సాక్షి, ముంబై: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు లెండింగ్ రేట్లను పెంచి బ్యాంకు వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఊహించినట్టుగానే దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), పీఎన్‌బీ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ భారీగా పడనుంది.
వార్షిక ఎంసిఎల్ఆర్ రేటును పెంచుతూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో వివరాలను పొందు పర్చింది. 2016, ఏప్రిల్ తరువాత మొదటిసారి రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో వార్షిక ఎంసీఎల్‌ఆర్ 8.15శాతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇది 7.9 శాతం మాత్రమే.
అటు మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా వడ్డీరేట్లను పెంచిది. వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ను 8.30శాతంగా నిర్ణయించింది. మార్చి 1, 2018నుంచి ఈ రేట్లు అమల్లో రానున్నాయని పీఎన్‌బీ, ఎస్‌బీఐ ప్రకటించింది. కాగా డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఒకరోజు తరువాత ఎస్‌బీఐ లెండింగ్ రేట్లను సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment