Smart card
-
స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేని చిప్స్
సాక్షి, హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ సరఫరా చేస్తున్న స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేని చిప్స్ వాడుతున్న వ్యవహారం వెలుగు చూసింది. స్మార్ట్ కార్డులు సకాలంలో రాకపోవడం, అందిన కార్డుల్లోనూ నాణ్యత లేకపోవటంపై చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నా, రవాణాశాఖ సరిగ్గా స్పందించలేదు. చివరకు ఆ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పుడు ఎట్టకేలకు విచారణ జరిపింది. జారీ అయిన కార్డుల్లో నాణ్యత లేని చిప్స్ ఉన్నాయన్న విషయాన్ని శాస్త్రీయంగా తెలుసుకొని చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ రవాణా శాఖకు లైసెన్సులు, ఆర్సీ కార్డులకు సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్న నోయిడాకు చెందిన సంస్థను బాధ్యతల నుంచి తప్పించింది. తదుపరి రవాణాశాఖకు సంబంధించి ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా డిబార్ చేయటం విశేషం. వాహన లైసెన్సులు, ఆర్సీ కార్డులకు సంబంధించి కొన్నేళ్లుగా రవాణాశాఖ చిప్స్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. స్కాన్ చేయగానే పూర్తి వాహనం, లైసెన్సు వివరాలను తెలిపే సమాచారాన్ని అందించే చిప్స్‌ను స్మార్ట్ కార్డుల్లో నిక్షిప్తం చేసి జారీ చేస్తున్నారు. టెండర్ల ద్వారా ఈ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు రవాణా శాఖ అప్పగించింది. అలా ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న మెజర్స్ కలర్‌ప్లాస్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్మార్ట్ కార్డుల జారీ టెండర్ దక్కించుకుంది. కానీ, చాలాకాలంగా ఆ సంస్థ కార్డులను సరిగ్గా జారీ చేయటం లేదు. స్మార్ట్ కార్డు రుసుము, పోస్టల్ చార్జీలు చెల్లించినా నెలల తరబడి కార్డులు సరఫరా కాక వాహనదారులు టెన్షన్ పడాల్సి వస్తోంది. దీనిపై అధికారులను ప్రశి్నస్తే, కార్డులు జారీ అవుతాయని చెప్పటం, తప్ప వాస్తవాలు వెల్లడించటం లేదు. ఆ ఫిర్యాదుతో.... ఇటీవలే మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ది సేఫ్ కమ్యూనిటీ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ నుంచి రవాణా శాఖకు గత మే నెలలో ఫిర్యాదు అందింది. తమకు జారీ అయిన స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేదన్నది దాని సారాంశం. దీంతో రవాణాశాఖ కొన్ని కార్డులను సేకరించి స్మార్ట్ కార్డ్ ఆపరేటింగ్ సిస్టం నిబంధనల మేరకు కార్డుల్లో నాణ్యత ఉందో లేదో తేల్చాలని ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్)ని కోరింది. శాంపిల్ కార్డులను పరిశీలించిన ఎన్ఐసీ, కొన్ని కార్డుల్లోని చిప్స్‌లో నాణ్యత లేదని తేల్చి నివేదిక అందించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన రవాణా శాఖ, ఆ కార్డులను సరఫరా చేసిన నోయిడాలోని సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తేలి్చ, ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. కార్డుల జారీకి సంబంధించి రవాణా శాఖతో చేసుకున్న ఒప్పందంలోని అంశాలకు విరుద్ధంగా వ్యవహరించినందున, తదుపరి రవాణా శాఖకు సంబంధించి ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా ఆ సంస్థను డిబార్ చేస్తున్నట్టు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు, టెండర్ ఒప్పందాలను ఉల్లంఘించినందుకు ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంది. -
విలేజి టెక్నాలజీ
రాజీగళ్ల భూపాల్..మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్ గ్రామాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ఫార్మా కంపెనీలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసేందుకు మెగా గ్యాస్ కంపెనీ పోతారంలో సబ్‌స్టేషన్ (కంప్రెసర్) ఏర్పాటు చేసింది. తమ గ్రామంలో సబ్‌స్టేషన్ పెట్టిన నేపథ్యంలో.. ఇక్కడి ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరడంతో ఆ ఏర్పాట్లు చేసింది. వినియోగదారులు రూ.6 వేలు చెల్లిస్తే.. వారి ఇంటికి వంటగ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్ ఇస్తారు. దానికి ఒక మీటర్‌ను అమర్చుతారు. ప్రతి నెలా కంపెనీ సిబ్బంది వచ్చి మీటర్ వద్ద స్కాన్ చేసి.. వినియోగించిన గ్యాస్‌కు సంబంధించిన బిల్లు ఇస్తారు. అచ్చు కరెంటు బిల్లు తరహాలో నెలనెలా బిల్లు కట్టేస్తే సరిపోతుంది.సిలిండర్ల కోసం ఇబ్బంది తప్పింది పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేయడం గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంది. గతంలో సిలిండర్ అయిపోతే రెండు, మూడు రోజుల వరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. దానికితోడు గ్యాస్ సిలిండర్లు ఇచి్చనప్పుడు డెలివరీ చార్జ్‌లు, సరీ్వస్ చార్జ్‌లు అంటూ అదనంగా డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నిరంతరాయంగా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. వాడుకున్న మేర బిల్లు చెల్లిస్తే సరిపోతోంది. – హరిమోహన్‌రెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ ఉద్దమర్రి గ్రామంలో స్మార్ట్ కార్డులుమూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలోని వాటర్ ఫిల్టర్ కేంద్రం (సామాజిక నీటి శుద్ధి కేంద్రం)లో సిబ్బంది లేకుండానే ప్రజలు నీటిని కొని తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. తాజా మాజీ సర్పంచ్ యాంజాల అనురాధ పట్టభద్రురాలు కావడం, డిజిటల్ విధానంపై అవగాహన ఉండటంతో.. స్మార్ట్‌కార్డు విధానం ఏర్పాటుకు నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులకు ముందుగా రూ.50 చెల్లిస్తే ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్‌తోపాటు యాక్టివేట్ చేసిన స్మార్ట్ కార్డును వినియోగదారులకు ఇస్తారు. తర్వాత వినియోగదారులు నగదు ఇచ్చి స్మార్ట్ కార్డును రీచార్జ్ చేసుకోవచ్చు. వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మిషన్ సెన్సర్ వద్ద స్మార్ట్ కార్డును స్కాన్ చేస్తే కార్డులో నుంచి రూ.5 కట్ అయి.. వారు నాజిల్ దగ్గర పెట్టిన వాటర్ క్యాన్ నిండుతుంది. ఇలా స్మార్ట్‌కార్డు వినియోగించిన ప్రతిసారీ రూ.5 చొప్పున కట్ అయి.. వాటర్ బాటిల్ నిండుతుంది. ఫిల్టర్ వాటర్ కేంద్రం 24 గంటలూ ఆన్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా వెళ్లి నీళ్లు తెచ్చుకోవచ్చు.కావాల్సినప్పుడల్లా తెచ్చుకుంటున్నాం.. స్మార్ట్ కార్డ్‌తో మంచి ప్రయోజనం ఉంది. రోజూ నీళ్లు తెచ్చుకోవాలంటే చేతిలో డబ్బులు, చిల్లర ఉండకపోవచ్చు. నెల మొదటి వారంలో డబ్బు ఉన్నపుడు రీచార్జి చేయించుకుంటే చాలు. ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అవసరమైనప్పుడల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. –జూపల్లి పద్మ, ఉద్దమర్రి -
‘టీజీ’ స్మార్ట్ కార్డులేవీ ?
సాక్షి, హైదరాబాద్: వాహనాల నంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారింది. ఈనెల 15 నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ సీరీస్ కేటాయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ రోజుకు దాదాపు 10 వేల వరకు కొత్త వాహనాలు రాష్ట్రంలో రోడ్డెక్కుతాయి. ఇప్పటి వరకు ఏ వాహనానికి కూడా టీజీ సీరిస్ ఆర్‌సీబుక్ గానీ, కొత్త లైసెన్సు స్మార్ట్‌కార్డు గానీ జారీ కాలేదు. అయితే దీనిపై రవాణాశాఖ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్ కార్డుల జారీ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, చిప్‌తో కూడి కార్డు సరఫరా చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వాటి జారీ ఆగిపోయింది. చార్జీల వసూలు సరే... ఆర్సీ, నంబర్ ప్లేట్, లైసెన్స్ బట్వాడా పేరిట చార్జీలు వసూలు చేస్తున్న రవాణాశాఖ వాటిని వారంరోజులుగా ఇవ్వకపోవడంపై వాహనదా రులు షోరూమ్ నిర్వాహకులనో, రవాణాశాఖ అధికారులనో ప్రశ్నిస్తే.. సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ఆమేరకు మార్పు చేయాల్సి ఉందని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. రెండుమూడు రోజుల్లో వాటి బట్వాడా మొదలవుతుందని చెబుతున్నారు. వాహనాల రాష్ట్ర కోడ్ మారినందున సాఫ్ట్‌వేర్‌ను కూడా యుద్ధప్రాతిపదికన మార్చాలి. ఈనెల 15 నుంచి రాష్ట్ర కోడ్ మారుతుందని రవాణాశాఖకు స్పష్టమైన అవగాహన ఉంది. వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయొచ్చు. కానీ వారం రోజులు గడుస్తున్నా అప్డేట్ కాలేదని పేర్కొంటుండటం విచిత్రంగా ఉంది. రాష్ట్ర కోడ్ మార్పు అమలులోకి రావటానికి మూడు రోజుల ముందు నుంచే కార్డుల జారీ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు అప్డేట్ చేయటం లేదో..ఎందుకు జాప్యం జరుగుతోందో సమాచారం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించటం లేదు. ఆర్సీ, లైసెన్స్ స్మార్ట్‌కార్డులు లేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తనిఖీ చేస్తే డౌన్లోడ్ చేసుకున్న పత్రాలను చూపండి అంటూ రవాణాశాఖ సిబ్బంది సలహా ఇస్తున్నారు. కానీ, రాష్ట్ర సరిహద్దులు దాటే చోట ఉండే చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఆ కాగితాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, చిప్ ఉన్న స్మార్ట్ కార్డులే చూపాలని పేర్కొంటున్నారని వాహన దారులు చెబుతున్నారు. -
వాలంటీర్ల ద్వారా ఆరోగ్యశ్రీపై పేదలకు అవగాహన కల్పిస్తున్నాం
-
ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్ లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా చర్యలు
-
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
స్మార్ట్‌కార్డులు సిద్ధం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కార్యక్రమంలో కీలక అడుగుపడింది. పథకం అమలుకు దిక్సూచిలా భావిం చేస్మార్ట్కార్డులు సిద్ధమవుతున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్మార్ట్‌కార్డులు అందజేస్తానని ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి వీటిని ఈనెల 17వ తేదీన లబ్ధిదారులకు అందజేయాల్సి ఉన్నప్పటికీ, కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలన్న యోచనతో ఆలస్యంగా జరిగింది. 24వ తేదీ వరకు గడు వు అనుకున్నా.. ఇంకా స్పష్టత రాకపోవడం తో 28వ తేదీ వరకు కార్డులను పంపిణీ చే యాలని లక్ష్యంగా పెట్టుకుంది. దళితబంధు అమలు కోసం ప్రత్యేక వెబ్సైట్, సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకమైన బయోమెట్రిక్ కార్డులు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో సెల్‌ఫోన్ సిమ్ కార్డు తరహాలో ఉన్న ప్రత్యేకమైన చిప్‌లో దళితబంధు లబ్ధిదారుల సమాచారం ఉంటుంది. లబ్ధిదారునితోపాటు అతని భార్యాపిల్లలు, ఎంచుకున్న ఉపాధి/వ్యాపారం/యూనిట్ వివరాలు, వాటికి అయిన ఖర్చు, బ్యాంక్ బ్యాలెన్సు, రోజువారీ లావాదేవీలు, పొదు పు, నిర్వహణ, బీమా/నామినీ ఇలా మొత్తం అతను ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం పొందుపరిచి ఉం టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లబ్ధిదారులకు ఇది ఆధార్‌కార్డుతో సమానం. ఈ కార్డు ల ద్వారా ప్రతి లబ్ధిదారుని ఖాతాలో రూ.10 లక్షలు జమ అయిన దగ్గర నుంచి వాటిని ఖర్చు చేస్తున్న తీరు, బిల్లుల చెల్లింపు, లాభనష్టాలు అన్నింటినీ అధికారులు పర్యవేక్షిస్తారు. వారి వ్యాపారస్థితిని బట్టి అప్రమత్తం చేస్తుంటారు. ప్రత్యేక యాప్‌లో వివరాలు.. త్వరలోనే దళితబంధు యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో లబ్ధిదారులకు కావాల్సిన సమాచారం. అధికారుల ఫోన్‌నెంబర్లు, వ్యాపారం వివరాలు, తోటి వ్యాపారుల పురోగతి, మార్కెట్ ట్రెండ్స్, వివిధ వ్యాపారాల సమాచారం తదితర కీలకమైన విషయాలు అందుబాటులో ఉంచుతారు. దీనికితోడుగా దళితబంధుకు ప్రత్యేక పోర్టల్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాగా, దేశంలోనే ఇంతటి భారీ ఆర్థిక ప్యాకేజీతో రూపొందించిన పథకం కావడంతో దీని అధ్యయనానికి వివిధ పరిశోధక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నుంచి పలువురు హుజూరాబాద్‌ను సందర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పరిశోధక సంస్థలు కూడా ఈ పథకం అమలు అధ్యయనంపై ఆసక్తి చూపిస్తున్నాయి. -
