House loan
-
న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ!
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. మే నెల నుంచి హెచ్డీఎఫ్సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
‘నేను తీసుకున్న ఇంటి రుణాన్ని ఇలా చెల్లించవచ్చా’?
గ్రాట్యుటీతో గృహ రుణం తీర్చేయడం సరైనదేనా? నాకు గృహ రుణం ఉంది. మరో 5 ఏళ్లకు ఇది పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో పెద్ద మొత్తంలో రానుంది. ఈ గ్రాట్యుటీతో గృహ రుణాన్ని తీర్చివేయాలా లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా? –క్రిష్ రుణాలలో గృహరుణం ఒక్క దానిని కొనసాగించుకోవచ్చు. అధిక వడ్డీ రేటు ఉండే ఇతర రుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఇతర రుణాలు తీసుకుని ఉంటే, అప్పుడు వాటిని ముందుగా తీర్చేయడాన్ని పరిశీలించొచ్చు. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. గృహ రుణం రేటుతో పోలిస్తే పెట్టుబడులపై దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. కనుక గృహ రుణం లాభదాయకమే. భవిష్యత్తులో వచ్చే ఆదాయం గురించి ఆందోళన చెందుతుంటే లేదా గృహ రుణం చెల్లించడం ద్వారా ప్రశాంతంగా ఉంటానని అనుకుంటే గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు. అలా కాకుండా గృహ రుణాన్ని భారంగా భావించకపోతే, భవిష్యత్తు ఆదాయంపై నమ్మకం ఉంటే గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?– కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! -
బ్యాంకులతో పోలిస్తే తక్కువే..అందుబాటు ధరల్లో హోమ్ లోన్లు!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు(హెచ్ఎఫ్సీ లు)గృహ రుణాల్లో మార్కెట్ వాటాను బ్యాంకుల కు కోల్పోతున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. హెచ్ఎఫ్సీల నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం) వేగవంతమైన వృద్ధి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటాను కోల్పోనున్నట్టు అంచనా వేసింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం 2022–23లో 10–12 శాతం పెరుగుతాయని పేర్కొంది. క్రితం ఆర్థిక సంవ్సరంలో వృద్ధి 8 శాతంగా ఉన్నట్టు తెలిపింది. బ్యాంకులు గృహ రుణాల విభాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నందున, హెచ్ఎఫ్సీల ఆస్తులు వృద్ధి చెందినా, మార్కెట్ వాటాను కాపాడుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులకు మార్కెట్ వాటా నష్టపోవడాన్ని ప్రస్తావించింది. గృహ రుణాల్లో బ్యాంకుల వాటా 4 శాతం పెరిగి 2022 మార్చి నాటికి 62 శాతంగా ఉన్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గృహ రుణాల్లో బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకోవడం సమీప కాలంలో ఆగకపోవచ్చని క్రిసిల్ తెలిపింది. గృహ రుణాల్లో దేశంలోనే అదిపెద్ద సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ వెళ్లి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం అవుతుండడం ఈ విభాగంలో బ్యాంకుల వాటా మరింత పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అందుబాటు గృహ రుణాలు ఇక హెచ్ఎఫ్సీలు మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఆశావహ పరిస్థితి అందుబాటు ధరల గృహ రుణాల్లో మాత్రమే ఉన్నట్టు క్రిసిల్ వెల్లడించింది. ఈ విభాగంలో బ్యాంకుల నుంచి పోటీ చాలా తక్కువగా ఉండడాన్ని ఇందుకు మద్దతుగా పేర్కొంది. 2022–23లో అందుబాటు ధరల గృహ రుణాల్లో 18–20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ‘‘సంప్రదాయ వేతన ఉద్యోగుల విభాగంలో గృహ రుణాల పరంగా బ్యాంకులతో పోటీ పడడం హెచ్ఎఫ్సీలకు సవాలే అవుతుంది. ఎందుకంటే వాటికి నిధుల సమీకరణ వ్యయాలు అధికంగా ఉండడం వల్లే’’అని క్రిసిల్ వివరించింది. హెచ్ఎఫ్సీలకు నిధుల సమీకరణ కష్టమేమీ కాదంటూ, బ్యాంకులకు మాత్రం తక్కువ వ్యయాలకే డిపాజిట్లు (కాసా) అందుబాటులో ఉండడం అనుకూలతగా పేర్కొంది. నియంత్రణ పరమైన నిబంధనలు కఠినంగా మారుతుండడం, కార్పొరేట్ బాండ్ మార్కెట్ బలంగా లేకపోవడంతో హెచ్ఎఫ్సీలు తమ వ్యాపార నమూనాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హెచ్ఎఫ్సీలు బ్యాంకులతో భాగస్వామ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచన చేసింది. తద్వారా ఒకరి బలాలు మరొకరికి సానుకూలిస్తాయని పేర్కొంది. 202–23లో హెచ్ఎఫ్సీల గృహ రుణాలు 15 శాతం వృద్ధిని చూస్తాయని అంచనా వేసింది. డెవలపర్ ఫైనాన్స్, ప్రాపర్టీపై ఇచ్చే రుణాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని పేర్కొంది. -
ఉద్యోగులకు శుభవార్త..రూ.5 లక్షల నుంచి రూ.75లక్షల వరకు రుణాలు!
న్యూఢిల్లీ: ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్(ఐఎంజీసీ)తో తాజాగా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ చేతులు కలిపింది. తద్వారా ఉద్యోగులు, ఉద్యోగేతరులకు రూ. 5–75 లక్షల మధ్య గృహ రుణాలను ఆఫర్ చేసేందుకు సిద్ధపడుతోంది. ఒప్పందంలో భాగంగా పిరమల్ క్యాపిటల్ జారీ చేసే గృహ రుణాలకు ఐఎంజీసీ గ్యారంటీని కల్పిస్తుంది. దీంతో రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఎదురైనప్పటికీ హామీ లభిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 10–12 శాతం బిజినెస్‌ను సాధించాలని పిరమల్ క్యాపిటల్ భావిస్తోంది. ప్రధానంగా సొంతింటికి ఆసక్తి చూపే ఉద్యోగులు, స్వయం ఉపాధి కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ‘గృహ సేతు హోమ్ లోన్’ పేరుతో ఈ రుణాలను అందించనుంది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరమల్ క్యాపిటల్ దేశవ్యాప్తంగా గల 300 బ్రాంచీలను రుణ పంపిణీకి వినియోగించుకోనుంది. ఈ పథకంలో భాగంగా రూ.5–75 లక్షల మధ్య రుణాలను గరిష్టంగా 25ఏళ్ల కాలపరిమితితో మంజూరు చేయనున్నట్లు పిరమల్ క్యాపిటల్ తెలియజేసింది. కాగా..రుణ భారంతో దివాలాకు చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌ను పిరమల్ క్యాపిటల్ చేజిక్కించుకున్న విషయం విదితమే. -
బకాయిలు..బాబోయ్!! హౌసింగ్ రుణాల్లో ‘మొండి బకాయిల’ భారం!
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్‌ఫోలియో నాణ్యత మెరుగుపడినప్పటికీ, వాటి స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏ)లు గత ఏడాది నవంబర్, డిసెంబర్‌ల్లో 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల రుణ నిబంధనావళి పరిధిలోకి హౌసింగ్ ఫైనాన్షియర్లను తీసుకు వస్తుండడం దీనికి నేపథ్యమని నివేదిక విశ్లేషించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గత ఏడాది నవంబర్ 12 వతేదీన రుణదాతలు అందరికీ వర్తించేలా కఠినమైన రుణ నాణ్యత రిపోర్టింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. తద్వారా హౌసింగ్ ఫైనాన్షియర్లు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) వాణిజ్య బ్యాంకుల నిబంధనావళి పరిధిలోకి తీసుకువచ్చింది. కొత్త నిబంధనలను 2021 డిసెంబర్ 31నాటికి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ గడువును 2022 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ఆర్బీఐ 2022 ఫిబ్రవరి 15వ తేదీన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రిసిల్ ఆవిష్కరించిన నివేదికలోకి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మొండి బకాయిల్లో 2021–22 ప్రస్తుత (మార్చి) త్రైమాసికం ముగిసే నాటికి ఒక స్థిరీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. ► 2021 నవంబర్ తర్వాత కేవలం నెలరోజుల్లో (2021 డిసెంబర్ 31 నాటికి) చౌక గృహ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి స్థూల మొండిబకాయిలు 140 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇతర ఫైనాన్షియల్ కంపెనీల విషయంలో ఏకంగా ఈ పెరుగుదల 3.3 శాతంగా ఉంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల అకౌంట్ల సవరణలు దీనికి కారణ. ఇలాంటి పరిస్థితి లేకపోతే ఎన్పీఏలు డిసెంబర్ నాటికి కేవలం 2.6 శాతం పెరిగేది. దీని ప్రకారం, కొత్త నిబంధనల నేపథ్యం వల్ల ఎన్పీఏలు 70 బేసిస్ పాయింట్లు పెరిగాయన్నమాట. అయితే 2022 మార్చి ముగిసే నాటికి 3 శాతానికి ఎన్పీఏలను పరిమితమయ్యే అవకాశం ఉంది. ► మరో రకంగా చెప్పాలంటే, కొత్త నిబంధనలు లేకపోతే రుణ నాణ్యత 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం కూడా ఉంది. ►హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలను వాణిజ్య బ్యాంకుల పరిధిలోనికి తీసుకురావడానికి సంబంధించి గడువును ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగించినప్పటికీ, ఈ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే, ఇప్పటికే పలు హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేస్తున్నాయి. ► రుణాల విషయంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అనవసర వ్యయాల కట్టడి, వసూళ్ల విషయంలో మరింత వ్యవస్థాపరమైన పటిష్టత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ► కాగా, ఎన్బీఎఫ్సీలకన్నా హెచ్ఎఫ్సీల రుణ నాణ్యత కొంత మెరుగ్గా వుండే అవకాశాలు ఉన్నాయి. ► రుణాల విషయంలో 95 శాతం ఉన్న 35 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను క్రిసిల్ తన నివేదిక కోసం అధ్యయనం చేసింది. -
కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి?
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం కోసం కూడా చాలా కష్ట పడుతారు. అయితే, సరిగ్గా ఇల్లు కొనే సమయం ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి కలల గృహం కట్టడం కోసం హోమ్ లోన్ తీసుకోవడం అనేది అత్యంత కీలక నిర్ణయం. దీనిపై ఎంతో హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం చేసే చిన్న, చిన్న పొరపాట్లకు ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకోసమే, ఇల్లు కొనేముందు ఈ 3/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకుంటే చాలా మంచిది. దీని వల్ల రాబోయే కాలంలో వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. 3 అంటే మీ ఇంటి మొత్తం ఖర్చు.. ఈ 3/20/30/40 ఫార్ములాలో "3" దేనిని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నియమంలో “3” అంటే మీరు ఇంటి కోసం చేసే మొత్తం ఖర్చు మీ ఆదాయానికి 3 రేట్లు మించకూడదు అని అర్ధం. అయితే, ఇది తక్కువ వార్షిక ఆదాయం గల వారికి వర్తిస్తుంది. మీ ఆదాయం బట్టి కొన్ని కొన్ని సార్లు "5" రేట్ల మొత్తాన్ని ఇంటి కోసం ఖర్చు చేయవచ్చు. ఉదాహరణ: ఒక వ్యక్తి వార్షిక సంపాదన అనేది రూ.2 లక్షలు అయితే, ఆ వ్యక్తి ఇంటి కోసం చేసే ఖర్చు రూ.6 లక్షలకు మించరాదు. ఇంత తక్కువ ధరతో పట్టణాలు, నగరాల్లో ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం అసాధ్యమే. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులు, షేర్లు వంటి వాటిని విక్రయించి డబ్బు సమకూర్చుకోవడం మేలు. అయితే, ఒక ఆస్తిని అమ్మే ముందు అంత విలువ చేసే ఇల్లు మీ సొంతమవుతుందా లేదా అంచనా వేసుకోవాలి. 20 అంటే రుణ కాల వ్యవది ఈ 3/20/30/40 ఫార్ములాలో "20" దేనిని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి కోసం తీసుకునే రుణ కాల వ్యవదిని “20” అనేది సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, మీ గరిష్ట గృహ రుణ కాల వ్యవది "20" ఏళ్లకు మించరాదు. మీ వార్షిక ఆదాయం గనుక ఎక్కువగా ఉంటే, రుణ కాల వ్యవది "20" ఏళ్ల కంటే తక్కువ ఉంటే మంచిది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. ఛార్జింగ్ కష్టాలకు చెక్!) 30 అంటే ఈఎంఐ మొత్తం ఈ 3/20/30/40 ఫార్ములలో “30” అనేది, మీరు అన్నీ రకాలుగా చెల్లించే ఈఎమ్ఐ((కారు, వ్యక్తిగత రుణం, గృహ రుణం వంటి అన్ని ఇతర ఈఎమ్ఐలతో సహా) మొత్తం కలిపి మీ వార్షిక ఆదాయంలో 30 శాతానికి మించరాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలు అనుకుంటే, ఆ మొత్తంలో అన్నీ ఈఎమ్ఐ మొత్తాలకు కలిపి రూ.2 లక్షలకు మించరాదు అని అర్ధం. 40 - కనీస డౌన్ పేమెంట్ ఈ 3/20/30/40 ఫార్ములలో “40” అనేది మీరు ఇంటి కోసం చెల్లించే డౌన్ పేమెంట్ గురుంచి తెలియజేస్తుంది. అంటే, మీరు కొనే ఇంటి మొత్తం విలువలో 40 శాతం డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే మంచిది. మిగతా మొత్తం కోసం రుణం తీసుకోవచ్చు. మీరు తీసుకునే గృహ రుణం మాత్రం మీ కొత్త ఇంటి విలువలో 60 శాతం కంటే తక్కువగా ఉంటే చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఈ దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?) -
‘వన్‌టైమ్ సెటిల్మెంట్’ అమలు సమీక్షకు మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: పేదల గృహ రుణాలకు సంబంధించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీం అమలును సమీక్షించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం(రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ వారానికి ఒకసారి ఈ పథకంపై సమీక్షించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. -
గృహపూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో హోం లోన్
సాక్షి, హైదరాబాద్: ముంబైకి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్ (ఎస్హెచ్ఎఫ్ఎల్).. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నెలకు రూ.110 కోట్ల వ్యక్తిగత గృహ రుణాలను పంపిణీ చేయాలని లక్క్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా ‘గృహ పూర్తి’ పేరిట అందుబాటు గృహాల రుణ స్కీమ్‌ను తీసుకొచ్చింది. సగటున రూ. 12 లక్షలు గృహపూర్తి లోన్ల సగటు టికెట్ పరిమాణం రూ.12–15 లక్షలుగా ఉంటుందని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ రవి సుబ్రమణియన్ తెలిపారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో రూ.1,400 కోట్ల రుణాలను అందించామని, వచ్చే రెండేళ్లలో రూ.2,500 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం)ను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు చెప్పారు. విస్తరణ బాటలో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో పలు ఉత్పత్తులను తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 350 మంది ఉద్యోగులను నియమించుకోవటంతో పాటు ప్రస్తుతం 11 శాఖలుండగా.. వాటిని 178కి విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్హెచ్ఎఫ్ఎల్కు 15 రాష్ట్రాలలో 84 బ్రాంచీలున్నాయి. రూ.4 వేల కోట్ల ఏయూఎం ఉండగా.. తెలుగు రాష్ట్రాల వాటా 13 శాతంగా ఉంది. చదవండి: దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ -
పట్టణ పేదల ఇళ్లకు శాపం!
నిలువనీడ లేక పట్టణ ప్రజలు పడుతున్న బాధలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం ద్వారా పట్టణ, నగర ప్రజలకు గృహవసతి కల్పించాలని కేంద్రం భావించింది. కానీ ఈ పథకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఏరుకుంటోంది. తనకు నచ్చిన సంస్థలకు గృహనిర్మాణ బాధ్యతలు అప్పగించడంతో అవి అంచనాలు పెంచేసి లబ్ధిదారుడిపై ఆర్థిక భారం మోపుతున్నాయి. వీటికితోడు పచ్చనేతల అవినీతి, బ్యాంకర్ల నిబంధనల కారణంగా పట్టణ గృహనిర్మాణం నత్తనడకన సాగుతోంది. సబ్సిడీ వస్తుందనే నమ్మకంతో సొంత నగదుతో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు రుణభారంతో నలిగిపోతున్నారు. పట్టణ గృహనిర్మాణ పథకంపై పాలకులు చెబుతున్న మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా లేకపోవడం, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడం, ఇంటి లోపల వసతులు సంతృప్తిగా లేకపోవడం, టీడీపీ నేతల అవినీతి కారణంగా ఇప్పుడీ పథకం పట్ల ప్రజలు ఆసక్తి చూపడం లేదు. సాక్షి, అమరావతి: కేవలం డబ్బు ఉన్నవారికే కాకుండా ప్రతి ఒక్కరికీ (పేద, మధ్య తరగతివారితో సహా) పక్కా గృహ వసతి కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5.24 లక్షల ఇళ్లను (ఫ్లాట్లు) నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్లను మూడు కేటగిరీలుగా 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇంటి నిర్మాణ వ్యయం విస్తీర్ణాన్ని బట్టి రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఇంటికయ్యే మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడికి బ్యాంకు రుణంగా అందిస్తారు. లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణం ఆధారంగా నెలసరి వాయిదాల చెల్లింపులను నిర్దేశించారు. నెలకు రూ.2,500, రూ.2,900, 3,500 వాయిదాలుగా నిర్ణయించి 20 ఏళ్ల పాటు చెల్లించే విధానాన్ని రూపొందించారు. నచ్చిన సంస్థలకు అప్పగింత రెండేళ్ల క్రితం పిలిచిన టెండర్లలో నచ్చిన సంస్థలకు గృహనిర్మాణ బాధ్యతలను అప్పగించడంతో ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణమూ పూర్తికాలేదు. ఆ జిల్లాల్లో 1.39 లక్షల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు పొందిన ఈ సంస్థలు ఒక్క ఇంటినీ నిర్మించలేదు. రాష్ట్రం మొత్తం 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో ఇప్పటివరకు 64,370 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తుండటంతో అనేకమంది దరఖాస్తుదారులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. 3.36 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని జిల్లాల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 2,534 మంది లబ్ధిదారులకే మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. మిగిలినవన్నీ ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. దరఖాస్తు చేసిన నాటి నుంచి స్థానిక కార్పొరేటర్, జన్మభూమి కమిటీ, గృహనిర్మాణ సంస్థ అధికారులు, బ్యాంకర్లు చుట్టూ తిరగలేక ఆర్థిక వెసులుబాటు కలిగిన కొందరు లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే వీరు కూడా బ్యాంకు రుణం పొందడానికి అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఇళ్ల కేటాయింపునకు భారీ వసూళ్లు టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జన్మభూమి కమిటీలు తమ మామూళ్లు తీసుకుని ఇళ్ల కేటాయింపునకు సిఫారసు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. అయితే ఆ లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులు, నెలవారీ వాయిదాలు చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవడంతో రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది తిరస్కరణకు గురయ్యారు రాష్ట్రంలో మొత్తం 5.24 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, జిల్లా స్థాయి కమిటీలు 3.36 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపాయి. వీటిలో 1.87 లక్షలు పెండింగ్‌లో ఉండగా 27,379 దరఖాస్తులు మాత్రమే రుణాల కోసం బ్యాంకుల వద్దకు చేరాయి. ఇప్పటివరకు బ్యాంకులు 2,534 మంది లబ్ధిదారులకు మాత్రమే రుణాలు మంజూరు చేశాయి. అనర్హులుగా మిగిలిన లబ్ధిదారులు రెంటికీ చెడిన రేవడిలా మారారు. ఇటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ఇచ్చిన మామూళ్లు తిరిగి తీసుకోలేకపోతున్నారు. అటు బ్యాంకర్లు అడిగిన రీపేమెంట్ సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు. అధ్వానంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వం అర్బన్ గృహనిర్మాణంపై చేసుకుంటున్న ప్రచారానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల నాణ్యతా ప్రమాణాలు, ఇంటి లోపల వసతుల కల్పన, అధికారులు, టీడీపీ నేతల అవినీతిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంటిలోపల వసతులు సంతృప్తిగా లేవని 39.67 శాతం మంది లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, ఇంటి కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని 31.16 శాతం మంది, దరఖాస్తు చేసినా ఇల్లు కేటాయించలేదని, కనీసం సమాచారం కూడా రాలేదని 16.95 శాతం మంది, అధికారులు అవినీతికి పాల్పడ్డారని 4.94 శాతం మంది, ఇంటి నిర్మాణం బాగోలేదని 3.88 శాతం మంది, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని 3.42 శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వ సర్వేలోనే పేర్కొన్నారు. పేదలపై భారీగా భారం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలు టెండర్ల సమయంలో సిండికేటు కావడంతో అంచనాల వ్యయం పెరిగింది. దీనికితోడు ఆ సంస్థలకు రెండేసి జిల్లాల్లో ఇళ్లను నిర్మించే టెండర్లు రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నాగార్జున, షాపూర్జీ పల్లోంజీ, లార్సెన్ అండ్ టూబ్రో, వీఎన్‌సీ, సింప్లెక్సు సంస్థలు ప్రతి జిల్లా టెండరులో కుమ్మక్కె ఒక్కరికే ఆ పనులు దక్కేలా చేశాయి. నాగార్జున నిర్మాణ సంస్థకు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు, షాపూర్జీ పల్లోంజీకి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఇళ్ల నిర్మాణ టెండర్లు లభించాయి. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సెంట్రింగ్, ఇతర పరికరాలు ఈ సంస్థలకు పూర్తిగా లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ సంస్థల పనితీరును అధికారులెవరూ ప్రశ్నించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణ సంస్థలకు చదరపు అడుగు నిర్మాణానికి రూ.900 నుంచి రూ.1,290 వరకు ధర చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే సంస్థలకు చదరపు అడుగుకు రూ.1,600 రేటును నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులపై ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి సగటున రూ.400 ఆర్థిక భారం పడింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కల ప్లాట్‌ను పొందే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.1.20 లక్షలు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని పొందే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.1.46 లక్షలు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటిని పొందే ఒక్కొక్కరిపై రూ.1.72 లక్షల ఆర్థిక భారం పడుతోంది. ఈ మొత్తమంతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నిర్మాణ సంస్థలకే దక్కుతోంది. ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం టీడీపీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చదరపు అడుగుకు రూ.2,200లు పేదల నుంచి వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతోంది. ఉయ్యూరు లాంటి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చదరపు అడుగుకు అయ్యే ఖర్చు కేవలం రూ.1,800 నుంచి రూ.2200 వరకు ఉంది. ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి, ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నప్పుడు చదరపు అడుగుకు రూ.2,200 ఎందుకవుతోంది? తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు చదరపు అడుగుకి కేవలం రూ.900 నుంచి రూ.1100 మాత్రమే అవుతోంది. ఫ్లాట్ల కేటాయింపులో, లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రజలను టీడీపీ నేతలు మోసం చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపులో టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. –జంపాన కొండలరావు, వైఎస్సార్సీపీ, ఉయ్యూరు, పట్టణ అధ్యక్షుడు రాజకీయ నాయకుల ప్రతిపాదనే ప్రధాన అర్హత హౌసింగ్ ఫర్ ఆల్ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే జరగడం లేదు. టీడీపీ నేతలు ప్రతిపాదించిన పేర్లను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. నా తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్ల కేటాయింపు పత్రాలు ఇచ్చారు. నాకు మాత్రం మూడు నెలల నుంచి ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందంటూ రోజూ ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. నిన్న జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని చెప్పారు. అక్కడకు వెళ్తే ఏమీ లేదు. ఓట్ల కోసమే సామాన్యుల ఆశలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. – వి.నాగలక్ష్మి, సీతన్నపేట, విజయవాడ ►విజయనగరం ఒకటో వార్డులో ఉంటోన్న బొడ్డు అన్నపూర్ణ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మూడుసార్లు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఆమెకు ఇల్లు మంజూరు కాలేదు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఇల్లు ఎందుకు మంజూరుకాలేదో కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నానని, చిన్నచిన్న పనులు చేయగా వచ్చిన ఆదాయంతో ఇంటి అద్దె కట్టుకోవడం భారంగా ఉందని అన్నపూర్ణ వాపోతోంది. ►కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఆదర్శనగర్‌కు చెందిన నండూరి వెంకటలక్ష్మి (60) నాలుగేళ్ల క్రితం ఇంటికి దరఖాస్తు చేసుకుంది. మంజూరు కావడంతో తాపీ పనులు చేసుకుంటూ కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్ముతో ఇంటి పనులు ప్రారంభించింది. ఆ డబ్బుకు మరో రూ.2 లక్షలు అప్పు చేసి పిల్లర్స్తోపాటు గోడలు నిర్మించింది. ఇది జరిగి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా ముట్టలేదు. ఇంటి పనులు వీసమంతైనా ముందుకు సాగలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక మనోవేదనతో పక్షవాతం వచ్చి మంచానపడింది. వచ్చే పింఛన్‌తో మందులు కొనుక్కుంటూ అద్దె ఇంట్లో తలదాచుకుంటోంది. -
పండగవేళ.. గృహ రుణం ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: పండగ సీజన్ ప్రారంభమైంది. సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ, గృహ రుణం తీసుకోవాలనే విషయంలో తికమక పడుతుంటారు. బ్యాంకు, గృహరుణ సంస్థలో రుణం ఎలా తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ కథనం.. గృహ రుణం విషయంలో ఎన్నో అనుమానాలుంటాయి. ఎంత రుణం తీసుకోవాలి? ఎన్నేళ్లకు తీసుకోవాలి? మంచి బ్యాంకు ఏది? ఇలా అనుమానాల జాబితా పెద్దదే. రుణం తీసుకోవాలనుకునే వారు తమ ఆదాయం, వాయిదాల చెల్లింపు సామర్థ్యం, కావాల్సిన రుణం ఆధారంగా ఎవరు తక్కువ వడ్డీ ఇస్తారో గుర్తించి ఆ బ్యాంకులు, రుణ సంస్థలను ఎంచుకోవాలి. పోలికలున్నాయి: రుణ అర్హత నిబంధనలు, పరిశీలనా రుసుములు, ఆస్తి విలువ మదింపు, ఆస్తిని తాకట్టు పెట్టుకోవటం, ఖాతాదారు గురించి తెలుసుకోవటం (కేవైసీ), రుణ చరిత్ర, ఒప్పంద పత్రాలు ఇలా దాదాపు అన్ని అంశాల్లోనూ బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు పాటించే నిబంధనలు ఒకేలా ఉంటాయి. వడ్డీరేట్లలో తేడా: గృహరుణ సంస్థలు ప్రైమ్ లేడింగ్ రేటు (పీఎల్ఆర్) ప్రామాణికంగా వడ్డీ రేట్లను నిర్ణయించి, రుణాలను మంజూరు చేస్తాయి. జూన్ 30, 2010 వరకు కూడా బ్యాంకులు ఈ విధానాన్నే పాటించేవి. ఆ తర్వాత నుంచి మరింత పారదర్శకంగా ఉండేలా బేస్‌రేట్ విధానానికి మారాయి. గతంలో బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకున్న చాలామంది ఖాతాదారులు ఇంకా పీఎల్ఆర్ విధానంలోనే కొనసాగుతున్నారు. బ్యాంకులు బేస్‌రేట్ కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవు. రుణ వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులు తమ ఖాతాదార్లను నిలుపుకోవడానికి తమ బేస్‌రేటును తగ్గిస్తుంటాయి. ఒకసారి బేస్ రేటు తగ్గిస్తే.. ఈ ప్రాతిపదికన రుణం తీసుకున్న రుణ గ్రహీతలందరికీ ఆ ప్రయోజనం అందుతుంది. బ్యాం కులు బేస్‌రేటుపై కొంత శాతం అధికంగా వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. గృహరుణ సంస్థలు పీఎల్ఆర్కు కొంత శాతం తక్కువగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. వడ్డీ రేట్లు మారినప్పుడు బ్యాంకులు బేస్ రేటును తగ్గించకుండా అధికంగా ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల కొత్త ఖాతాదారులకు మేలేకానీ, ఇప్పటికే రుణం తీసుకున్న వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రుణం తీసుకోబోయే ముందు వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకు బేస్‌రేటు తగ్గిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బేస్ రేటుకు, వడ్డీ రేటుకు వ్యత్యాసం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం పండగ సీజన్ కాబట్టి చాలా బ్యాంకులు బేస్‌రేట్ మీదనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే స్వల్ప వడ్డీ మీద రుణాలిస్తున్నాయి. బ్యాంకులు, గృహ రుణ సంస్థలు చలన వడ్డీపై రుణం తీసుకున్న వారి విషయంలో ముందస్తు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి రుసుములూ విధించడం లేదు. స్థిర వడ్డీ, రెండు రకాల వడ్డీ (కొన్నాళ్లు స్థిరం, ఆ తర్వాత చలనం) విధానంలో తీసుకున్న వారికి మాత్రం రుసుముల భారం రెండు చోట్లా ఉంది. ఎన్‌హెచ్‌బీ నిబంధనల ప్రకారం సొంత వనరులతో రుణం తీర్చిన సందర్భాల్లో గృహరుణ సంస్థలు ఎలాంటి రుసుములూ వసూలు చేయకూడదు. వడ్డీరేట్లు, రుణాల మంజూరు, ఇతర నిబంధనల్లో తేడాలు లేనప్పటికీ చాలామంది బ్యాంకుల నుంచి మాత్రమే రుణం తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీనికి కారణం చాలా రోజులుగా వాటితో అనుబంధం ఉండటం, విస్తరించి ఉండటం బ్యాంకులకు కలిసొస్తుంది. అన్నిచోట్లా సేవలు అందకపోవటం, హెచ్ఎఫ్సీల నుంచి రుణం తీసుకోవడానికి ప్రధాన అడ్డంకి. బ్యాంకు, గృహరుణ సంస్థ ఎక్కడి నుంచి రుణం తీసుకున్నా ముందుగా అవి ఇప్పటికే రుణం తీసుకున్న వారికి అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలించాలి. ఒకసారి మీరు ఆసంస్థ ఖాతాదారుగా మారిన తర్వాత మీకు ఎలాంటి లాభాలు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. కొత్త ఖాతాదారుల్లో సమానమైన ప్రయోజనాలను అందించే బ్యాంకు/గృహరుణ సంస్థకే ప్రాధాన్యం ఇవ్వండి.