ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టెలిగ్రామ్ వినియోగదారులు ఉచితంగానే దీని సేవలను పొందుతున్నారు. తాజాగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ యూజర్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపాడు. వచ్చే ఏడాది నుండి టెలిగ్రామ్ లో రాబోయే కొన్ని ఫీచర్స్ వాడుకోవాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే అని తెలిపారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ మాట్లాడుతూ.. మార్కెట్లో పోటీ కారణంగా ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి కొంత డబ్బులు అవసరమని అన్నారు. 2013లో పావెల్ దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ టెలిగ్రామ్ ను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 500 మిలియన్ల యాక్టీవ్ యూజర్లను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.(చదవండి: వాట్సాప్‌లో క్రిస్మస్ స్టిక్కర్స్ పంపండి ఇలా)
ప్రస్తుతం కంపెనీని విక్రయించే ఆలోచన లేదని, అందువల్ల నిధులు సమకూర్చడానికి ఇతర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని 36 ఏళ్ల దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్ మాజీ సోవియట్ యూనియన్ మరియు ఇరాన్ లలో ఒక ప్రముఖ సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంది. ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ప్రైవేట్ కమ్యూనికేషన్స్, సమాచారం, వార్తలను పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కంపెనీ నిర్వహణ ఖర్చులను చెల్లించాడనికి నేను నా వ్యక్తిగత పొదుపుల నుండి నగదు చెల్లించాను అని దురోవ్ చెప్పారు. ప్రస్తుతం ఫ్రీగా అందిస్తున్న సేవలను అలాగే కొనసాగించనున్నట్లు తెలిపారు. కానీ, కొత్తగా బిజినెస్ టీమ్స్, పవర్ యూజర్స్ కోసం తీసుకురాబోయే ఫీచర్ల కోసం మాత్రం ప్రీమియం యూజర్ల నుండి డబ్బులు వసూలు చేయనున్నట్లు పావెల్ దురోవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment