'ఆధార్' ఏటీఎంలు వచ్చేస్తున్నాయ్..
Published Sat, Apr 16 2016 4:03 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM
హైదరాబాద్ : ఎటువంటి కార్డు అవసరం లేకుండానే ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ నంబరు ఉంటే చాలు కార్డ్‌లెస్ ఏటీఎం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ మెషీన్లు బయోమెట్రిక్ విధానంలో పనిచేస్తాయి.
ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మెషీన్లకు అనుసంధానం చేస్తారు. దీనితో ఆధార్ కార్డు నంబర్, వేలి ముద్ర ఇవ్వగానే ఏటీఎం మిషన్ల నుంచి నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ విధానం త్వరలో దేశంలోని 400 ఏటీఎం మెషీన్లకు విస్తరింప చేయనున్నారు.
Advertisement
Advertisement