ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్‌ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది.
ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment