base rate
-
ఇక వడ్డీ రేట్లు పైపైకే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరెంతోకాలం సరళతర ద్రవ్య, పరపతి విధానాన్ని కొనసాగించలేదన్న సంకేతాలు అందుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్ల పెంపు దిశగా తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. మరికొన్ని బ్యాంకులూ దీనిని అనుసరించే అవకాశం ఉంది. ఎస్బీఐ విషయానికి వస్తే కొన్ని డిపాజిట్ రేట్లను– రుణరేట్లను పెంచుతూ బ్యాంకింగ్ దిగ్గజం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటుకు సంబంధించిన బేస్ రేటునూ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. దీనితో బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా బేస్ రేటు 7.55 శాతానికి చేరింది. ఎస్బీఐ వెబ్సైట్ ఈ విషయాన్ని తెలిపింది. బేస్ రేటు అంటే ఒక బ్యాంక్ అనుసరించే కనీస వడ్డీరేటు. బేస్ రేటుకు అనుసంధానమైన వడ్డీరేట్లు ఇంతకన్నా (బేస్ రేటు) తక్కువ ఉండవు. కొత్త రేటు డిసెంబర్ 15వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కూడా బ్యాంక్ వెబ్సైట్ వివరించింది. గడచిన రెండేళ్లలో ఎస్బీఐ బేస్ రేటును పెంచడం ఇదే తొలిసారి. అయితే ఎస్బీఐ మొత్తం రుణాల్లో బేస్ రేటుకు అనుసంధానమై ఉన్నవి కేవలం 2.5% మాత్రమే కావడం గమనార్హం. 2019 జనవరి ముందు రుణాలకు వర్తింపు కాగా తాజా నిర్ణయం జనవరి 2019 నుండి రుణం తీసుకున్న వారికి వర్తించదు. అంతకుముందు రుణం తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వడ్డీరేట్ల విధానంలో పారదర్శకతే లక్ష్యంగా 2019 జనవరి నుంచీ బేస్ రేటు విధానం నుంచి ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) విధానానికి మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)కు ఈబీఎల్ఆర్ అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు మార్పులకు అనుగుణంగా ఈబీఎల్ఆర్ ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి, రుణ, డిమాండ్, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమావేశాల్లో సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా కీలక రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ కూడా... బేస్ రేటు విధానం ప్రారంభానికి (2010 జూలై 1) ముందు అమల్లో ఉన్న బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)నూ 10 బేసిస్ పా యింట్లు అంటే 12.2% నుంచి 12.3 %కి పెంచింది. డిపాజిట్ రేటు పెంపు తీరు.. మరోవైపు రూ.2 కోట్లు పైబడి విలువ కలిగిన డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 7.55 శాతానికి చేరింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు... రెండు పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)– బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఐదు సంవత్సరాల వరకూ డిపాజిట్లపై ఈ నెలారంభంలో వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచాయి. డిసెంబర్ 10 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటును స్వల్పంగా 0.05 శాతం పెంచింది. దీనితో బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం నుంచి 6.55 శాతానికి పెరిగింది. కీలక సమయం ఆసన్నం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి. అయితే ఇక్కడ క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవద్దని లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం నుంచి వైదొలగాలని చెప్పడం ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తు ప్రయోజనాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. ఇప్పుడు కీలక నిర్ణయాలకు సమయం ఆసన్నమైంది. ఉదయ్ కోటక్, కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ మరెంతో కాలం సాగదు... మహమ్మారి నేపథ్యంలో మనం అతి తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థను చూశాం. అయితే ఇది ఎంతోకాలం సాగా పరిస్థితి లేదు. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులకు సంబంధించి ఆర్బీఐ రివర్స్ రెపో మార్గంలో పొందుతున్న వడ్డీరేట్లలో పెరుగుదలను ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ రేటు 3.35 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఈ స్థాయి నుంచి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష నిర్ణయాలపై బ్యాంకింగ్ వేచి చూస్తోంది – అశిష్ పార్థసారథి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్రజరీ చీఫ్ ఒక శాతం పెరిగే అవకాశం భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) సరళతర విధానాల నుంచి వెనక్కు మళ్లే అవకాశం ఉంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) ఒక శాతం పెరగవచ్చు. 2022ని భారతదేశం ‘సాధారణ పాలసీ సంవత్సరంగా’ పరిగణిస్తోంది. వినియోగం ద్వారా వృద్ధి రికవరీ పటిష్టం అవుతుందని భావిస్తున్నాం. 2–6 శాతం శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుంద్నది మా అభిప్రాయం. – బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక -
GST Base Price: ‘బేస్’తో బాదేస్తున్నారు
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టినప్పుడు ఎల్ఈడీ టీవీలపై పన్ను రేటు 28 శాతంగా నిర్ణయించారు. 2018లో 24, 32 అంగుళాల ఎల్ఈడీ టీవీలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. జీఎస్టీ 28 శాతం ఉన్నపుడు షోరూమ్‌ల్లో 24 అంగుళాల టీవీ ధర రూ. 11 వేలుగా, 32 అంగుళాల టీవీ ధర రూ. 17,500గా ఉండేవి. జీఎస్టీ 18 శాతానికి తగ్గిన తర్వాత కూడా అవే రేట్లతో షోరూముల్లో అమ్ముతున్నారు. కంపెనీలు, షోరూమ్‌లు ఆ టీవీల బేస్ రేట్ పెంచేసి వినియోగదారుడికి దక్కాల్సిన లాభాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీ డీఆర్ఐ) ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. సాక్షి, అమరావతి: పలు రకాల గృహ వినియోగ ఉపకరణాల్లో జీఎస్టీ రేటు తగ్గినా.. ఆ లాభం వినియోగదారుడికి చేరడంలేదు. బేస్ రేటు(మూల)లో మాయాజాలంతో కంపెనీలు, షోరూమ్‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. ఈ అక్రమాలపై సమాచారంతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ డీఆర్ఐ డైరెక్టర్ ఎస్.నరసింహారెడ్డి ప్రత్యేక బృందాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు విక్రయించే షోరూమ్‌ల్లో తనిఖీలకు ఆదేశించారు. జీఎస్టీ తగ్గిన మేరకు రాష్ట్రంలో టీవీల ధరలు తగ్గాయా లేదా అని అధికారులు పరిశీలించారు. ఆయా షోరూమ్‌ల్లో రికార్డులు పరిశీలించగా.. బేస్ ధర పెంచి అమ్మకాలు సాగిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు బయటపడింది. ఈ మేరకు అధికారులు పలు షోరూమ్‌లపై కేసు నమోదు చేశారు. ఇదీ బేస్ ధర.. మోసం సాధారణంగా ఒక వస్తువు తయారీ ఖర్చు, ఉత్పత్తిదారుని లాభం, అమ్మకందారుని లాభం కలుపుకొని బేస్ ధర నిర్ణయిస్తారు. దీనికి పన్ను జోడిస్తే ఎంఆర్పీ అవుతుంది. ఆ బేస్ ధరని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలను పట్టించుకోకుండా కంపెనీలు, షోరూమ్‌లు కుమ్మక్కయి బేస్ ధరను పెంచేశాయి. కేంద్రం నిర్ణయించినట్లు జీఎస్టీని తగ్గించి రశీదుల్లో చూపుతున్నాయి. బేస్ ధరను మాత్రం పెంచి పాత ధరకే విక్రయిస్తున్నాయి. దీంతో జీఎస్టీ తగ్గినా టీవీ ధర మాత్రం తగ్గడం లేదు. టీవీల్లోనే ఏటా రూ. 80 కోట్లకు పైగా మోసం ‘కౌంటర్ పాయింట్ టీవీ ట్రాకర్ సర్వీస్’ నివేదిక ప్రకారం దేశంలో 2018 నుంచి టీవీల మార్కెట్ 15 శాతం చొప్పున పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఏడాదికి సగటున 1.50 కోట్ల టీవీ సెట్లు విక్రయిస్తున్నారు. వాటిలో సామాన్యులు కొనుగోలు చేసే 24 అంగుళాలు, 32 అంగుళాల టీవీలదే 85 శాతం వాటా. మన రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 8 లక్షల టీవీలు విక్రయిస్తున్నారని అంచనా. ఒక్కో టీవీ మీద సగటున రూ. వెయ్యి చొప్పున మోసానికి పాల్పడినా.. ఏడాదికి రూ. 80 కోట్ల వరకు దోపిడీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఫ్రిడ్జ్‌ల నుంచి సబ్బుల వరకూ... బేస్ రేట్ల మోసం టీవీలకే పరిమితం కాలేదు. ఫ్రిడ్జ్‌ల నుంచి సబ్బుల వరకు ఈ దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ(ఎన్ఏఏ) దేశవ్యాప్తంగా పలు షోరూమ్‌లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు అత్యధికంగా అమ్ముడయ్యే వినియోగదార ఉత్పత్తుల (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్– ఎఫ్ఎంసీజీ) విక్రయాలను పరిశీలిస్తే వాటిల్లో కూడా మోసానికి పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, సూట్‌కేసులు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, డిటర్జెంట్లు, డియోడరెంట్లు, సబ్బులు, కాఫీ పౌడర్లు, శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, అంబులెన్స్ ఉపకరణాలతో పాటు అపార్టుమెంట్లులో ఫ్లాట్లపై ధరల నిర్ణయంలో కూడా కంపెనీలు, షోరుమ్‌లు మోసాలకి పాల్పడుతున్నాయి. వాటిలో వివిధ వస్తువులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18, 12, 5 శాతానికి తగ్గించినా.. ఆ లాభాన్ని వినియోగదారులకు అందకుండా చేస్తున్నారు. కంపెనీలు, షోరూమ్‌ల విక్రయాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే భారీ మోసం బయటపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
పరిశ్రమలకు ‘లో బేస్’ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తిపై మే నెల్లో ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 29.3 శాతం పురోగమించింది. గణాంకాల ప్రకారం తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి ఫలితాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే సూచీలు మహమ్మారి ముందస్తు స్థాయికన్నా ఇంకా దిగువనే ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 90.2 పాయింట్లకు పడిపోయింది. 2021 మేలో (తాజా సమీక్షా నెల్లో 116.6 పాయింట్లకు ఎగసింది. అంటే పెరుగుదల 29.3 శాతం. ఇక కరోనా ముందు 2019 మే నెల్లో సూచీ 135. 4 పాయింట్లుగా ఉంది. అంటే 2019 మే ఐఐపీతో పోల్చితే 2020 మేలో సూచీ వృద్ధి లేకపోగా 33.5 శాతం క్షీణించిందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన కీలక విభాగాల లెక్కల తీరు క్లుప్తంగా.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం కలిగిన ఈ విభాగం వృద్ధి 34.5 శాతం. 2020లో 37.8 శాతం క్షీణత నమోదయ్యింది. ► మైనింగ్: వృద్ధి 23.3 శాతం (2020 మేలో 20.4 శాతం క్షీణత) ► విద్యుత్: 2020 మేలో 14.9 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో 7.5 శాతం పురోగతి సాధించింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులు, భారీ యంత్ర సామగ్రి ఉత్పత్తికి సంకేతమైన ఈ విభాగంలో 65.9 శాతం క్షీణత.. 2021 మేలో 85.3 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్ల వంటి ఈ ఉత్పత్తుల విభాగం 70.3 శాతం క్షీణత నుంచి బయటపడి 98.2 శాతం పురోగమించింది ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, ఫేస్ క్రీమ్స్, పౌడర్ల వంటి ఉత్పత్తులకు సంబంధించిన ఈ ఎఫ్ఎంసీజీ విభాగం 9.7% క్షీణత నుంచి బయటపడి స్వల్పంగా 0.8% పెరిగింది. 2020 మార్చి నుంచీ ఒడిదుడుకులు.. కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25, మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (–0.6 శాతం)జారిపోయింది. ధరలు తగ్గినా.. ఆర్బీఐ లక్ష్యానికి ఎగువనే..! జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ముందు నెల మేతో పోల్చితే స్వల్పంగా ఉపశమించింది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యంకన్నా ఎగువన 6.26 శాతంగా నమోదయ్యింది. మే నెల్లో ఇది 6.3%. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకా ప్రకారం వార్షికంగా చూస్తే (2020 జూన్‌తో పోల్చి) ఆహార ద్రవ్యోల్బణం 5.15%గా ఉంది (మేలో 5.01%) ఇక చమురు, వెన్న పదార్థాల ధరలు ఏకంగా 34.78% ఎగశాయి. పండ్ల ధరలు 11.82 శాతం పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 0.7% తగ్గాయి. విద్యుత్, లైట్ విషయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 12.68%. కాగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో వరుసగా 6.16%, 6.37%గా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఎస్ఓ సిబ్బంది వ్యక్తిగతంగా 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామీణ మండీల నుంచి వారంవారీగా గణాంకాల సేకరించి నెలవారీ ద్రవ్యోల్బణాన్ని మదింపుచేస్తారు. ఆర్బీఐ కీలక పాలసీ రేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి పరపతి విధాన కమిటీ యథాతథంగా 4%గా కొనసాగిస్తోంది. -
గణాంకాలు.. ‘బేస్ మాయ’!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మార్చిలో భారీగా 22.4 శాతం వృద్ధిని (2020 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణం. ‘లో బేస్ రేటు ఎఫెక్ట్’ వల్ల ఐఐపీ 17.5 శాతం నుంచి 25 శాతం శ్రేణిలో ఉండవచ్చని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ సహా పలువురి అంచనాలకు అనుగుణంగానే తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. ఇక ఏప్రిల్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. దీనికి కూడా 2020 ‘హై బేస్ ఎఫెక్ట్’ కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2 నెలల తర్వాత పరిశ్రమలు వృద్ధిబాటకు.. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెపె్టంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.5 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచి్చంది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 1.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 2.2 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా, తిరిగి జనవరిలో క్షీణతలోకి (-0.9 శాతం)జారిపోయింది. రెండవ నెలా ఫిబ్రవరిలోనూ మైనస్ 3.4 శాతంలో పారిశ్రామిక రంగం పడిపోయింది. అయితే బేస్ ఎఫెక్ట్ దన్నుతో మూడవ నెల– మార్చిలో భారీ వృద్ధికి జంప్ చేసింది. ఈ కారణంగానే ‘తాజా గణాంకాలను మహమ్మారి ముందు నెలలతో పోల్చి చూడడం సరికాకపోవచ్చు’ అని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను పరిశీలిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ భాగంలో మార్చి వృద్ధి 25.8 శాతంగా నమోదయ్యింది. మార్చి 2020లో 22.8 శాతం ఈ విభాగం పతనమైంది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 6.1 శాతం (2020 మార్చిలో 1.3 శాతం క్షీణత) విద్యుత్: 22.5 శాతం పురోగతి (గత ఏడాది మార్చిలో 8.2 శాతం క్షీణత) క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి, డిమాండ్‌కు సంకేతమయిన ఈ విభాగం 38.3 శాతం క్షీణత (2020 మార్చి)నుంచి 41.9 శాతం వృద్ధి బాటకు మారింది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి ఈ విభాగంలో 36.8% క్షీణత తాజా సమీక్షా నెల్లో 54.9% వృద్ధికి మారింది. మౌలిక రంగాల గ్రూప్ ఇలా...: ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 2021 మార్చి ఉత్పత్తి వృద్ధి రేటు భారీగా 6.8 శాతంగా నమోదయ్యింది. ఏప్రిల్‌లో ముగిసిన 2020–21లో ఐఐపీ 8.6 శాతం క్షీణతను చవిచూసింది. ఇదీ... బేస్ ఎఫెక్ట్ ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్ప టితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్కడ 2020 మార్చిలో 18.7% క్షీణత నమోదుకావడం (లో బేస్) ఇక్కడ గమనార్హం. అప్పటి నుంచీ 2020 ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తి మైనస్‌లోనే ఉంది. ఈ ప్రాతిపదికన ఆగస్టు వరకూ పారిశ్రామిక ఉత్పత్తిలో భారీ వృద్ధి రేట్లు నమోదయ్యే అవకాశాలే అధికం. రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌తో ధరలు పెరగడం (హై బేస్) తాజా గణాంకాల్లో ‘రేటు(%) తగ్గుదల’ను సూచిస్తుందన్నది విశ్లేషణ. తగ్గిన కూరగాయల ధరలు రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఏప్రిల్‌లో 3 నెలల కనిష్టం 4.29%గా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదైంది. కూరగాయలు, తృణ ధాన్యాల వంటి నిత్యావసరాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఆహార ద్రవ్యోల్బణం 2.02% తగ్గి 4.87%కి దిగివచ్చింది. గణాంకాల ప్రకారం, కూరగాయల ధరలు 14.18 శాతం తగ్గాయి. చక్కెర, సంబంధిత ఉత్పత్తుల ధరలు 5.99% తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.96% దిగివచ్చాయి. కఠిన లాక్డౌన్ పరిస్థితుల్లో 2020 ఏప్రిల్‌లో సీపీఐ గణాంకాలు అధికారికంగా విడుదల కాలేదు. అయితే అప్పటి లాక్డౌన్ వల్ల రిటైల్ ధరలు తీవ్రంగా ఉన్నాయని అప్పటితో పోలి్చతే ఇప్పుడు ధరలు తగ్గడం (హై బేస్ వల్ల) ‘శాతాల్లో’ కొంత సానుకూలత చూపుతోందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ పేర్కొన్నారు. చదవండి: కరోనా పోరులో భారత్‌కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ -
రిలయన్స్ గ్యాస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: కొనుగోలుదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కేజీ–డీ6 బ్లాక్‌లో కొత్తగా ఉత్పత్తి చేయబోయే గ్యాస్ బేస్ ధరను రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని ఆర్–క్లస్టర్ క్షేత్రం నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ కొనుగోలు కోసం రిలయన్స్ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బిడ్డింగ్ నిబంధనల ప్రకారం.. గడిచిన మూడు నెలల బ్రెంట్ క్రూడ్ సగటు రేటులో 9 శాతం స్థాయిలో గ్యాస్ బేస్ ధరను నిర్ణయించింది. తాజా మార్పుతో బేస్ రేటు 8.4 శాతం స్థాయిలో ఉండనుంది. -
బేస్ రేట్ పెంచిన యాక్సిస్ బ్యాంకు
సాక్షి, ముంబై : ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ తన బేస్ రేటు(రుణాలపై కనీస వడ్డీ) పెంచినట్లు గురువారం ప్రకటించింది. బేస్ రేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో యాక్సిస్ బ్యాంకు బేస్ రేటు 9.2 నుంచి 9.5 శాతానికి పెరిగింది. అయితే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) యథాతథంగా ఉంచినట్లు తెలిపింది. పెంచిన బేస్‌రేటు ఈరోజు(జనవరి 3)నుంచే అమలులోకి వచ్చిందని యాక్సిస్ బ్యాంక్ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. -
అలహాబాద్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్ బ్యాంకు రుణ వడ్డీరేట్లపై గుడ్‌న్యూస్ చెప్పింది. బేస్ రేటును, బెంచ్‌మార్కు ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను 45 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గిస్తున్నట్టు అలహాబాద్ బ్యాంకు పేర్కొంది. దీంతో తక్కువ ఈఎంఐలకు రుణాలకు లభించనున్నాయి. తగ్గింపు నిర్ణయంతో బేస్ రేటు 9.60 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది. బెంచ్‌మార్కు ప్రైమ్ లెండింగ్ రేటు కూడా 13.85 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. బేస్ రేటును, బీపీఎల్ఆర్ను 45 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించాలని బ్యాంకు అసెట్ లైబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించిందని బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమీక్షించిన రేట్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. -
బ్యాంకు బేస్ రేటు దానికి లింక్
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రుణాలన్నింటినీ బేస్ రేటు నుంచి ఎంసీఎల్ఆర్కి అనుసంధానం చేయనున్నట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(ఎంసీఎల్ఆర్) సిస్టమ్‌ను ఆర్బీఐ 2016 ఏప్రిల్ 1 నుంచే తీసుకొచ్చింది. బేస్ రేటు పాలనలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ ఎంసీఎల్ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బేస్ రేటుతో లింక్ అయి ఉన్న రుణాలు, ఇతర క్రెడిట్ ఎక్స్పోజర్స్లు ఎంసీఎల్ఆర్ విధానంలోకి మార్చనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు చాలా బ్యాంకు రుణాలు బేస్ రేటుతోనే లింక్ అయి ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించిన్నప్పటికీ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించడం లేదని, ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయడానికి సమయం తీసుకుంటున్నాయని ఆర్బీఐ గుర్తించింది. అంతేకాక ఆర్బీఐ బెంచ్‌మార్కు రేట్ల తగ్గింపుకు అనుగుణంగా లెండింగ్ రేట్ల తగ్గింపు ఉండటం లేదని తెలిపింది. దీనిపై పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వస్తుండటంతో, ఈ ఎంసీఎల్ఆర్ సిస్టమ్‌ను ఆర్బీఐ తీసుకొచ్చింది. రుణాల బేస్ రేటును ఎంసీఎల్ఆర్కి అనుసంధానం చేయాలని కూడా నేడు ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ మోడ్‌లో బ్యాంకులు అర్థరాత్రి, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల రేట్లను ప్రతి నెలా సమీక్షించే, ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో త్వరితగతిన కీలక వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు చేరుతాయి. బేస్ రేటు కన్నా ఈ ఎంసీఎల్ఆర్ విధానంలో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. -
త్వరలోనే దిగ్గజ బ్యాంకుల నుంచి న్యూఇయర్ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాదిరి దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు త్వరలోనే న్యూఇయర్ గిఫ్ట్‌ను ప్రకటించబోతున్నాయి. దిగ్గజ బ్యాంకుల మధ్య పోటీగా పెరుగబోతుండటంతో, రుణాలపై వడ్డీరేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బ్యాంకుల అసెట్-లైబిలిటీ కమిటీలు త్వరలోనే సమావేశం కాబోతున్నాయని ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తులు చెప్పారు. తక్కువ వడ్డీరేట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న పాత కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చనుందని తెలుస్తోంది. మార్కెట్ లీడరు ఎస్బీఐ నుంచి అన్ని బ్యాంకులు సంకేతంగా తీసుకున్నాయని, తమ కస్టమర్లకు ప్రయోజనాలను బదిలీ చేయనున్నామని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి చెప్పారు. ఇటీవలే గృహ రుణం తీసుకున్న కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఎస్బీఐ తన బేస్ రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. పాలసీ రేట్లలో తగ్గింపును ప్రస్తుతం బ్యాంకులు తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయని ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా తెలిపారు. ప్రత్యర్థులు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు బేస్ రేటు 8.85 శాతముండగా.. యాక్సిస్ బ్యాంకు రేటు 9 శాతం, బ్యాంకు ఆఫ్ బరోడా బేస్ రేటు 9.15 శాతం, పీఎన్బీ బేస్ రేటు 9.35 శాతం ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం ప్రైమ్ లెండ్ రేట్లను అమలు చేయగా... ప్రస్తుతం మాత్రం బ్యాంకులు బేస్ రేట్లకు మారాయి. 2016లో మళ్లీ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను పాటించడం ప్రారంభించాయి. తాజాగా బేస్ రేట్లతో లింక్ అయిన రుణాలు కేవలం పాత కస్టమర్లకు మాత్రమే ఉన్నాయి. -
ఎస్బీఐ రుణ రేట్లు తగ్గాయ్!
ముంబై: ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బేస్ రేటు, బీపీఎల్ఆర్ను 0.3 శాతం మేర తగ్గించింది. దీంతో పాత వడ్డీ రేట్ల విధానంలో రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత కస్టమర్లకు బేస్ రేటును 8.95 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) 13.70% నుంచి 13.40%కి తగ్గించింది. అయితే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) మాత్రం యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ 7.95%గా ఉంది. దీన్ని గానీ మరింతగా తగ్గించి ఉంటే రుణగ్రహీతలందరికీ ప్రయోజనం చేకూరేది. కొత్త రేట్లు జనవరి 1 నుంచే వర్తింపచేస్తున్నట్లు ఎస్బీఐ వివరించింది. ‘డిసెంబర్ ఆఖరు వారంలో వడ్డీ రేట్లను సమీక్షించాం. మా డిపాజిట్ రేట్లను బట్టి .. బేస్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 8.65 శాతానికి కుదించాం. బేస్‌రేటుతో వ్యత్యాసం భారీగా ఉన్న నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ను గతంలోనే తగ్గించాం. ఇది మా ఖాతాదారులకు కొత్త సంవత్సరం కానుక’ అని రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పి.కె. గుప్తా తెలిపారు. ఇటీవల తగ్గిన పాలసీ రేట్ల ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించేందుకు తాజా సమీక్ష తోడ్పడగలదని వివరించారు. గృహ, విద్యా రుణాలు తీసుకున్న పలువురు ఖాతాదారులకు ఇది ఉపయోగపడనుంది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు మార్చి దాకా .. గృహ రుణం ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఆఫర్‌ను ఈ ఏడాది మార్చి దాకా పొడిగిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. కొత్తగా గృహ రుణం తీసుకునే వారు, వేరే బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఎస్బీఐకి బదలాయించుకోవాలని అనుకుంటున్న వారు ఈ ప్రయోజనాలు అందుకోవచ్చు. సుమారు 80 లక్షల మంది ఖాతాదారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్ విధానానికి మళ్లకుండా ఇంకా పాత వడ్డీ రేట్ల విధానంలోనే కొనసాగుతున్నారు. వీరికి తాజా బేస్ రేటు తగ్గింపు ప్రయోజనం చేకూర్చనుంది. -
ఎస్బీఐ బేస్ రేటు కోత
others cuttheir సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు పండుగ శుభవార్త అందించింది. బేస్ రేటులో 5 బేసిస్ పాయింట్లమేర కోత పెట్టింది. ఇప్పటివరకు 9శాతంగా ఉన్న బేస్టు తాజా తగ్గింపుతో ప్రస్తుతం ఎస్బీఐ బేస్ రేటు 8.95 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2016కు ముందు హౌస్‌లోన్ తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలుకానున్నాయని ఎస్బీఐ ప్రకటించింది. అయితే ఎంసీఎల్ఆర్ రేటు ఎలాంటి మార్పులేదు. అక్టోబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చర్యకు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రివ్యూలో బేస్‌రేటులోకోత పెడుతుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. అయితే మైక్రో ఎకానమిక్ డాటా ఆధారంగా రేట్ ఉండకపోవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు బేస్ రేటులో కోతలను అమలు చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా బేస్ రేటును 35 బేసిస్ పాయింట్లమేర కుదించి 9.15 శాతానికి తగ్గించింది. ఈ బాటలో ఆంధ్రా బ్యాంకు సైతం 15 బేసిస్ పాయింట్లు తగ్గించి బేస్ రేటును 9.55 శాతంగా ప్రకటించింది. బ్యాంకులు బేస్ రేటు ఆధారంగా రుణాల మంజూరీని చేపట్టే విషయం విదితమే. -
బేస్ రేటు కోత: ఎస్బీఐ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. బేస్ రేటులో 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అనుబంధ బ్యాంకుల విలీనంతో అతిపెద్ద బ్యాంకు గా అవతరించిన 48 గంటల లోపే పాత వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత బేస్‌రేటు 9.1 శాతంగా ఉండనుంది. ఈ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. గృహ, వాహనాలపై పాత రుణాలపై (మార్చి 31, 2016కు ముందు తీసుకున్న రుణాలు) వడ్డీరేటులో కోత పెట్టింది. గృహ, వాహన రుణాలపై ప్రస్తుత రేటు 9.1 శాతంగా నిర్ణయించింది. అయితే ఎంసీఎల్ఆర్ ను యథతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఎస్బీఐ జనవరిలో ప్రకటించిన వార్షిక రుణ వడ్డీరేట్లను 8 శాతం వద్ద, రెండు సంవత్సరాల వడ్డీరేటును 8.1 శాతం వద్ద యథాతథంతా ఉంచింది. కాగా ఎంసీఎల్ఆర్కు బేస్‌రేటుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో పాత రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోదని ఖాతాదారులు అందోళనవ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 8శాతంగా ఉండగా బేస్ రేటు 9.25శాతం ఉంది. గత పదిహేను నెలల్లో ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ను దాదాపు 1.20శాతంతగ్గించగా బేస్‌రేటును మాత్రం కేవలం 0.05శాతం తగ్గించింది. అయితే అంచనాల ప్రకారం మొత్తం ఫ్లోటింగ్ రేటు రుణాల్లో కేవలం 30-40శాతం ఎంసీఆల్ ఆర్ ఆధారిత లోన్లుకాగా మిగిలిన రుణాలు బేస్ రేట్ ఆధారితం. -
ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ (బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు)ను అయిదు బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. దీంతో బేస్ రేటు 9.70 శాతానికి, బీఎంపీఎల్‌ఆర్ 13.95 శాతానికి తగ్గినట్లు వివరించింది. ఏడాది వ్యవధి రుణాలపై ఎంసీఎల్ఆర్ను పది బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 9.55% నుంచి 9.4%కి తగ్గింది. కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. -
ఐడీబీఐ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు..
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ తాజాగా బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు 9.75 శాతం నుంచి 9.65 శాతానికి తగ్గింది. అలాగే బ్యాంక్ బీపీఎల్ఆర్కు కూడా కత్తెర వేసింది. దీంతో ఇది 14.25 శాతం నుంచి 14.15 శాతానికి పడింది. ఇక బ్యాంక్.. రిటైల్ డిపాజిట్ రేట్లను కూడా 10-25 బేసిస్ పాయింట్ల మధ్యలో తగ్గించింది. తాజా మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఇటీవలనే ఎంసీఎల్ఆర్ను కూడా తగ్గించింది. -
రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్ మంగళవారం బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. దీంతో రుణ గ్రహీతల ఈఎంఐ విలువ తగ్గే అవకాశం ఉంది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్ఆర్ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్.. ఓవర్‌నైట్‌కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72%కి దిగింది. ఇతర మెచ్యూరిటీలకు ఎంసీఎల్ఆర్లో ఎలాంటి మార్పు లేదు. బీపీఎల్ఆర్ను 17.95% నుంచి 17.89%కి త గ్గించింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. -
బేస్ రేటు ఇక తగ్గించం...
► నిధుల సమీకరణ ఈసారి ఉండదు ► ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేస్ రేటును మరింతగా తగ్గించే యోచనేదీ లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక దీనిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉండొచ్చని దక్షిణ ముంబైలోని కొలాబాలో ఇన్టచ్ శాఖను ప్రారంభించిన సందర్భంగా ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ గతేడాది సెప్టెంబర్‌లో కీలక పాలసీ రేట్లను తగ్గించిన తర్వాత ఎస్బీఐ అక్టోబర్‌లో 40 బేసిస్ పాయింట్ల మేర బేస్ రేటును తగ్గించింది. దీంతో ఇది 9.70 శాతం నుంచి 9.30 శాతానికి దిగి వచ్చింది. ఇటీవలే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కూడా 0.05 శాతం మేర బేస్ రేటు తగ్గించి ఎస్బీఐ తరహాలోనే 9.30 శాతం స్థాయికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే బేస్ రేటు అంశంపై భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక బేస్ రేటు లెక్కింపునకు కొత్తగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎఫ్) ఫార్ములాను అమల్లోకి తెచ్చినా పెద్దగా తేడా ఉండబోదని, అయితే వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను మరింత వేగంగా ఖాతాదారులకు బదలాయించేందుకు మాత్రం వెసులుబాటు లభించగలదని భట్టాచార్య వివరించారు. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తే బేస్ రేటును బ్యాంకులు కనీసం 80-160 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాల్సి రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు, మార్చి నాటికి ఎస్బీఐ కొత్తగా మరో 500 శాఖలను ప్రారంభించనుందని, వీటిలో 100 హై టెక్ శాఖలు ఉంటాయని భట్టాచార్య చెప్పారు. ఇప్పట్లో నిధుల సమీకరణ ఉండకపోవచ్చు.. దాదాపు రూ. 12,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ప్రతిపాదనపై స్పందిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ నిధులను సమీకరించే అవకాశాలు లేవని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికలేమీ లేవని వివరించారు. బాసెల్ త్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే టియర్-టూ బాండ్లను ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన విక్రయించడం ద్వారా రూ. 12,000 కోట్లను సమీకరించేందుకు అనుమతులు లభించినట్లు గతేడాది డిసెంబర్ 21న స్టాక్ ఎక్స్చేంజీలకు ఎస్బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డిసెంబర్ 24న ఈ మార్గంలో ఎస్బీఐ రూ. 4,000 కోట్లు సమీకరించింది. ఇక, 2017 మార్చి నాటికల్లా బ్యాంకులు తమ ఖాతాల్లో మొండిబకాయిల భారాన్ని తగ్గించుకోవాలన్న డెడ్‌లైన్‌పై ఆర్బీఐతో బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయని భట్టాచార్య చెప్పారు. అటు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కొత్త చీఫ్‌గా తన పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వాస్తవం కాదన్నారు. ఇదంతా మీడియా సృష్టేనని చెప్పారు. -
రూ. 100 కోట్లతో ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం
-
ఆర్బీఐ బేస్‌రేటు ఫార్ములాతో రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్
రూ. 100 కోట్లతో గచ్చిబౌలిలో ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం - ఎస్బీహెచ్ సైబరాబాద్ జోన్ ప్రారంభం - అందుబాటులోకి మొబైల్ యాప్ ‘ఎస్బీహెచ్ టచ్’ - ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి ఆర్బీఐ పరపతి సమీక్షతో సంబంధం లేకుండా బేస్ రేటు తగ్గే అవకాశం ఉందని ఎస్బీహెచ్ పేర్కొంది. బేస్‌రేటు నిర్ణయించడానికి ఆర్బీఐ నిర్దేశించిన కొత్త ఫార్ములా ప్రకారం దాదాపు అన్ని బ్యాంకులు బేస్ రేటును తగ్గించాల్సి వస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేటు తగ్గించడం వల్ల ఇతర బ్యాంకులపై ఎటువంటి ఒత్తిడి లేదని, త్వరలోనే మా బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటి సమావేశమై బేస్‌రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటందన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డీరేట్లు తగ్గుతున్నా ఇంకా కార్పొరేట్ రుణాల్లో ఎటువంటి వృద్ధి కనిపించడం లేదన్నారు. డిమాండ్ ఉన్న రిటైల్, ఎస్ఎంఈ రంగాలపై తాము అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ఎస్బీహెచ్ 17వ జోనల్ ఆఫీసు ‘సైబరాబాద్జోన్’ను ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించారు. దీంతోపాటు మొబైల్ యాప్ ‘ఎస్బీహెచ్ టచ్’ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ మీద మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే ఐవోస్ ఫ్లాట్‌ఫామ్ మీద కూడా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరలో సిద్ధం గచ్చిబౌలి ఆర్థిక జిల్లాలో ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయం ఏడాదిన్నరలో సిద్ధమవుతుందన్నారు. ప్రస్తుత పాత కార్యాలయం ఇరుకుగా ఉండటంతో రూ. 100 కోట్ల అంచనాతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ముఖర్జీ తెలిపారు. ప్రస్తుత కార్యాలయం విస్తీర్ణం 1.3 లక్షల చదరపు అడుగులు ఉంటే కొత్త కార్యాలయంలో 2.28 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తుందన్నారు. -
బేస్‌రేటుకే గ్రామీణులకు గృహ రుణం
- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం - రూ. 15 లక్షల వరకూ రుణసౌలభ్యం ముంబై: బేస్‌రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. మహిళా రుణాలను ఇప్పటికే బ్యాంక్ బేస్‌రేటుకు ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్‌రేటుకే (9.7 శాతం)గృహ రుణ రేటును అందిస్తున్న నేప థ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ తన రుణ బేస్‌ను పెంచుకునేందుకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. సామాజిక ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా... కాగా తమ నిర్ణయంపై బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ ఒక ప్రకటన చేస్తూ... సమాజంలో మెజారిటీ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఐసీఐసీఐ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. తమ 4,052 బ్రాంచీల్లోని 189లో గ్రామీణ రుణాలు లభ్యమవుతాయని తెలిపారు. ‘ఐసీఐసీఐ బ్యాంక్ సరళ్-రూరల్ హౌసింగ్ లోన్’ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ రుణం లభిస్తోంది. రుణ కాలవ్యవధి 3 నుంచి 20 ఏళ్లు. బేస్‌రేటు మార్పులకు అనుగుణంగా ఇచ్చిన రుణంపై వడ్డీరేటు కూడా మారుతుంది. గృహ కొనుగోళ్లు, నిర్మాణం, ఆధునీకీకరణలకుగాను గ్రామీణులకు ఈ రుణ సౌలభ్యం ఉంటుంది. -
బేస్ రేటు తగ్గించిన ఎస్బీహెచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఎస్బీహెచ్ బేస్ రేటు 10.05 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలకు చెల్లించే ఈఎంఐలు తగ్గుతాయని, 30 ఏళ్ల గృహరుణానికి లక్ష రూపాయలకు రూ. 874 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు- బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును ఈ ఏడాది ఇప్పటికి మూడు సార్లు 0.75 శాతం(7.25 శాతానికి) తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు కొంతమేర బదలాయించాయి. రుణ రేటు తగ్గడం డిపాజిట్ రేటు తగ్గడానకీ సంకేతం. -
యునెటైడ్ బ్యాంక్ బేస్‌రేటు తగ్గింపు
ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించిన ఐడీబీఐ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ బేస్‌రేటును 0.10 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 10% నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఈ నెల 19 నుంచి ఇది అమలవుతుంది. ఫలితంగా రుణ గ్రహీతలకు ఈఎంఐలు తగ్గే వీలుంది. గత వారంలోనే రిటైల్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ తగ్గించింది. ఒక ఏడాది రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 8 శాతానికి, ఏడాదికి మించిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 7.75 శాతానికి తగ్గించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.55 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపు నేటి(బుధవారం) నుంచే అమల్లోకి వస్తుందని వివరించింది. గత వారంలో కీలక రేట్లను ఆర్బీఐ పావు శాతం తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ తమ బేస్రేట్లను తగ్గించాయి. -
ఫడరల్ బ్యాంక్ బేస్‌రేట్ తగ్గింపు
ఈ నెల 18 నుంచి వర్తింపు న్యూఢిల్లీ: ఫెడరల్ బ్యాంక్ బేస్‌రేటును పావు శాతం తగ్గించింది. 10.2 శాతంగా ఉన్న బేస్‌రేట్‌ను 9.95 శాతానికి తగ్గించామని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 18 నుంచి వర్తిస్తుందని పేర్కొంది. కీలక రేట్లను ఇటీవల ఆర్బీఐ పావు శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు బేస్‌రేట్‌ను తగ్గించాయి. ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌లు ఇప్పటికే బేస్‌రేట్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. బేస్ రేట్ తగ్గింపు నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.133 వద్ద ముగిసింది. ఇండియన్ బ్యాంక్ తగ్గింపు 30 బేసిస్ పాయింట్లు ఇండియన్ బ్యాంక్ బేస్‌రేట్‌ను, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్(బీపీఎల్ఆర్)ను చెరో 30 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించింది. 10.25 శాతంగా ఉన్న బేస్‌రేట్‌ను 9.95 శాతానికి, అలాగే బీపీఎల్ఆర్ను 14.50 శాతం నుంచి 14.2 శాతానికి తగ్గించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. బీఎస్ఈలో ఈ షేర్ 3.6 శాతం నష్టపోయి రూ.146 వద్ద ముగిసింది. -
ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు పావు శాతం కట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటును పావు శాతం తగ్గించింది. ప్రస్తుతం 10.25 శాతంగా ఉన్న బేస్ రేటును 10 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీరేట్లు జూన్ 11 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా బీఎమ్పీఎల్ఆర్ రేటును 14.5 శాతం నుంచి 14.25 శాతానికి తగ్గించింది. ఈ మేరకు తీసుకున్న రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది. ఇండియన్ బ్యాంక్ రుణ రేటు తగ్గింపు.. న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేట్)ను 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 10.25 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. కొత్త రేటు జూన్ 8 నుంచీ అమల్లోకి వస్తుంది. దీనితో బేస్‌రేటుకు అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా, వాణిజ్య రుణ రేట్లు తగ్గే అవకాశం ఉంది. యూబీ డిపాజిట్ రేటు తగ్గింపు కాగా రుణ రేటు తగ్గింపునకు సంకేతంగా భావించే డిపాజిట్ రేటు కోత నిర్ణయాన్ని యునెటైడ్ బ్యాంక్ (యూబీ) తీసుకుంది. పలు మెచ్యూరిటీలపై డిపాజిట్ రేట్లను పావుశాతం మేర తగ్గించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది డిపాజిట్ రేటును 8 శాతానికి తగ్గించింది. ఏడాది పైన డిపాజిట్ రేటును 7.75 శాతానికి కుదించింది. తాజా రేట్లు జూన్ 8 నుంచీ అమల్లోకి వస్తాయని తెలిపింది. పీఎన్బీ, యాక్సిస్ బ్యాంక్‌లు బుధవారమే డిపాజిట్ రేట్లను తగ్గించాయి. ఇదే దారిలో మరికొన్ని బ్యాంకులు... రిజర్వ్ బ్యాంక్ జూన్ 2 రెపో రేటు కోత నేపథ్యంలో పలు బ్యాంకులు డిపాజిట్ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటున్నాయి. జూన్ 2నే ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, దేనాబ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లూ జూన్ 2నే కనీస రుణ రేటును తగ్గించాయి. పోటీ పూర్వక వాతావరణం నేపథ్యంలో మరిన్ని బ్యాంకులు సైతం రుణ, డిపాజిట్ రేట్ల తగ్గింపు దశలో నిర్ణయం తీసుకుంటాయని భావిస్తున్నారు. -
పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంక్.. బేస్‌రేట్ కోత
న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్ రేటు) తగ్గింపు బాటలో బుధవారం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఐడీబీఐ బ్యాంక్‌లూ నడిచాయి. ఈ రేటును పావుశాతం తగ్గించాయి. దీనితో రెండు బ్యాంకులకు సంబంధించీ ఈ రేటు 10 శాతానికి తగ్గింది. పీఎన్బీ రేటు కోత మే 7 నుంచీ అమల్లోకి వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ తాజా బేస్‌రేటు మే 11 నుంచీ అమల్లోకి వస్తుంది. బ్యాంకుల నిర్ణయం వల్ల బేస్ రేటుతో అనుసంధానమయ్యే గృహ, వాహన ఇతర రుణాలపై వడ్డీరేట్లు (ఈఎంఐ) తగ్గే అవకాశం ఉంది. కాగా ఐడీబీఐ బ్యాంక్ తన రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లనుకూడా కొన్ని మెచ్యూరిటీలపై 0.10 నుంచి 0.25 శాతం శ్రేణిలో తగ్గించింది. ఈ తాజా రేట్లు కూడా మే 11 నుంచీ అమల్లోకి వస్తాయి. రుణ రేటు తగ్గింపు డిపాజిట్ రేటు తగ్గింపునకూ సంకేతం. రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5%) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెస్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15% నుంచి 0.25% వరకూ తగ్గించాయి. జనవరి నుంచీ ఆర్బీఐ కీలక పాలసీ రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది. -
బీఓబీ బేస్ రేటు పావు శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కనీస రుణ రేటు (బేస్ రేటు)ను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 10 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయంతో బ్యాంక్ ఆటో, గృహ, ఇతర రుణ రేట్లు తగ్గే అవకాశం ఉంది. మే 6వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బీఎస్ఈకి పంపిన ఒక ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఈ దిశలో ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15 శాతం నుంచి 0.25 శాతం వరకూ తగ్గించాయి. జనవరి నుంచీ ఆర్బీఐ కీలక పాలసీ రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది.