lending rate
-
కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..
ప్రముఖ ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రకటించింది. మార్పులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బేస్ రేటును 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెంచింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR )ను 16.20 శాతం నుంచి 16.40 శాతానికి పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరగనుంది. అలాగే ఈఎంఐలపైనా దీని ప్రభావం పడనుంది. ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లు ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ జూలైలో KVB ESOS 2011 స్కీమ్, KVB ESOS 2018 పథకం కింద ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లను స్టాక్ ఆప్షన్‌గా కేటాయించినట్లు ప్రకటించింది. ఒక్కొక్క ఈక్విటీ షేర్ల ముఖ విలువ రూ.2 ఉంటుంది. కాగా శుక్రవారం (సెప్టెంబర్15) వారాంతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 1.84 శాతం లాభంతో రూ.132.75 వద్ద ముగిశాయి. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) -
వినియోగదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్‌పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది. దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్ ఆర్ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో ఆర్బీఐ రేటును పెంచిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకొంది. -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : రుణాలపై వడ్డీరేట్లను ఎస్బీఐ 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)లో కోత విధించింది. ఏడాది కాల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 7.85 శాతం నుంచి 7.75 శాతానికి, ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితి కలిగిన రుణ రేట్లను 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఎంసీఎల్ఆర్ను తగ్గించడం ఇది వరుసగా పదోసారి కావడం గమనార్హం. మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణ రేటును 7.65 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. మూడేళ్ల కాలానికి రుణ రేట్లను 8.05 శాతం నుంచి 7.95 శాతానికి కుదించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సోమవారం ఎంసీఎల్ఆర్ను అన్ని కాలపరిమితి కలిగిన రుణాలపై 10 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. చదవండి : ఎస్బీఐలో యస్‌బ్యాంక్ విలీనం కాదు: రజనీష్ -
ఈ రుణ వడ్డీరేటును తగ్గించిన ఎస్బీఐ
సాక్షి, ముంబై: అతిపెద్దప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి లెండింగ్ రేట్లను తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్( ఈబీర్)ను 25 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వినియోగదారులకు ఈబీఆర్ 8.05 నుంచి 7.80కి దిగి వచ్చిందని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన రేటు జనవరి 1వ తేదీ 2020 నుండి అమల్లోకి రానుంది. దీంతో రెపో రేటుతో అనుసంధానించిన గృహ రుణ వినియోగదారులకు ఈఎంఐ భారం తగ్గనుంది. అలాగే ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు)ల రుణ గ్రహీతలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్లో వరుసగా ఎనిమిదో సారి కోత విధిస్తూ ఎస్బీఐ గత నెలలో 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. కొత్త గృహ కొనుగోలుదారులకు సంవత్సరానికి 7.90 శాతం వడ్డీ రేటుతో రుణాలు లభిస్తున్నాయి. తాజా ప్రకటనలతో ఈక్విటీ మార్కెట్లో ఎస్బీఐ షేరు 2 శాతం నష్టాలతో కొనసాగుతోంది. -
వడ్డీరేట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు పెంచింది. రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను 5 (0.05శాతం) బీపీఎస్ పాయింట్లు పెంచుతున్నట్టు బ్యాంకు ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీరేట్లు నేటి (అక్టోబర్ 8, సోమవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. బ్యాంకు వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఒక సంవత్సరం వరకు రుణాలపై వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. అదేవిధంగా మూడు సంవత్సరాల కాలానికి వడ్డీరేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది. బ్యాంక్ బేస్ రేటు ఇప్పటికీ 9.15 శాతంగా ఉంటుంది. తాజా పెంపుతో 2016 ఏప్రిల్ తరువాత తీసుకున్న గృహ,వాహన,వ్యక్తిగత రుణాలుపై ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి. మరోవైపు తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను అనూహ్యంగా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. -
రుణాలపై వడ్డీరేటు పెంచిన ఎస్బీఐ
సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. గృహ, వాహన, ఇతర రుణాలపై ఈ భారం పడనుంది. రుణాలపై వడ్డీరేటు 0.2 శాతం పెంచుతున్నట్లు శనివారం ఎస్బీఐ అధికారులు తెలిపారు. పెంచిన ఈ రేట్లన్నీ శనివారం నుంచి అమలు కానున్నాయి. దీంతో ఎస్బీఐ ఉపాంత నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) 8.1శాతానికి చేరింది. ఇప్పటివరకు ఇది 7.9 శాతంగా ఉంది. ఒక సంవత్సర కాలపు రుణాలపై వడ్డీరేటు8.25 శాతం నుండి 8.45 శాతానికి పెంచింది. అలాటే మూడేళ్ల కాల పరిమితి కలిగిన అన్ని రుణాలపైనా 20 బేసిన్ పాయింట్లను ఎస్బీఐ పెంచింది. దీంతో మూడేళ్ల కాల పరిమితి కలిగిన ఎంసీఎల్ ఆర్ 8.45 శాతం నుంచి 8.65 శాతానికి పెంచింది. మరోవైపు సెప్టెంబర్ 1వ తేదీనుంచి వాహన కొనుగోలుదారులకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ మాండేటరీ చేయడంతో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. దీనికితోడు రుణాలపై వడ్డీరేటును కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారి నెత్తిపై ఎస్బీఐ మరో పిడుగు వేసింది. -
కస్టమర్లకు షాక్: రుణాలపై వడ్డీరేటు పెంపు
సాక్షి, ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు లెండింగ్ రేట్లను పెంచి బ్యాంకు వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఊహించినట్టుగానే దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పీఎన్బీ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారీగా పడనుంది. వార్షిక ఎంసిఎల్ఆర్ రేటును పెంచుతూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ వెబ్సైట్లో వివరాలను పొందు పర్చింది. 2016, ఏప్రిల్ తరువాత మొదటిసారి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది 7.9 శాతం మాత్రమే. అటు మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వడ్డీరేట్లను పెంచిది. వార్షిక ఎంసీఎల్ఆర్ను 8.30శాతంగా నిర్ణయించింది. మార్చి 1, 2018నుంచి ఈ రేట్లు అమల్లో రానున్నాయని పీఎన్బీ, ఎస్బీఐ ప్రకటించింది. కాగా డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఒకరోజు తరువాత ఎస్బీఐ లెండింగ్ రేట్లను సవరించింది. -
పీఎన్బీ పండుగ శుభవార్త!
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. రానున్న దసరా దీపావళి సందర్భంగా కస్టర్లకు రుణాలపై తక్కువ వడ్డీరేట్ల ఆఫర్‌ను ప్రకటించింది. రుణాల వడ్డీరేటులో (ఎంసీఎల్ఆర్) కోత పెట్టింది. 20-25 బేసిస్‌పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ తగ్గింపురేట్లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం పీఎన్బీ ప్రస్తుత బేస్ వడ్డీరేటు 9.15శాతంగా ఉండనుంది. ఇప్పటివరకు ఇది 9.35 శాతం. వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగాను, మూడు నెలల కాలానికి 8 శాతంగా ఉంది. -
హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లు కోత!
న్యూఢిల్లీ : హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొ(హెచ్డీఎఫ్సీ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన ప్రస్తుత కస్టమర్లు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షల వరకు రుణం తీసుకున్న మహిళా రుణగ్రహీతలు ఇక నుంచి తమ గృహ రుణాలపై 8.65 శాతం వడ్డీరేటు చెల్లిస్తే సరిపోతుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఇతర రుణగ్రహీతలు 8.70 శాతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోజనం తమ ప్రస్తుత ఖాతాదారులందరికీ కల్పించనున్నట్టు హెచ్డీఎఫ్ వెల్లడించింది. ఈ నెల మొదట్లో కొత్త కస్టమర్లకు రుణ రేటును 45 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు నాన్-రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఐఆర్లు)/ భారతీయ సంతతికి చెందిన కార్డు హోల్డర్స్‌కు(పీఐఓ) వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తం మహిళలు ఇతరులు రూ.75 లక్షల వరకు 8.65 శాతం(ఏడాదికి) 8.70 శాతం(ఏడాదికి) రూ.75 లక్షలకు పైగా 8.70 శాతం(ఏడాదికి) 8.75 శాతం(ఏడాదికి) -
ఐసీఐసీఐ కూడా...
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల సరసన ప్రయివేట్ రంగ బ్యాంకు కూడా చేరిపోయింది. రుణాలపై వడ్డీరేటు కోతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా అనేక ఇతర బ్యాంకుల బాటలో ఐసీఐసీఐ కూడా పయనించింది. గృహ, వాహన, ఇతర రుణాలను ఇక మరింత చౌకగా అందించనుంది. ఎంసీఎల్ ఆర్ లో 0.7శాతం కోత పెట్టింది. తమ బేస్ లెండింగ్ రేటు లో వార్షిక రేటును 8.20 శాతంగా నిర్ణయించినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సవరించిన ఈ రేట్లు జనవరి 3 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ రుణాలపై వడ్డీరేట్లలో కోతపెడుతున్నాయి. ముఖ్యంగా ఎస్ బీఐ, పీఎన్ బీ సహా కోటక్ మహీంద్రా బ్యాంక్, దేనా బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , యూనియన్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలు కూడా ఎంసీఎల్ ఆర్ లో కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు కోత
-
బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు కోత
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లో కోతలు మొదలుపెట్టింది. బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును గణనీయంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బల్క్ డిపాజిట్ల వడ్డీరేటును 125 నుంచి 190 బేసిస్ పాయింట్లను (ఒక బేసిస్ పాయింట్లు 0.01శాతం) తగ్గించింది. ఈ మేరకు బ్యాంకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. కోటి నుంచి 10 కోట్ల రూపాయల డిపాజిట్లపై తగించిన ఈ వడ్డీరేట్లు రేపటినుంచే( గురువారం) అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 180-210 రోజు కాలపరిమితికి స్థిర డిపాజిట్లపై 1.90 శాతం కోత పెట్టి 3.85 శాతంగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఇది 5.75 శాతంగా ఉంది. ఒక సంవత్సరం నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6 శాతం తగ్గించింది. ఇది గతంలో 4.25 శాతంగా వుంది. ఏడు నుంచి 45 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీఐలపై 1.25శాతం కోత పెట్టింది. ఇది గతంలో 3.75శాతం. ఈ నెల ఆరంభంలో ఒక కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా డీమానిటైజేషన్ కారణంగా దేశంలోని బ్యాంకుల్లో సుమారు రూ 5.4 లక్షల కోట్లు జమ అయినట్టు ప్రధాని ప్రకటించారు. ఇందులో పెద్ద నోట్ల రద్దుతర్వాత ఎస్బీఐలో సుమారు1.5 లక్షల కోట్ల మేర నగదు డిపాజిట్ అయింది. అయితే ఎస్ బీఐ బాటలోనే మిగతా బ్యాంకులు కూడా డిపాజిట్ల వడ్డీ రేట్ల కోత పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్ మంగళవారం బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. దీంతో రుణ గ్రహీతల ఈఎంఐ విలువ తగ్గే అవకాశం ఉంది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్ఆర్ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్.. ఓవర్‌నైట్‌కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72%కి దిగింది. ఇతర మెచ్యూరిటీలకు ఎంసీఎల్ఆర్లో ఎలాంటి మార్పు లేదు. బీపీఎల్ఆర్ను 17.95% నుంచి 17.89%కి త గ్గించింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది.