భారతదేశంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరానికి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఇందులో ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రెండూ ఉంటాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావం చూపిస్తుంది.
ఓవర్ నైట్: 9.10 శాతం
ఒక నెల: 9.15 శాతం
మూడు నెలలు: 9.30 శాతం
ఆరు నెలలు: 9.40 శాతం
ఒక సంవత్సరం: 9.45 శాతం
రెండు సంవత్సరాలు: 9.45 శాతం
మూడు సంవత్సరాలు: 9.45 శాతం
ఎంసీఎల్ఆర్ అంటే..
ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment