
సాక్షి, ముంబై : ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ తన బేస్ రేటు(రుణాలపై కనీస వడ్డీ) పెంచినట్లు గురువారం ప్రకటించింది. బేస్ రేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో యాక్సిస్ బ్యాంకు బేస్ రేటు 9.2 నుంచి 9.5 శాతానికి పెరిగింది.
అయితే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్) యథాతథంగా ఉంచినట్లు తెలిపింది. పెంచిన బేస్‌రేటు ఈరోజు(జనవరి 3)నుంచే అమలులోకి వచ్చిందని యాక్సిస్ బ్యాంక్ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment