DCB Bank
-
ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా
DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 7.90 శాతంగా ఉంచింది. సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు ఒక లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం వడ్డీ అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు, కంపెనీ క్లారిటీ ఇది) బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 7- 45 రోజుల డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై 7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) -
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
డీసీబీ బ్యాంకులోనూ ఇకపై ప్రభుత్వ లావాదేవీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు (వ్యాపారం) ఆర్బీఐ నుంచి ఆమోదం లభించినట్టు డీసీబీ బ్యాంకు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వీలుగా డీసీబీ బ్యాంకును ఏజెన్సీ బ్యాంకుగా నియమించినట్టు తెలిపింది. ప్రైవేటురంగ బ్యాంకులనూ ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది మే నెలలో నిర్ణయాన్ని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే డీసీబీ బ్యాంకుకు ఈ ఆమోదం లభించింది. -
డీసీబీ బ్యాంక్ లాభం 7 శాతం అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.65 కోట్ల నికర లాభం వచ్చిందని, 7 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ తెలియజేసింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం వృద్ది చెందిందని వివరించింది. గత క్యూ1లో రూ.233 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో 17 శాతం వృద్ధితో రూ.273 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 4.23% నుంచి 3.90 శాతానికి తగ్గింది. రుణాలు 31 శాతం అప్.. బ్యాంక్ ఇచ్చిన రుణాలు 31 శాతం వృద్ధితో రూ.21,243 కోట్లకు పెరిగాయని, డిపాజిట్లు కూడా 31 శాతం పెరిగి రూ.25,032 కోట్లకు చేరాయని డీసీబీ బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు 6 శాతం తగ్గి (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 14 శాతం) రూ.33 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకు ముందటి క్వార్టర్లో (గత ఆర్థిక సంవత్సరం క్యూ4) 1.79 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.86 శాతానికి పెరిగాయి. -
డీసీబీ బ్యాంక్ నుంచి విదేశాలకు రెమిటెన్స్ సర్వీసులు
ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ తాజాగా ’డీసీబీ రెమిట్’ పేరిట రెమిటెన్స్ సర్వీసులు ప్రారంభించింది. దీనితో దేశీయంగా బ్యాంక్ ఖాతా ఉన్నవారు విదేశాలకు ఆన్లైన్లో నగదు పంపొచ్చు. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ, జర్మనీల కోసం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చని డీసీబీ బ్యాంక్ తెలిపింది. నిర్ధారిత విదేశీ మారక రేటు ప్రకారం ముందుగా.. ఖాతాదారు ఏ బ్యాంకు ఖాతా నుంచైనా డీసీబీ బ్యాంక్ ఖాతాలోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తదుపరి పని దినం లోగా సదరు నగదును విదేశాల్లోని లబ్ధిదారు ఖాతాకు డీసీబీ బ్యాంక్ బదలాయిస్తుంది. విదేశీ కళాశాలల్లోని పిల్లల చదువుల కోసం, వైద్యం ఖర్చులు మొదలైన వాటి కోసం ఈ సత్వర రెమిటెన్స్ సేవలు ఉపయోగపడతాయని డీసీబీ బ్యాంక్ రిటైల్ విభాగం హెడ్ ప్రవీణ్ కుట్టి తెలిపారు. ఎవెన్యూస్ పేమెంట్స్ సంస్థతో కలిసి డీసీబీ బ్యాంక్ ఈ కొత్త సర్వీసు ప్రారంభించింది. -
డీసీబీ బ్యాంక్ లాభం 24 శాతం డౌన్
23 శాతం పెరిగిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.53 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.70 కోట్లతో పోల్చితే 24 శాతం క్షీణత నమోదైందని డీసీబీ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం పెరిగిందని పేర్కొంది. 2015–16 క్యూ4లో రూ.230 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.284 కోట్లకు పెరిగిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 31 శాతం వృద్ధితో రూ.220 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.64 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 1.51 శాతం నుంచి 1.59 శాతానికి, నికర మొండి బకాయిలు 0.75 శాతం నుంచి 0.79 శాతానికి పెరిగాయని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.307 కోట్లకు, మొత్తం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.1,046 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గురువారం బీఎస్ఈలో డీసీబీ బ్యాంక్ షేర్ 1 శాతం క్షీణించి రూ.180 వద్ద ముగిసింది. ఈ నెల 26 నుంచి రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా లాభం రూ. 7 కోట్లు ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా (ఆర్‌ఐఐఎల్) నికర లాభం సుమారు 140 శాతం ఎగిసింది. రూ. 3.04 కోట్ల నుంచి రూ. 7.30 కోట్లకు పెరిగింది. ఇక, ఇతర ఆదాయంతో పాటు మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ. 25.26 కోట్ల నుంచి రూ. 30.90 కోట్లకు పెరిగింది. మరోవైపు, 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం 5.12 శాతం పెరుగుదలతో రూ. 15.62 కోట్ల నుంచి రూ. 16.42 కోట్లకు చేరింది. రూ. 10 ముఖ విలువ గల ఈక్విటీ షేరుపై రూ. 3.50 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని ఆర్‌ఐఐఎల్ బోర్డు సిఫార్సు చేసింది. దీనితో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌తో పాటు మొత్తం రూ. 6.36 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. -
రుణ రేట్లు తగ్గించిన డీసీబీ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డీసీబీ బ్యాంక్ మంగళవారం బేస్ రేటు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. దీంతో రుణ గ్రహీతల ఈఎంఐ విలువ తగ్గే అవకాశం ఉంది. బ్యాంక్ బేస్ రేటును 0.06 శాతం మేర తగ్గించింది. దీంతో ఇది 10.70 శాతం నుంచి 10.64 శాతానికి పడింది. ఎంసీఎల్ఆర్ను 0.5 శాతం వరకు తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్.. ఓవర్‌నైట్‌కు 0.5 శాతం తగ్గి 9.32 శాతానికి, నెలకు 0.2 శాతం తగ్గి 9.72%కి దిగింది. ఇతర మెచ్యూరిటీలకు ఎంసీఎల్ఆర్లో ఎలాంటి మార్పు లేదు. బీపీఎల్ఆర్ను 17.95% నుంచి 17.89%కి త గ్గించింది. రుణ రేట్ల తగ్గింపు నిర్ణయం మే నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. -
ఇక ఆధార్ ఏటీఎంలు
ఎటువంటి ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ నంబరుంటే చాలు!! కార్డ్‌లెస్ ఏటీఎం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ మిషన్లు బయోమెట్రిక్ విధానంలో పనిచేస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మిషన్లకు అనుసంధానం చేస్తారు. దీనితో ఆధార్ కార్డు నంబర్, వేలి ముద్ర ఇవ్వగానే ఏటీఎం మిషన్ల నుంచి నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమం త్వరలో దేశంలోని 400 ఏటీఎం మిషన్లకు విస్తరింప చేయనున్నారు. -
'ఆధార్' ఏటీఎంలు వచ్చేస్తున్నాయ్..
హైదరాబాద్ : ఎటువంటి కార్డు అవసరం లేకుండానే ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ నంబరు ఉంటే చాలు కార్డ్‌లెస్ ఏటీఎం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ మెషీన్లు బయోమెట్రిక్ విధానంలో పనిచేస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మెషీన్లకు అనుసంధానం చేస్తారు. దీనితో ఆధార్ కార్డు నంబర్, వేలి ముద్ర ఇవ్వగానే ఏటీఎం మిషన్ల నుంచి నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ విధానం త్వరలో దేశంలోని 400 ఏటీఎం మెషీన్లకు విస్తరింప చేయనున్నారు. -
విస్తరణ దిశగా డీసీబీ బ్యాంక్
- తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 25 శాఖలు - డీసీబీ బ్యాంక్ ఎండీ, సీఈవో మురళీ ఎన్ నటరాజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రయివేటు రంగ బ్యాంక్ డీసీబీ పేర్కొంది. ఇందులో భాగంగా వచ్చే రెండు మూడేళ్లలో శాఖల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12గా ఉన్న శాఖల సంఖ్యను 30కి, ఆంధ్రప్రదేశ్‌లో శాఖల సంఖ్యను 5 నుంచి 15కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీసీబీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో మురళీ ఎన్ నటరాజన్ చెప్పారు. విస్తరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో సొంతంగా రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఖమ్మం జిల్లాలో కొత్తగా ఒక శాఖను ప్రారంభించినట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ డీసీబీ మొత్తం వ్యాపారంలో 7% తెలంగాణ నుంచే వస్తోందని, రానున్న కాలంలో దీన్ని 10%కి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి వెంబడి కొత్త శాఖలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటికే సర్వే పూర్తయింది. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 157 శాఖలతో బ్యాలెన్స్ షీటు రూ. 16,000 కోట్లుగా ఉంది. దీన్ని మూడేళ్లలో రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం’ అని వివరించారు. కొత్తగా వస్తున్న పేమెంట్ బ్యాంకులు, ఇతర బ్యాంకుల వల్ల పోటీ పెరిగి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయన్నా రు. వ్యాపార విస్తరణకు అదనంగా ఎలాంటి నిధులు అక్కర్లేదని, 2017 మార్చి తర్వాతే మూలధనం అవసరమవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
5 శాతం పెరిగిన డీసీబీ నికర లాభం
ముంబై : ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 5 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.45 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.47 కోట్లకు పెరిగిందని డీసీబీ తెలిపింది. తమకు వర్తించే పన్ను రేటు 16 శాతమని, కానీ తాము 35 శాతం పన్ను రేటు చొప్పున చెల్లించామని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురళి ఎం. నటరాజన్ చెప్పారు. అందుకే నికర లాభం తగ్గిందని వివరించారు. నికర మొండి బకాయిలు 0.97 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 1.96 శాతానికి చేరాయని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.352 కోట్ల నుంచి రూ.404 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.140 కోట్లకు పెరిగాయని, మొత్తం ఆదాయం రూ.204 కోట్లకు పెరిగిందని వివరించారు. త్వరలో కొత్తగా 30 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని, 400 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని తెలిపారు. -
స్టాక్స్ వ్యూ
టీసీఎస్స బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.2,475 టార్గెట్ ధర: రూ.3,350 ఎందుకంటే: టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయ పరంగా నిరాశపరిచిన ఫలితాలు నికర లాభంలో మాత్రం అంచనాలను మించాయి. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా కంపెనీ ఆదాయం తగ్గింది. రూ.24,219 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో ఆర్జించిన ఆదాయం(రూ.21,551 కోట్లు)తో పోల్చితే ఇది 12 శాతం అధికం. అయితే గత ఆర్థిక సంవత్సరం క్యూ3 క్వార్టర్‌తో పోల్చితే 1 శాతం తగ్గింది. ఇంగ్లాండ్, ఇతర యూరోప్ దేశాలు, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో వృద్ధి స్వల్పంగా తగ్గింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 9% వృద్ధితో రూ.5,906 కోట్లకు పెరిగింది. ఐపీఓకు వచ్చి పదేళ్లైన సందర్భంగా ఉద్యోగులకు రూ.2,628 కోట్ల బోనస్‌ను ఇవ్వనున్నది. దీంతో నికర లాభం రూ.3,713 కోట్లకు పరిమితమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ 12-14 శాతం వృద్ధి సాధిస్తుందని నాస్కామ్ అంచనా వేసింది. దీని కంటే అధిక వృద్ధినే సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం వేస్తోంది. కొత్త క్లయింట్ల సంఖ్య, క్లయింట్ల నుంచి ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. డీసీబీ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.119 టార్గెట్ ధర: రూ.160 ఎందుకంటే: వ్యాపార వృద్ధి పటిష్టంగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.130 కోట్లకు, ఇతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు చేరాయి. పన్ను కేటాయింపుల రద్దు కారణంగా నికర లాభం 61 శాతం వృద్ధితో రూ.63 కోట్లకు పెరిగింది.. 2008-09లో రూ.88 కోట్లు, 2009-10లో రూ.79 కోట్లు చొప్పున నష్టాలు పొందిన ఈ బ్యాంక్ మెల్లగా లాభాల బాట పడుతోంది. 2014-15లో రూ.191 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2008-09లో రూ.306 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.186 కోట్లకు తగ్గాయి. మూడేళ్లలో బ్యాలెన్స్ షీట్‌ను రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బ్యాంక్ ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రెండేళ్లలో 50 కొత్త శాఖలను ఏర్పాటు చేసింది. మూడేళ్లలో మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నది. దీంతో మొత్తం బ్యాంక్ శాఖల సంఖ్య 250కు పెరగనున్నది. రెండేళ్లలో రుణ వృద్ధి 26 శాతం వృద్ధితో రూ16,572 కోట్లకు పెరుగుతుందని అంచనా. నికర వడ్డీ ఆదాయం నిలకడగా పెరుగుతుండడం, రుణ నాణ్యతను సుస్థిరంగా కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, మొండి బకాయిలు తదితర అంశాలకు కేటాయింపులు తక్కువగా ఉండడం సానుకూలాంశాలు. -
డీసీబీ బ్యాంక్ నికర లాభం 61% అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని డీసీబీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.63 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభం(రూ.39 కోట్లు)తో పోల్చితే 61 శాతం వృద్ధి సాధించామని డీసీబీ బ్యాంక్ తెలిపింది. రూ.10 కోట్ల పన్ను ప్రయోజనాలు, మొండి బకాయిలకు కేటాయించిన రూ.7 కోట్లను వెనక్కి తీసుకోవడం వల్ల ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని డీసీబీ బ్యాంక్ ఎండీ, సీఈఓ మురళి నటరాజన్ చెప్పారు. 2013-14 క్యూ4లో రూ.100 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 2014-15 క్యూ4లో రూ.130 కోట్లకు పెరిగిందని వివరించారు. వడ్డీయేతర ఆదాయం రూ.33 కోట్ల నుంచి రూ.46 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.87 నుంచి 1.76కు మెరుగుపడిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.62 కోట్ల మొండిబకాయిలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ)కి విక్రయించామని పేర్కొన్నారు. సెంటిమెంట్ సానుకూలంగానే ఉన్నప్పటికీ, పరిస్థితులు గడ్డుగానే ఉన్నాయని వివరించారు. -
ఇకాజ్ మొబైల్ పేమెంట్ అప్లికేషన్
హైదరాబాద్: డీసీబీ బ్యాంక్‌తో కలిసి మొబైల్ పేమెంట్స్ కంపెనీ ఇకాజ్- తన తాజా మొబైల్ పేమెంట్ అప్లికేషన్ ‘ఎంఓడబ్ల్యూ’ను ఆవిష్కరించింది. డబ్బు పంపేవారి లేదా స్వీకరించేవారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ సమాచారంతో సంబంధం లేకుండా పేమెంట్లు పంపగలగడం దీని ప్రత్యేకత. తమ మొబైల్ నంబర్, పేరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా యూజర్లు ఈ యాప్ సేవలను పొందవచ్చు. పేమెంట్‌కు వీలుగా తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు జతచేయాలి. రిసీవర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా పేమెంట్ చేయవచ్చు. పేయర్ కార్డ్ నుంచి డబ్బు డెబిట్ అయి, నేరుగా రిసీవర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. బ్యాంక్ ఖాతాలో డబ్బు డిపాజిట్‌కు కూడా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. -
త్వరలో మైక్రో హోమ్ లోన్స్
డీసీబీ బ్యాంక్ (గతంలో డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్) ప్రధానంగా గ్రామీణ మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రైతులు, చిన్నవ్యాపారుల అవసరాలకు అనుగుణంగా కొత్త రుణ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటుచేస్తున్నామని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపట్టామంటున్న డీసీబీ బ్యాంక్ అగ్రి, ఇంక్లూజివ్ బ్యాంకింగ్ హెడ్ నరేంద్రనాథ్ తో సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుడడంతో వ్యవసాయ మార్కెట్‌పై ఏమైనా ప్రభావం పడిందా? మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు బాగా తక్కువ కురవడంతో వ్యవసాయ రుణాలపై కొంత ప్రభావం ఉన్న మాట వాస్తవమే. కానీ రానున్న వారాల్లో వర్షాలు కొంత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం వస్తుండటంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఎటువంటి ప్రత్యేకమైన పథకాలను డీసీబీ బ్యాంక్ అందిస్తోంది? గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, వారి ఆదాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన పథకాలను అందిస్తున్నాము. ఉదాహరణకు రైతులకు ఉద్యోగస్తుల వలే ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. కొన్ని కాలాల్లో అధికాదాయం ఉంటే మరికొన్ని కాలాల్లో ఉండదు. దీనికి అనుగుణంగానే రైతులు నగదు లభ్యతను బట్టి ఈఎంఐలు చెల్లించే విధంగా ట్రాక్టర్ రుణాలను అందిస్తున్నాము. అలాగే వారి అవసరాలకు అనుగుణంగా ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాం. రైతులకు అవసరమైన కిసాన్ క్రెడిట్ కార్డులు, బంగారు ఆభరణాలపై రుణాలు, ట్రాక్టర్లు, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన వాణిజ్య వాహనాలకు రుణాలను ఇస్తున్నాం. కేవలం ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు కూడా ట్రాక్టర్లకు రుణాలను ఇస్తున్నాం. అర్హత కలిగిన రైతులకు మూడు రోజుల్లోనే రుణాలను మంజూరు చేస్తున్నాం. రైతులకు, గ్రామీణ మహిళలకు కొత్తగా ఏమైనా పథకాలను ప్రవేశపెట్టే ఆలోచన ఉందా? కూలీల దగ్గర నుంచి జీతం ఆదాయంగా ఉన్న వారి వరకు అందరికీ ఇచ్చేలా మైక్రో గృహ రుణ పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నాం. ఈ పథకం కింద కనిష్టంగా రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రుణాన్ని ఇస్తాము. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కార్యక్రమాల గురించి వివరిస్తారా? రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలు పెరిగాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాము. మొన్నటి వరకు హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చిన డీసీబీ ఈ మధ్యే ఆకివీడు, అనపర్తి, గుంటూరు సమీపంలోని నల్లపాడు, కరీంనగర్‌కు దగ్గర్లోని రేకుర్తి, విజయవాడలో కొత్తగా శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే నిజామాబాద్‌లోని బోర్గాన్, కైకలూరు, మిర్యాలగూడ, మహబూబాబాద్ సమీపంలోని పెద్దతండాల్లో శాఖలను ఏర్పాటు చేయనున్నాం. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 133 శాఖలను కలిగి ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయం, మైక్రో ఎస్ఎంఈ లు, ఎస్ఎంఈలు, మిడ్ కార్పొరేట్స్, రిటైల్ వ్యాపారాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. రూ. 100లతో రికరింగ్ డిపాజిట్, మైక్రో బిజినెస్, డీసీబీ ఎలైట్ అకౌంట్ పేరుతో విభిన్న పథకాలను అందిస్తున్నాం. ఈ రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ప్రకటించిన రుణ మాఫీ పథకం మీ వ్యవసాయ పోర్ట్‌ఫోలియోపై ఏమైనా ప్రభావం చూపిందా? రిటైల్ అగ్రి వ్యాపారంలోకి ఈ మధ్యనే ప్రవేశించాం. అందులో ఈ రెండు రాష్ట్రాల్లో అగ్రి బ్రాంచ్‌లను కొత్తగా ప్రారంభించడంతో ఈ రుణ మాఫీ పథక ప్రభావంపై అప్పుడే చెప్పలేం. ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన ‘జన ధన యోజన’ పథకంలో డీసీబీ కూడా పాలుపంచుకుంటోందా? ఇతర వాణిజ్య బ్యాంకుల్లాగానే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాం.