ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను తగ్గించిన ఐడీబీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ బేస్‌రేటును 0.10 శాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 10% నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఈ నెల 19 నుంచి ఇది అమలవుతుంది. ఫలితంగా రుణ గ్రహీతలకు ఈఎంఐలు తగ్గే వీలుంది. గత వారంలోనే రిటైల్ టెర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ తగ్గించింది. ఒక ఏడాది రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 8 శాతానికి, ఏడాదికి మించిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 7.75 శాతానికి తగ్గించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.55 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపు నేటి(బుధవారం) నుంచే అమల్లోకి వస్తుందని వివరించింది. గత వారంలో కీలక రేట్లను ఆర్‌బీఐ పావు శాతం తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ తమ బేస్‌రేట్లను తగ్గించాయి.
యునెటైడ్ బ్యాంక్ బేస్‌రేటు తగ్గింపు
Published Wed, Jun 10 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement
Advertisement