సాక్షి, ముంబై: ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు పెంచింది. రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ను 5 (0.05శాతం) బీపీఎస్ పాయింట్లు పెంచుతున్నట్టు బ్యాంకు ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీరేట్లు నేటి (అక్టోబర్ 8, సోమవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.
బ్యాంకు వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం ఒక సంవత్సరం వరకు రుణాలపై వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. అదేవిధంగా మూడు సంవత్సరాల కాలానికి వడ్డీరేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది. బ్యాంక్ బేస్ రేటు ఇప్పటికీ 9.15 శాతంగా ఉంటుంది. తాజా పెంపుతో 2016 ఏప్రిల్ తరువాత తీసుకున్న గృహ,వాహన,వ్యక్తిగత రుణాలుపై ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి. మరోవైపు తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను అనూహ్యంగా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment