల నుండి డబ్బులు వసూలు చేయనున్నట్లు పావెల్ దురోవ్ పేర్కొన్నారు. -
ఇక వాట్సాప్ మెసెజ్‌లు ఆటో డిలీట్
ముంబై, సాక్షి: మెసెజీలు, మీడియా ఫైల్స్‌ను వారం రోజుల్లో ఆటోమాటిక్‌గా డీలిట్ అయ్యే ఫీచర్ దేశీయంగా వాట్సాప్ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్, కేఏఐవోఎస్, వెబ్ తదితరాలలో ఈ ఫీచర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వాట్సాప్ తాజాగా పేర్కొంది. అయితే వినియోగదారులు ఈ ఫీచర్‌ను మాన్యువల్‌గా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. తద్వారా వాట్సాప్ మెసేజీలు 7 రోజుల తదుపరి ఆటోమాటిగ్గా డీలిట్ అవుతాయి. ఈ ఫీచర్ గ్రూప్ చాట్స్‌కు సైతం వినియోగించుకోవచ్చు. గ్రూప్‌లలో అయితే ఈ ఫీచర్ ఎనేబుల్ లేదా డిజుబుల్ సౌకర్యం.. అడ్మిన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలా చేయాలంటే? వాట్సాప్ కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన మెసెజ్ ఆటో డిలీట్ సౌకర్యాన్ని పొందాలంటే.. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ వినియోగదారులు తొలుత వాట్సాప్ చాట్ ఓపెన్ చేయాలి. కాంటాక్ట్ పేరును ఎంపిక చేసుకుని డిజెప్పీరింగ్ మెసేజెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అపై కంటిన్యూ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఈ విధానం డెస్క్‌టాప్, వెబ్, కేఏఐవోఎస్ వినియోగదారులకు సైతం అందుబాటులో ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. ఇక గ్రూప్ చాట్లలో అయితే అడ్మిన్లు గ్రూప్ చాట్‌ను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. గ్రూప్ పేరు, డిజెప్పీరింగ్ మెసేజెస్, కంటిన్యూపై క్లిక్ చేస్తే సరిపోతుంది. కాగా.. ఆటో డౌన్లోడ్ ఆప్షన్గనుక ఉన్నట్లయితే మెసేజీలు ఫోన్మెమరీలో స్టోర్ అవుతాయి. ఫలితంగా వారం రోజుల్లో చాట్స్ నుంచి మాత్రమే డీలిట్ అవుతాయని వాట్సాప్ తెలియజేసింది. ఆటో డిలీట్ ఆప్షన్‌ను ఎంచుకోకముందు చాట్లపై ఈ ఫీచర్ ప్రభావం చూపబోదని ఈ సందర్భంగా వాట్సాప్ తెలియజేసింది. ఇక డిజెప్పీర్ ఆప్షన్ లేని కాంటాక్ట్‌కు వీటిని ఫార్వార్డ్ చేస్తే.. ఈ మెసేజీలు అక్కడ డీలిట్కావని వివరించింది. ఒకవేళ ఈ ఫీచర్ ఎవరి ఫోన్లోనైనా కనిపించకుంటే.. ఆయా వినియోగదారులు లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవలసి ఉంటుందని సూచించింది. -
క్షమాపణలు చెప్పిన స్నాప్‌చాట్, కారణం?
సాక్షి, న్యూఢిల్లీ: స్నాప్‌చాట్.. ఈ మెసెంజర్ యాప్‌ద్వారా కేవలం మెసేజ్‌లు, కాల్స్ మాత్రమే కాకుండా రకరకాల ఫిల్టర్లను ఉపయోగించి వివిధ రకాల ఫోటోలను దిగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్నాప్‌చాట్ యూజర్లకు వివిధ రకాల థిమ్స్లో ఫిల్టర్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే మల్టీ మీడియా మెసేంజింగ్ యాప్ స్నాప్‌చాట్ తన యూజర్లకు క్షమాపణలు తెలిపింది. జూన్ 19 జూన్టీన్త్ డే సందర్భంగా ఒక క్తొత ఫిల్టర్‌ను స్నాప్‌చాట్ యూజర్లకు అందుబాటులో ఉంచింది. మనం నవ్వితే సంకెళ్లు తెగుపోతాయి అనే థీమ్‌ను సృష్టించింది. అయితే జూన్టీన్త్ డే సందర్భంగా రూపొందించిన ఈ ఫిల్టర్‌కు యూజర్ల నుంచి నెగిటివ్ రివ్యూ రావడంతో స్నాప్‌చాట్ క్షమాపణలు చెప్పింది. (వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) ‘ఇలాంటి అభ్యంతరకరమైన జూన్టీన్త్ లెన్స్ రూపొందించినందుకు క్షమాపణలు చెబుతున్నాము. మా రివ్యూ ప్రాసెస్‌లో మేం ఈ లెన్స్ వాడకానికి అనుమతి నివ్వలేదు. దీనికి సంబంధి దర్యాప్తు చేస్తున్నాము. మరోసారి ఇలాంటిది పునరావృతం కాదు’ అని ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరింది. అమెరికాలో బానిసలుగా ఉన్న ప్రజల విముక్తి జ్ఞాపకార్థం జూన్ 19న సెలవుదినంగా జరుపుకుంటారు. దీనిని మొదట 1865లో టెక్సాస్‌లో జరుపుకున్నారు. అంతర్యుద్ధం తరువాత 1862 విముక్తి ప్రకటన నిబంధనల ప్రకారం బానిసలకు స్వేచ్ఛగా ప్రకటించారు. దీంతో ప్రతి సంవత్సరం జూన్19(జూన్టీన్త్ డే)న వేడుకలు చేసుకుంటారు. (ఐటీ చరిత్రలో సంచలన కలయిక) We deeply apologize for the offensive Juneteenth Lens. The Lens that went live hadn’t been approved through our review process. We are investigating so this doesn’t happen again. — Snapchat (@Snapchat) June 19, 2020 This SnapChat #Juneteenth filter is...um...interesting. Smile to break the chains? Okay then. pic.twitter.com/Wyob3kT3ew — Mark S. Luckie (@marksluckie) June 19, 2020 -
ఇక ఫేస్బుక్ నుంచి వాట్సాప్ మెసేజ్
న్యూయార్క్: అదేంటి.. ఫేస్బుక్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ ఎలా పంపుతాం? అనే కదా.. అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి పంపుకోండి! అర్థం కాలేదు కదూ..? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌ను కలుపుతూ ఒకేసారి మెసేజ్‌లను పంపే సేవలను ప్రారంభించాలని ఫేస్బుక్ యాజమాన్యం భావిస్తోంది. ఈ మూడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం వేర్వేరు మొబైల్ యాప్స్‌లా పనిచేస్తున్నాయి. కానీ, ఈ మూడూ ఒక ప్లాట్ఫామ్లో ఒకదాని నుంచి ఇంకో దానికి సులభంగా మెసేజ్ పంపించేలా వాటిని అనుసంధానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడంవల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ప్రైవసీకి సంబంధించి సమస్యలు తలెత్తుతాయా? అనే కోణాల్లో పరీక్షిస్తున్నారు. ఇవన్నీ విజయవంతమైతే ఇక ఫేస్బుక్లో ఉన్న వ్యక్తి వేరే వారికి వాట్సాప్ సందేశం కూడా పంపించొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది చివరికి, లేదా 2020 ప్రారంభంలో ఈ రకమైన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందంటున్నారు. -
విండోస్ 10కు కొత్త ఫేస్ బుక్, మెసెంజర్ యాప్స్
న్యూయార్క్ : ఎన్నో నెలల బీటా టెస్టింగ్ అనంతరం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, విజయవంతంగా కొత్త ఫేస్ బుక్, మెసెంజర్ యాప్ లను విండోస్ 10 లో ప్రవేశపెట్టింది. అదేవిధంగా విండోస్ 10లో ఫోటో షేరింగ్ ఇన్ స్టాగ్రామ్ యాప్ ను కూడా అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ యాప్ లను కేవలం విండోస్ 10 డెస్క్ టాప్ పైనే ప్రవేశపెట్టింది. విండోస్ 10 మొబైల్ ఫోన్లకు ఇవి సపోర్టు చేయవని ఫేస్ బుక్ పేర్కొంది. విండోస్ 10 ఫోన్లకి ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్సన్ లకు సమానంగా, అన్నీ రకాలైన ఫీచర్లతో (కామెంట్లకు ప్రతిస్పందనలు తెలపడం, స్టికర్లను యాడ్ చేసుకోవడం, ఈవెంట్ రిమైండర్లు, బర్త్ డేలకు కాలమ్) విండోస్ 10 వినియోగదారుల ముందుకు ఈ యాప్ లను తీసుకొచ్చింది. యాజర్లు న్యూస్ ఫీడ్ కు ఆర్టికల్స్ ను షేర్ చేసుకోవడానికి కూడా వీలుగా ఈ యాప్ ఉంటుందని కంపెనీ చెప్పింది. కానీ లైవ్ వీడియో బ్రాండ్ కాస్టింగ్ కు మాత్రం ఇది సపోర్టు చేయదని, త్వరలో దాన్ని కూడా ప్రవేశపెడతామని తెలిపింది. ఫేస్ బుక్ యాప్ మాదిరిగానే మెసెంజర్ యాప్ కూడా అన్నింటికీ వీలుగా ఉంటుందని పేర్కొంది. ఫోటోలు, వీడియోలు, చెల్లింపులు, వీడియో, వాయిస్ కాలింగ్ లకు మాత్రం మెసెంజర్ యాప్ ఇప్పట్లో సపోర్టు చేయదని, కొద్ది కాలం అనంతరం దాన్ని అప్ డేట్ చేస్తామని ఫేస్ బుక్ వెల్లడించింది.