ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. యాప్‌కు సంబంధించిన నేరాలకు సంబంధించి దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫ్రెంచ్ రాజధానికి ఉత్తరాన ఉన్న లే బోర్గెట్ విమానాశ్రయంలో ఈ ఫ్రాంకో-రష్యన్ బిలియనీర్‌ను నిర్బంధించినట్లు అధికారి ఒకరు ఏఎఫ్‌పీకి చెప్పారు. ఆయన అజర్‌బైజాన్‌లోని బాకు నుండి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు కేసుకు దగ్గరగా ఉన్న మరొకరు తెలిపారు. దురోవ్‌ను ఆదివారం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సమాచారం.
మైనర్లపై హింసను నిరోధించడంలో కృషి చేసే ఫ్రాన్స్‌కు చెందిన ఆఫ్మిన్ సంస్థ మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తులో సమన్వయ ఏజెన్సీగా దురోవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసుకు దగ్గరగా ఉండే మరో అధికారి ఈ విషయాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment