![Telegram CEO Pavel Durov transformation sparks rumours plastic surgery](/styles/webp/s3/article_images/2024/09/2/Telegram.jpg.webp?itok=jBunjypV)
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్‌లైన్‌లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.
రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.
దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్
ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.
Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn
— Creepy.org (@creepydotorg) September 1, 2024
Comments
Please login to add a commentAdd a comment