
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది.
మే నెల నుంచి హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది.
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!