city bank
-
నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు..ఖాతాదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే!
భారత్‌లో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 120 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ ఇక పాత జ్ఞాపకంగా మిగిలి పోనుంది. తాజా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్ అకౌంట్ల కార్యకలాపాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగనున్నాయి. భారత్‌లో నమ్మకం నుంచే మొదలయ్యే బ్యాంకింగ్ బిజినెస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక దేశీ, విదేశీ బ్యాంకులు పోటీ పడ్డాయి. వాటిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన సిటీ బ్యాంక్ ఒకటి. సిటీ బ్యాంక్ సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. అలా 120 ఏళ్లగా సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు అమ్ముతున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడినట్లు సమాచారం. తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్‌లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం..రూ. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్ సేవల నుంచి తప్పుకుంది. ఆందోళనలో సిటీ బ్యాంక్ కస్టమర్లు ఇక సిటీ బ్యాంక్‌ను..యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్ యాజమాన్యం తన వెబ్ సైట్లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్స్క్షన్లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిటీ బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు: ► సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ► అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ► బ్యాంక్ అకౌంట్లు ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లలో ఎటువంటి మార్పు ఉండదు. ► సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్,క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు. ► క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ► క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ► లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్ కోసం అకౌంట్ నెంబర్‌తో పాటు డీపీ ఐడీ (Depository Participant Identification) అలాగే ఉండనుంది. లావాదేవీల కోసం జారీ చేసిన డీఐ స్లిప్‌లు (Delivery Instruction) చెల్లుబాటులో ఉంటాయి. ► సిటీ బ్యాంక్‌లో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► రుణాల కోసం, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది. -
జియో, ఎయిర్‌టెల్‌కు కౌంటర్ : వొడాఫోన్ సూపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశం తరువాత నుంచి జోరందుకున్న టారిఫ్‌ల వార్ కొనసాగుతోంది. తాజాగా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోకు షాకిచ్చేలా వొడాఫోన్ అద్భుత ఆఫర్ ప్రకటించింది. తాజాగా, వొడాఫోన్ తన యూజర్లకోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీబ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇది వోడాఫోన్ ఎగ్జిస్టింగ్ యూజర్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ లాంటి ప్రయోజనాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ప్యాకేజీలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత ఫోన్ కాల్స్ ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది. ఇది కేవలం వొడాఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ వెబ్సైట్ ద్వారా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఇప్పటికే వోడాఫోన్ యూజర్ అయి ఉండాలి. (ఫస్ట్ టైమ్ వోడాఫోన్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు) . సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన నెల రోజుల్లోనే క్రెడిట్ కార్దు ద్వారా ఒకేసారి లేదా దఫ దఫాలుగా రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. వోడాఫోన్ లేదా ఐడియా వెబ్సైట్ ద్వారాగానీ, ఎక్కడైనా ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ మొత్తం ఖర్చు చేసిన అనంతరం ఆటోమేటిక్‌గా వొడాఫోన్ ఆఫర్‌కు యూజర్ అర్హుడవుతారు. ఇందుకు సంబంధించిన బెనిఫిట్స్ 45 రోజుల్లో వొడాఫోన్‌కు క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత నుంచి రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపించుకునే సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆఫర్ వాలిడిటీ సంవత్సరం (365) రోజులు. అయితే ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది ఈ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్ పరిమిత సర్కిళ్లకు మాత్రమే అంటే..ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు, వడోదర, చండీగఢ్, సికింద్రాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే నగరాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్‌ను విస్తరిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వోడాఫోన్ వెబ్సైట్ ప్రకారం ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు ఉంది. మరిన్ని వివరాలు వొడాఫోన్ వెబ్సైట్లో కాగా ఎయిర్టెల్ తరహాలోనే వొడాఫోన్ కూడా 1699 రూపాయల వార్షిక ప్లాన్‌ను ఇప్పటికే లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజుకు 100ఎస్ఎంఎస్లు, 1 జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
సిటీ బ్యాంకుకు భారీ జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిటీ బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా ప్రధాన కేంద్రంగా సేవలు అందించే సిటీ బ్యాంకుకు భారతీయ రిజర్వు బ్యాంకు రూ.3 కోట్లు జరిమానా విధించింది. 'ఫిట్-అండ్-సబ్జెక్ట్ క్రైటీరియా'కు సంబంధించి సూచనలను పాటించలేదంటూ ఆర్బీఐ పెనాల్టీ విధించింది. ఆదేశాల మేరకు డైరెక్టర్ల నియామకంలో నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారమని రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సమర్థులైన డైరెక్టర్లను నియమించాలని, సరైన అర్హతలుండాలని ఆర్బీఐ గతంతో బ్యాంకును ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించక పోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2019, జనవరి 3న ఆర్బీఐ రూ.3 కోట్లు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే వినియోగదారుల లావాదేవీలతో ఈ జరిమానాకు ఎలాంటి సంబంధం లేదని రిజర్వ్‌బ్యాంకు స్పష్టం చేసింది. కాగా అమెరికా ఆధారిత సిటీబ్యాంక్ 115 సంవత్సరాలుగా భారతదేశంలో పనిచేస్తోంది. భారత్‌లో సిటీ బ్యాంకుకు 35 బ్రాంచీలు, 541 ఎటిఎంల నెట్‌వర్క్‌లు ఉన్నాయి. మరోవైపు గత జులై జూలై 2013 లో, కేవైసీ నిబంధనలు, అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన సూచనల ఉల్లంఘనకు సిటీబ్యాంకు "హెచ్చరిక లేఖ" జారీ చేసింది. -
రూ.1000 కంటే ఎక్కువ ఇవ్వొద్దు : ఆర్బీఐ
సాక్షి, ముంబై : కరెన్సీ కొరత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. విత్ డ్రాల కోసం ఖాతాదారులు బ్యాంకులను ఆశ్రయిస్తున్న తరుణంలో.. పరిమితి విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రూ.1000 కంటే మించి ఖాతాదారులకు ఇవ్వొద్దని ముంబైకి చెందిన సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటిని మరిన్ని బ్యాంకులకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. (ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరిక) ‘సేవింగ్.. కరెంట్.. ఏ తరహా అకౌంట్ అయినా సరే రూ.1000 కి మించి ఇవ్వొద్దు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు పాటించాలి’ అని ఆదేశాల కాపీలో బ్యాంక్‌కు ఆర్బీఐ తెలిపింది. మరోపక్క లోన్లు, అడ్వాన్స్ విషయంలో కూడా ఆర్బీఐ నుంచి అనుమతి లేనిదే లోన్లు, అడ్వాన్లు.. జారీ చేయటానికి వీల్లేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ పరిస్థితులు తాత్కాలికమేనని.. త్వరలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆర్బీఐ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్ల ద్వారా రోజుకు రూ.2000 వరకు నగదును కస్టమర్లు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. -
నెలాఖరుకల్లా ఐవోసీ డిజిన్వెస్ట్‌మెంట్!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా ఆయిల్ దిగ్గజం ఐవోసీలో 10% వాటాను ఈ నెలాఖరుకల్లా విక్రయించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ ఏడాదిలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ. 40,000 కోట్లను సమీకరించాలని ఆర్థిక శాఖ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఐవోసీలో వాటాను విక్రయించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరుకల్లా ఐవోసీలో 10% వాటాను విక్రయించడం ద్వారా ఇంజినీర్స్ ఇండియా తదితర సంస్థల డిజిన్వెస్ట్మెంట్కు ఊపుతేవాలని యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, కంపెనీ షేరు ధర కనిష్ట స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో ఇటు కంపెనీ, అటు పెట్రోలియం శాఖ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, గత శుక్రవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు రూ. 213 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ప్రభుత్వానికి 10% వాటాకుగాను రూ. 4,000 కోట్లకుపైగా లభించే అవకాశముంది. కంపెనీలో ప్రభుత్వానికి 78.92% వాటా ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వం సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీసహా ఐదుగురు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది కూడా.