రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్ మంగళవారం బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను తగ్గించింది. దీంతో రుణ గ్రహీతల ఈఎంఐ విలువ తగ్గే అవకాశం ఉంది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్‌ఆర్‌ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్.. ఓవర్‌నైట్‌కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72%కి దిగింది. ఇతర మెచ్యూరిటీలకు ఎంసీఎల్‌ఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. బీపీఎల్‌ఆర్‌ను 17.95% నుంచి 17.89%కి త గ్గించింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది.