Punjab National Bank Hikes Lending Rate By 15 Basis Points - Sakshi
Sakshi News home page

వినియోగదారులకు పీఎన్‌బీ షాక్‌, ఈఎంఐ మరింత భారం

Published Wed, Jun 1 2022 1:12 PM | Last Updated on Wed, Jun 1 2022 1:56 PM

Punjab National Bank Hikes Lending Rate By 15 basis points - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన వినియోగదారులకు  షాక్‌ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు  లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల  టెన్యూర్స్‌పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది.  దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. 

సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్‌ ఆర్‌ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో  ఆర్‌బీఐ  రేటును పెంచిన తర్వాత ఈ  మార్పు చోటు చేసుకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement