HDFC Bank hikes interest rates దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. అన్ని రకాల లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆయా రుణాలపై ఈఎంఐ భారం మరింత భరించక తప్పదు. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్‌కు నిద్ర కరువు)
హెచ్‌డీఎఫ్‌సీ రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర పెంచింది. దీని ప్రకారం బ్యాంకుకు సంబంధించిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఇకపై వడ్డీ భారం పెరగనుంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ పెంపు తర్వాత 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఏడాదిలోపు రుణాలపై వడ్డీరేటు భారం 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.15 శాతానికి చేరింది . (ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్‌డేట్ చేసుకోకపోతే అంతే!)
సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ MCLR
6 నెలలుకాల రుణాలపై 9.05 శాతం
ఏడాది రుణాలపై 9.15శాతం
రెండేళ్ల కాలపరిమితి రుణాలపై 9.20 శాతం
మూడేళ్ల కాల రుణాలపై 9.25శాతం వడ్డీ వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment