మాట్లాడుతున్నసమాఖ్య ప్రతినిధి శ్రీనివాసరావు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
Published Thu, Jul 28 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
శ్రీకాకుళం అర్బన్ : ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందామని పలువురు వక్తలు అన్నారు. ‘బ్యాంకుల విలీనాలు ఎవరి కోసం?’ అనే అంశంపై శ్రీకాకుళం జిల్లా బెఫీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్‌జీవో కార్యాలయంలో పలు సంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెఫీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధి ఎం.శ్రీనివాసరావు, ఎస్‌బీఐ ప్రతినిధి ఎం.రమేష్‌లు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు. ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు అందాలని చెప్పే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే యోచనలో ఉందని దుయ్యబట్టారు. దీనిలో భాగంగానే ఐదు స్టేట్‌బ్యాంక్ అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. సీఐటీయూ ప్రతినిధి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టమన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు వీజీకె మూర్తి, ఎల్‌ఐసీ యూనియన్ ప్రతినిధి టేకి ఆచారి, వివిధ సంఘాల ప్రతినిధులు వీరభద్రరావు, గౌరినాయుడు, కొప్పల భానుమూర్తి, గొంటి గిరిధర్, పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు.
Advertisement