ఆన్లైన్లో రైల్వే స్మార్ట్ కార్డుల రీచార్జ్ సదుపాయం
సాక్షి, సిటీబ్యూరో: స్మార్ట్‌కార్డు ద్వారా రైల్వే ప్రయాణం చేసేవారు ఇక నుంచి ఆన్లైన్లోనే రీచార్జ్ చేసుకోవచ్చు. వెబ్‌పోర్టల్‌లో యూటీఎస్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. డిజిటలైజేషన్లో భాగంగా రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నించోవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను (ఏటీవీఎం) అందుబాటులోకి తెచ్చా రు. తాజాగా స్మార్ట్‌కార్డు రీచార్జ్ సదుపాయం కల్పించారు. సాధారణంగా ప్రయాణికులు తమ స్మార్ట్ కా ర్డులను రైల్వే బుకింగ్ కౌంటర్లలో మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి రావడం వల్ల ప్రతిసారి రైల్వే బుకింగ్ కౌంటర్లకు రావలసి వస్తోంది. తాజాగా ఆన్లైన్ రీచార్జ్ సదుపాయం కల్పించడం వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లయింది. ప్రస్తుత కోవిడ్ సమయంలో బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది. సేవలు ఇలా.... ►ప్రయాణికులు https://www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లో మొదట నమోదు చేసుకోవాలి. ►మెనూలో ‘స్మార్ట్ కార్డు రీచార్జీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ►డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ విధానాల ద్వారా చెల్లించవచ్చు. ►అనంతరం ప్రయాణికులు ఏటీవీఎమ్ రీడర్ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘రీచార్జి స్మార్ట్ కార్డు’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఏటీవీఎమ్‌లో ఆన్లైన్ రీచార్జీ వివరాలు వస్తాయి. ఈ మేరకు స్మార్టు కార్డులో రీచార్జ్ అవుతుంది. ►ప్రయాణికులు అన్రిజర్వ్డ్ టికెట్లను, ప్లాట్ఫారం టికెట్లను రైల్వే స్మార్ట్ కార్డుల ద్వారా పొందితే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం ఉండదు. ►మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామ రుజువు, ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. ►ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్ కార్డు రీచార్జి చేసుకోవాలి. -
హైదరాబాద్ మెట్రో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: మెట్రో స్మార్ట్ కార్డున్న ప్రయాణికులకు క్యాష్ బ్యాక్ పథకంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్ఎంఆర్ ఎండీ స్పష్టతనిచ్చారు. స్మార్ట్‌కార్డు కొనుగోలు లేదా రీచార్జీ చేసిన నాటినుంచి 90 రోజులపాటు క్యాష్ బ్యాక్ స్కీం వర్తిస్తుంది. స్మార్ట్ కార్డు రీచార్జీని మెట్రో స్టేషన్లలో లేదా పేటీఎం, టీ- సవారీ యాప్‌ల ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు. స్టేషన్లలో రీచార్జీ చేసిన వెంటనే క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. యాప్ ద్వారా చేసుకుంటే రెండు గంటల సమయం పడుతుందని తెలిపారు. రూ.100 నుంచి రూ.300 మొత్తాన్ని స్మార్ట్ కార్డులో రీచార్జీ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వర్తించదు. కానీ ప్రయాణ చార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుంది. రూ.400 నుంచి రూ.2000 వరకు స్మార్ట్‌కార్డులో రీచార్జీ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్‌తో పాటు ప్రయాణ చార్జీల్లోనూ 10 శాతం రాయితీ లభిస్తుందన్నమాట. అంటే కనీసం రూ.400 నుంచి రూ.2000 వరకు రీచార్జీ చేసుకునేవారికే అధిక ప్రయోజనం చేకూరనుంది. స్మార్ట్ కార్డులో ఎంత రీచార్జీ చేసుకుంటే.. ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందంటే.. రీచార్జీ చేసుకునే మొత్తం లభించే క్యాష్ బ్యాక్ కార్డులో జమయ్యే మొత్తం (క్యాష్‌బ్యాక్‌తో కలిపి) 400 100 500 500 150 650 1000 300 1300 1500 600 2100 1750 700 2450 2000 800 2800 -
టికెట్ లేకున్నా.. రైట్..రైట్
♦ స్మార్ట్ కార్డులతోనే బస్సు చార్జీల చెల్లింపు ♦ కండక్టర్లు లేకుండా నిర్వహణ ♦ ఆటోమేటిగ్గా చార్జీల చెల్లింపు కోసం పరికరాలు ♦ సింగపూర్ సంస్థతో ఆర్టీసీ చర్చలు ♦ త్వరలో 500 బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఎక్కగానే ‘టికెట్.. టికెట్..’అంటూ కండక్టర్ రావడం తెలుసు.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కండక్టర్‌కు బదులు డ్రైవరే టిమ్ యంత్రం ద్వారా టికెట్ ఇవ్వడమూ చూశాం. కానీ ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే.. బస్సులో ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి ఆటోమేటిగ్గా చార్జీల చెల్లింపు జరిగిపోయే సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. స్మార్ట్ కార్డులు, ప్రత్యేక యంత్రాల ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. విదేశాల్లోని కొన్ని నగరాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సింగపూర్‌కు చెందిన ఓ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. సింగపూర్ ప్రతినిధులతో భేటీ బస్సుల్లో కొత్త వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఉన్నతాధికారులు గురువారం సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని 500 సిటీ బస్సుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రదర్శించింది. అయితే కిక్కిరిసి, ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించే మన బస్సులకు ఆ వ్యవస్థ సరిపోదని పేర్కొన్న అధికారులు... పలు మార్పు చేర్పులు సూచించారు. ఈ మేరకు మార్పులు చేసి 15 రోజుల్లో సిద్ధం చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రయోగం సఫలమైతే మిగతా బస్సుల్లోనూ ‘స్మార్ట్’వ్యవస్థ’ను అమలు చేస్తామని సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. తొలుత ప్రయాణికులు కార్డును యంత్రం ముందు చూపాల్సి ఉంటుందని.. అనతి కాలంలోనే కార్డు జేబులో ఉన్నా నేరుగా సెన్సార్లే రుసుమును మినహాయించుకునే విధానం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కండక్టర్ల వేతనాల రూపంలో ఆర్టీసీపై పడుతున్న భారాన్ని తగ్గించు కోవడమే ఈ ఏర్పాటు ఉద్దేశమన్న విమర్శలు వస్తున్నాయి. దీన్ని విరమించుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎలా వసూలవుతుంది? బస్సుల్లో ముందు, వెనక తలుపుల వద్ద ప్రత్యేక యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు విధిగా ముందు తలుపు నుంచి ఎక్కి వెనుక తలుపు నుంచి దిగాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్, రూపేకార్డులతోపాటు ఆర్టీసీ ప్రత్యేకంగా జారీ చేసే స్మార్ట్‌కార్డులతో ఈ సాంకేతిక వ్యవస్థ అనుసంధానమవుతుంది. ప్రయాణికుడు ముందు తలుపు నుంచి ఎక్కినప్పుడు.. ఆ చోటు నుంచి చివరి గమ్యస్థానం వరకు నిర్ధారించిన టికెట్ రుసుము ప్రయాణికుడి కార్డు నుంచి కట్ అవుతుంది. ప్రయాణికుడు నిర్ధారిత స్టేజీ వద్ద వెనక తలుపు నుంచి దిగినప్పుడు.. ప్రయాణించిన దూరానికి సరిపడా మొత్తాన్ని మినహాయించుకుని మిగతా మొత్తాన్ని తిరిగి ఆ కార్డులో జమ చేస్తుంది. ఎక్కడైనా ప్రయాణికులు వెనక డోర్ నుంచి బస్సు ఎక్కితే డ్రైవర్ దగ్గర ఉండే ఎర్ర లైటు వెలుగుతూ అలారం మోగుతుంది. డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు లేనివారు డ్రైవర్ వద్ద వివిధ విలువలో స్మార్ట్‌కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు
జాతీయ జనాభా పట్టిక ఆధారంగా జారీకి కేంద్రం కసరత్తు సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టికలోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది. జాతీయ జనాభా పట్టిక రూపకల్పనపై గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ భేటీకి హాజరయ్యారు. సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇస్తారు. వాటిని పరిష్కరించి తుది జాతీయ జనాభా పట్టిక తయారుచేస్తారు. దీని ఆధారంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తారు. ఈ రిజిస్టర్‌లోని వివరాల ఆధారంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు. -
ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు
బహుళ ప్రయోజన కార్డుగా జారీ హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే... మే నెలాఖరు గడువు సాక్షి, హైదరాబాద్: ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)లోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. దేశంలోనే ప్రతి పౌరుడికి ఈ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డును, మొబైల్ ఫోన్ నెంబర్‌ను దీనితో అనుసంధానం చేస్తుంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఐడీ కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా పనికొస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందేందుకు ఇదే ప్రధాన ఆధారంగా ఉంటుంది. ఈ కార్డుల జారీ ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అందుకు వీలుగా ఇంటింటి సర్వేను పూర్తి చేసి తుది జాతీయ జనాభా పట్టికను తయారు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ కారణంగా గ్రేటర్ పరిధిలో సర్వే జరగలేదు. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా గతంలో జనగణన సందర్భంగా ఇచ్చిన వివరాలను ఆధార్ కార్డు నెంబర్లు, మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేస్తారు. అప్పుడు ఇచ్చిన వివరాల్లో మార్పులు చేర్పులు తప్పు ఒప్పులున్నా సవరిస్తారు. జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో న్యూఢిల్లీలో గురువారం వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య దీనికి హాజరయ్యారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇవ్వనుంది. వీటన్నింటినీ పరిష్కరించి సమగ్రంగా తుది జాతీయ జనాభా పట్టికను రూపొందిస్తారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తోంది. కార్డుల జారీకి దీనిని ప్రామాణికంగా గుర్తిస్తుంది. -
అరచేతిలో ఆరోగ్య డేటా
► రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ త్వరలో ఉచిత వైద్య పరీక్షలు ► సమగ్ర ఆరోగ్య వివరాలతో స్మార్ట్ కార్డులు ► ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సలో సమస్యల్ని పరిష్కరిస్తాం ► వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: చాలా మందికి బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నాయన్న సంగతి తెలియనే తెలియదు! ప్రాథమిక స్థాయిలో రోగాలను గుర్తించకపోతే అవి ముదిరి నయం కాని స్థితికి చేరుకుంటాయి. ఒక్కోసారి చేయి దాటిపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి అందరికీ ఆరోగ్య డేటా స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాదే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ప్రశ్న: ఆరోగ్య డేటా కార్డుల ఉద్దేశం ఏంటి? మంత్రి: అనేక వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవడం వల్ల చాలాసార్లు పరిస్థితి చేయి దాటిపోతోంది. ఇటీవల ఒకచోట నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 15 మందికి కేన్సర్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యాధి బారిన పడినవారు నిర్ఘాంతపోయారు. వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే వాటిని నయం చేయడానికి వీలుంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి ఆరోగ్యంపై వివరాలు సేకరించాలని నిర్ణయించాం. అందుకోసం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. బ్లడ్ గ్రూప్, లిఫిడ్ ప్రొఫైల్, గుండె, లివర్, కిడ్నీ ఇతరత్రా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలు సేకరిస్తాం. ఆ సమాచారాన్నంతా కంప్యూటరీకరించి ఆన్లైన్లో పెడతాం. ప్రతీ ఒక్కరికి ఒక ఆరోగ్య డేటా నంబర్ కేటాయిస్తాం. ఆ నంబర్‌తో ఏటీఎం కార్డు సైజులో ఆరోగ్య డేటా స్మార్ట్ కార్డు జారీ చేస్తాం. ఏదైనా సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్తే డేటా కార్డుపై ఉన్న నంబర్‌తో ఆన్లైన్లో ఆ రోగి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు. ప్రజలు కూడా తమ అనారోగ్య సమస్యలు తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్ర: అందరి ఆరోగ్య డేటా సేకరించడం సాధ్యమా? మంత్రి: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు డయాగ్నోస్టిక్ కేంద్రాలను నెలకొల్పుతాం. ఆయా కేంద్రాల్లో ప్రజలందరికీ ఉచితంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య డేటా సేకరణకు నిర్ణీత తేదీలు ప్రకటించి ఆ ప్రకారం వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తాం. తర్వాత వారికి ఆరోగ్య డేటా కార్డులు అందజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్ర: 12 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందడం లేదు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు? మంత్రి: త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తాం. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడతాం. ఉద్యోగులు ఒక విషయం అర్థం చేసుకోవాలి. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే కాకుండా ఆ స్థాయి లో మరో 24 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. కేవలం ఆ 12 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న అపోహలను ఉద్యోగులు విడనాడాలి. ప్ర: మిగిలిన ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్య సేవలు అందడంలేదన్న విమర్శలున్నాయి కదా! మంత్రి: రాష్ట్రం మొత్తం అలా ఏమీలేదు. నిమ్స్‌లో ఈ మూడు నెలల్లోనే 6 వేల మందికి ఉచిత ఓపీ నిర్వహించాం. ఆ కాలంలో అక్కడ 600 శస్త్ర చికిత్సలు జరిగాయి. ఎక్కడైనా సమస్యలున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుతాం. ప్ర: వైద్యశాఖలో భర్తీ ప్రక్రియ ఎలా జరగబోతోంది? మంత్రి: వరంగల్ ఎంజీఎం, ఆరోగ్య వర్సిటీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో కొత్త ఉద్యోగాలు మంజూరయ్యాయి. ఇవిగాక ఇప్పటికే వైద్య శాఖలో పనిచేస్తున్న 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం. ప్ర: ఆసుపత్రుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది. దీనిపై ఏమంటారు? మంత్రి: పాత ఔట్సోర్సింగ్ ఏజెన్సీలే ఇంకా కొనసాగుతుండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం సరిగ్గా లేదన్నది వాస్తవం. ఈ పరిస్థితిని ఈ ఏడాది మెరుగుపర్చుతాం. అందుకు సూపరింటెండెంట్లకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతను మేనేజ్మెంట్ నిపుణులకు అప్పగిస్తాం. -
ఇక ‘స్మార్ట్’గా ప్రయాణం
- సిటీ బస్సుల్లో స్మార్టకార్డులు - ప్రయోగాత్మకంగా రెండు ప్రధాన రూట్లలో అమలు - ప్రయోగం విజయవంతమైతే అన్ని రూట్లలో విస్తరణ సాక్షి,సిటీబ్యూరో: జేబులో డబ్బులు లేవా. ఏటీఎం కార్డు కూడా వెంట తెచ్చుకోవడం మరిచిపోయి బస్సెక్కేశారా...మరేం ఫర్లేదు. స్మార్ట్‌కార్డు ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా నిశ్చింతంగా పయనించవచ్చు. ఈ తరహా సదుపాయాన్ని త్వరలో నగరంలో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. ఒకటి, రెండు ప్రధాన రూట్లలో ఈ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన తరువాత ఫలితాలను బట్టి మిగతా రూట్లకు విస్తరిస్తారు. సిటీ బస్సుల్లో టిక్కెట్ లెస్, క్యాష్‌లెస్ ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెల రోజుల క్రితం ఆర్టీసీ స్మార్ట్‌కార్డుల కోసం ప్రణాళికలను రూపొందించిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై తాజాగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ముందుకు వచ్చిన బాష్ కంపెనీ స్మార్ట్‌కార్డుల పనితీరు, వాటిని ఉపయోగించే విధానంపై ఇటీవల బస్‌భవన్‌లో ఆర్టీసీ అధికారులకు నమూనా ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. మొదట దిల్సుఖ్నగర్-పటాన్చెరు, సికింద్రాబాద్-కొండాపూర్, ఉప్పల్-హైటెక్‌సిటీ, సికింద్రాబాద్-శంషాబాద్ వంటి ఎక్కువ దూరం ఉన్న రూట్లలో రెండింటిని ఎంపిక చేసి మెట్రో లగ్జరీ, పుష్పక్ బస్సుల్లో ప్రవేశపెడతారు. ఆ తరువాత వాటి పనితీరు, ప్రయాణికులు స్మార్ట్‌కార్డులు వినియోగించే తీరును గమనంలోకి తీసుకొని ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకుంటారు. ప్రీపెయిడ్ తరహాలో.... ప్రస్తుతం ముంబయిలో కేవలం బస్‌పాస్‌లకే పరిమితమైన స్మార్ట్‌కార్డులను హైదరాబాద్‌లో బస్‌పాస్‌లతో పాటు, రోజువారి టిక్కెట్లకు కూడా వర్తింప చేస్తారు. ఈ స్మార్ట్‌కార్డులు ప్రీపెయిడ్ తరహాలో ఉపయోగపడుతాయి. ప్రస్తుతం రైల్వేలో ఏటీవీఎంల ద్వారా ఇలాంటి ప్రీపెయిడ్ కార్డులను విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ రోజువారి ప్రయాణాన్ని, అందుకయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని రూ.50,రూ.100 నుంచి రూ.500, రూ.1000 వరకు తమ అవసరాన్ని బట్టి స్మార్ట్‌కార్డులను కొనుగోలు చేయవచ్చు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, మాధాపూర్, గచ్చిబౌలీ, తదితర ప్రాంతాల్లోని ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ నిపుణులు, ఉద్యోగులకు స్మార్ట్‌కార్డులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే నగరానికి వచ్చే పర్యాటకులు, సందర్శకులకు ఈ స్మార్ట్‌కార్డులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక్కసారి కార్డు కొనుగోలు చేసి నగరమంతా పర్యటించేందుకు అవకాశం ఉంటుంది. టిమ్స్‌తో అనుసంధానం... రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్‌కార్డులలో మైక్రో చిప్‌లు ఏర్పాటు చేస్తారు. ఆ కార్డు విలువ అందులో నమోదై ఉంటుంది. కండక్టర్ల వద్ద ఉండే టిక్కెట్ ఇష్యూయింగ్ (టిమ్స్) మిషన్లకు స్మార్ట్‌కార్డులను కూడా స్వీకరించే మరో ఆప్షన్‌ను ఇస్తారు. ప్రయాణికులు తాము పయనించిన దూరానికి చెల్లించవలసిన చార్జీలు స్మార్ట్‌కార్డు నుంచి నేరుగా ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ టిమ్స్ యంత్రాలను అనుసంధానం చేస్తారు. బస్‌పాస్ కౌంటర్లతో పాటు, కండక్టర్ల వద్ద కూడా స్మార్ట్‌కార్డులు లభిస్తాయి.స్మార్ట్‌కార్డులు వద్దనుకున్నవాళ్లు సాధారణ టిక్కెట్లపైన ప్రయాణం చేయవచ్చు.స్మార్ట్‌కార్డులు అందుబాటులోకి వస్తే క్షణాల్లో డబ్బులు చెల్లించి కార్డులు కొనుగోలు చేయవచ్చు. ఉదయం ఆఫీసులకు వెళ్లి సాయంత్రం ఇళ్లకు చేరుకొనే ఉద్యోగులకు, చిరువ్యాపారులకు, విద్యార్ధులకు ఈ స్మార్ట్‌కార్డుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. -
రేషన్‌కూ ఆధార్
రాష్ట్రంలో కుటుంబ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ పెట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రేషన్ కార్డుకు ఆధార్ కార్డు నంబరు జత పరిచేందుకు తగ్గ కసరత్తులు వేగవంతం అయ్యాయి. బోగస్ కార్డుల ఏరివేత లక్ష్యంగా ఆధార్ నంబర్‌ను లింక్ చేయనున్నామని పౌరసరఫరాల విభాగం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రక్రియ ముగియగానే స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల మంజూరు జరుగుతుందంటున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్ర పౌరసరఫరాల విభాగం నేతృత్వంలో రెండు కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసి ఉన్నారు. 2005లో మంజూరు చేసిన కార్డులు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. 2009 నుంచి కొత్త కార్డుల మంజూరు ఆగి ఉన్నాయి. దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. పాత కార్డులకు అతుకులు వేస్తూ కాలం గడుపుతూ వస్తున్నారు. ఈ కుటుంబ కార్డు దారులకు ఉచిత బియ్యంతో పాటుగా రాయితీపై నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అన్నిరకాల ధృవీకరణ పత్రాలకు మూలాధారంగా ఈ రేషన్ కార్డులు ఉంటూ వస్తున్నాయి. అలాగే, అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఈ కార్డుల ఆధారంగానే లబ్ధిదారులకు అందిస్తూ వస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున బోగస్ కార్డులు సైతం ఉన్నట్టు పరిశీలనల్లో తేలిఉన్నాయి. ఒకే కుటుంబంలో రెండు మూడు కార్డులు, ఒకే చిరునామాతో వివిధ పేర్లతో పలు కార్డులు ఉండటం వంటివి వెలుగు చూసి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ సబ్సిడీకి ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం లింక్ పెట్టడంతో పెద్ద ఎత్తున్న రెండు మూడు కనెక్షన్లను కల్గిన ఎల్పీజీ వినియోగదారులు గుట్టు రట్టు అయ్యాయి. అవన్నీ రద్దు అయ్యాయి. అలాగే, రాయితీలు వద్దంటూ చమురు సంస్థలు నిర్ణయించిన ధరకే సిలిండర్లను కొనుగోలు చేస్తున్న వాళ్లూ అధికమే. అదే సమయంలో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ను లింక్ చేశారు. ఈ ప్రక్రియతో నకిలీ ఓటర్ల ఏరి వేత ప్రక్రియ సాగుతూ వస్తున్నది. వీటికి ఆధార్ నంబర్ల అనుసంధానం ఫలితాల్ని ఇవ్వడంతో ఇక రాష్ట్రంలోని బోగస్ రేషన్ కార్డుల ఏరి వేతతో పాటుగా అర్హులైన పేదల్ని ఎంపిక చేయడానికి వీలుగా రేషన్ కార్డులకు ఆధార్ లింక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. రేషన్‌కు ఆధార్ లింక్: గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది స్మార్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల మంజూరుకు తగ్గ కసరత్తులు చేపట్టారు. ఇందుకు తగ్గ కార్యాచరణను ప్రైవేటు సంస్థకు అప్పగించి ఉన్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతున్న సమయంలో బోగస్ కార్డుల ఏరి వేతకు ఆథార్ లింక్ పెట్టాలన్న నిర్ణయానికి పౌరసరఫరాల విభాగం వచ్చి ఉన్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు అన్ని జిల్లాల్లోని ఆ విభాగం అధికారులకు పంపి ఉన్నారు. రేషన్ కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో దరఖాస్తులు ఇవ్వబోతున్నారు. ఆ దరఖాస్తుల్లో ఆథార్ నెంబరుతో పాటుగా ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను సైతం పొందు పరచాల్సి ఉంటుంది. ఈ నెంబర్ల ఆధారంగా బోగస్ కార్డుల ఏరి వేతతో పాటుగా అర్హులైన లబ్ధిదారుల్ని ఎంపిక చేసి, స్మార్ కార్డు రూపంలో త్వరలో రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంగా ఆ విభాగం అధికారి ఒకరు పేర్కొంటూ, స్మార్ కార్డుల తరహాలో రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్న వేళ ఆథార్ లింక్ పనిలో పనిగా ముగించడం మంచిదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి ఉన్నదన్నారు. ఆధార్ నెంబర్లను ఇవ్వని పక్షంలో రేషన్ కార్డులు రద్దు అయ్యేప్రమాదం ఉందని హెచ్చరించారు. మరి కొద్ది రోజుల్లో అధికారికంగానే రేషన్ కార్డుకు ఆధార్ లింక్ ప్రకటన వెలువడబోతున్నదని ఆ అధికారి పేర్కొనడం గమనార్హం. ఆధార్ నంబర్లు సరే, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను కోరడం బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సబ్సీడీ ఏ విధంగా బ్యాంక్ ఖాతాలోకి వెళుతున్నాయో, అదే విధంగా నిత్యవసర వస్తువుల రాయితీని రాష్ట్రప్రభుత్వం బ్యాంక్ ఖాతాలోకి మళ్లిస్తుందా..? అన్న ది వేచి చూడాల్సిందే. -
మార్చి 15 నుంచి స్మార్ట్ కార్డుల జారీ
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సాక్షి, ముంబై: అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తోన్న ‘స్మార్ట్ కార్డు’లను మార్చి 15 నుంచి జారీచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. బాంద్రాలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కార్యాలయంలో దేశంలోనే మొట్టమొదటి ‘స్పెషల్ కార్పొరేట్ ఆఫీస్’ను గురువారం ఆయన ప్రారంభించారు. బడా కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, కార్మికులకు శ్రేష్టమైన, సత్వర సేవలను అందించేందుకు ఈ కార్యాలయం దోహదపడనుంది. బాంద్రాలోని ఈ కార్యాలయం పరిధిలోకి 16 కంపెనీలను చేర్చారు. ఆయా కంపెనీల ఉద్యోగుల పీఎఫ్ క్లెయిమ్స్‌ను ఈ కార్యాలయం చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం బండారు దత్తాత్రేయ ‘సాక్షి’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే సంఘటిత కార్మికుల కోసం ‘యూనివర్సల్ అకౌంట్ నెంబరు’ (యూఎఎన్)ను ప్రారంభించినట్టు చెప్పారు. దీంతోపాటు అసంఘటితక కార్మికుల సంక్షేమం కోసం ‘యునివర్సల్ వర్కర్ ఐడెంటిఫికేషన్ నెంబరు’ (యూవీఐఎన్) పేరుతో పిలిచే స్మార్టుకార్డులను రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిని మార్చి 15 నుంచి జారీ చేయాలన్న యోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. ఈ కార్డులు జారీ చేసిన అనంతరం కేంద్ర కార్మిక శాఖలోని రూ. 27 వేల కోట్ల నిధులను అన్ని రంగాల కార్మికులకు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. నైపుణ్యం పెంపుదలకు ప్రత్యేక శ్రద్ద... అసంఘటిత రంగంలో నైపుణ్యంలేని కార్మికుల సంఖ్య అధికంగా ఉందని బండారు దత్తాత్రేయ తెలిపారు. వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు నైపుణ్యం కలిగిన (స్కిల్డ్ వర్కర్లు) కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా భవననిర్మాణ రంగంలో సుమారు 4.70 కోట్ల మంది కార్మికులుండగా వీరిలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే స్కిల్డ్ (నైపుణ్యం) కార్మికులున్నారు. వీరికి శిక్షణనిచ్చి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నైపుణ్యం పెంపుదల విషయంలో చైనా రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తుండగా, జపాన్ కోటి మందికి శిక్షణనిస్తోందని చెప్పారు. మనదేశంలో గతంలో కేవలం 2.80 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య పది లక్షలకు చేరిందన్నారు. రాబోయే రోజుల్లో జపాన్‌తో సమానంగా కోటి మందికి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శిక్షణ పొందే సమయంలో అసంఘటిత కార్మికులకు ప్రతి గంటకు రూ. 35 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులు 165 ఉన్నాయని, వీటిలో శిక్షణ పొందేవారికి 50 శాతం ప్రభుత్వం, మిగిలిన సగాన్ని శిక్షణనిచ్చే సంస్థ ద్వారా అందించేందుకు కృషి చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. నైపుణ్యం సంపాదించిన వారికి నెలసరి వేతనం రూ. 15 నుంచి రూ. 18 వేల వరకు వస్తోందని, బీటేక్ చేసిన వారికి కూడా ఇంతే వేతనం వస్తోందని చెప్పారు. -
సెట్ టాప్ బాక్స్ అక్కరలేదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఎయిర్టెల్ మరో ముందడుగు వేసింది. అంతర్గతంగా స్మార్ట్ కార్డ్ కలిగిన ఇంటెగ్రేటెడ్ డిజిటల్ టీవీలను (ఐడీటీవీ) శామ్సంగ్తో కలిసి భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీల కు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుం డానే డిజిటల్ ప్రసారాలను వీక్షించొచ్చు. ఐడీటీవీల ప్రత్యేకత ఏమంటే సిగ్నల్ నష్టాలను తగ్గిస్తాయి. ఒకే రిమోట్‌తో టీవీ ఆపరేట్ చేయొచ్చు. యాంటెన్నా నుంచి టీవీ వరకు తక్కువ వైర్లుంటాయి. విద్యుత్ 10% ఆదా అవుతుంది. ఇక పిక్చర్, శబ్దం నాణ్యతా బాగుంటుంది. శామ్సంగ్ స్మార్ట్ యాప్స్‌తోపాటు ఇన్ బిల్ట్ వైఫై కూడా ఉంది.శామ్సంగ్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ డెరైక్ట్ టీవీల ధర రూ.44,900 నుండి ప్రారంభం. శామ్సంగ్ ప్లాజా, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఔట్‌లెట్లలోనూ ఇవి లభిస్తాయి. పరిచయ ఆఫర్లో రూ.2,851 విలువగల ఎయిర్టెల్ మెగా హెచ్డీ డీటీహెచ్ ప్యాక్ 4 నెలలు ఉచితం. వీక్షణలో కొత్త అధ్యాయం..: టీవీ వీక్షణలో ఐడీటీవీలు నూతన ఒరవడి సృష్టిస్తాయని భారతి ఎయిర్టెల్ డీటీహెచ్, మీడియా సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెక్నాలజీ, సౌకర్యం వీటి ప్రత్యేకతన్నారు. వీటి అభివృద్ధికి భారీగా వ్యయం చేశామన్నారు.యూఎస్, ఈయూ వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ ప్రాచుర్యంలో ఉందన్నారు. ఐడీటీవీ కస్టమర్ల కోసం ప్రత్యేక బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. కాగా, హెచ్డీఎంఐ కేబుల్‌తో ఇతర కంపెనీల సెట్ టాప్ బాక్స్‌ను సైతం ఈ టీవీలకు అనుసంధానించుకోవచ్చు. -
మీరు దూకుడుగా వాహనాలు నడుపుతారా
మీరు దూకుడుగా వాహనాలు నడుపుతారా... రోడ్డు నిబంధనలు ఖాతరు చేయరా... రాజకీయ, ఆర్థిక బలాలన్నీ ఉన్నాయి.. ఎదురులేదనుకుంటున్నారా... అయితే, ఇకపై వీటన్నీటికీ చెక్ చెప్పండి. వాహనం నడపడంలో జాగ్రత్తలు పాటించండి. లేకుంటే మీ లెసైన్స్ రద్దువుతుంది. వాహనం నడిపేందుకే పనికిరారు... త్వరలో జిల్లాలో అమలుకానున్నస్మార్ట్కార్డు లెసైన్స్ విధానంలో ఇదే జరగనుంది. తస్మాత్ జాగ్రత్త..! అరసవల్లి:దేశంలోనే తొలిసారిగా రవాణాశాఖ సమూల మార్పులకు నాంది పలికింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా, తప్పు చేసిన సమయంలో అపరాధ రుసుం చెల్లిస్తూ.. నిరభ్యంతరంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపించేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పాటు, కొత్త పరికరాలను జిల్లాకు అందజేసింది. ప్రస్తుతం రవాణాశాఖ ఇస్తున్న స్మార్ట్ కార్డులతో కొత్త టెక్నాలజీని అనుసంధానం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. లెసైన్సే కీలకంగా... వాహనం నడిపే ప్రతి వ్యక్తికి లెసైన్స్ కీలకం. స్థానికతను కూడా లెసైన్సే తెలియజేస్తుంది. ద్విచక్రవాహనం నుంచి హెవీ వాహనం వరకు దేనిని నడిపినా లెసైన్స్ తప్పని సరి. దీనినే ఆధారం చేసుకుని వాహనదారులందరూ రోడ్డు నిబంధనలు పాటించేలా చర్యలకు ఉపక్రమించింది. వాహనాల నడపడంలో దూకుడు తనానికి చెక్చెబుతూ, నకిలీలను అరికడుతూ, లెసైన్స్‌దారు పూర్తి సమాచారం కార్డులోనే ఇమిడిపోయే నూతన స్మార్ట్‌కార్డు విధానాన్ని ప్రవేశటింది. ఈ కార్డు కేవలం స్మార్ట్ కాదండోయో.. వ్యక్తి(కార్డుదారుడి) సమాచారం ఎల్లప్పుడు అప్డేట్లా ఉండే నూతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన చిప్ అనుసంధానమై ఉంటుంది. రోడ్డు నిబంధనలు అతిక్రమించి ఫైన్ కట్టేసి వెళ్లి పోతామంటే ఇకపై కుదరదు. చిప్‌లో తప్పులు ఎక్కువ నమోదైతే లెసైన్స్ రద్దు చేస్తారు. గుట్టంతా కార్డులోనే... వాహనం నడిపేందుకు జారీచేసిన లెసైన్స్‌లో అభ్యర్థి పూర్తి వివరాలు ఉండేలా, స్మార్ట్ కార్డు రూపంలో డ్రైవింగ్ లెసైన్స్‌లు రవాణాశాఖ జారీ చేస్తుంది. ఇది స్మార్ట్ అని అంతా అనుకున్నారు. కాని ఆ స్మార్ట్‌లో ఉన్న స్మార్ట్ చూస్తే ఇంత ఉందా అనక తప్పదు. లెసైన్స్‌పై పేరు ఇతర వివరాలు కాకుండా.. కార్డుతో అనుసంధానంగా ఉండే చిప్‌లో అభ్యర్థి ఫొటో, ఎడమచేతి బొటన వేళిముద్ర, పూర్తివివరాలు ఉంటాయి. లెసైన్స్‌ను తీసుకున్న రోజు నుంచి రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఏ పనిచేసినా కార్డులో నమోదవుతుంది. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చిప్‌లో పొందుపరిచారు. లెసైన్స్ రెన్యువల్ చేసే సమయంలో రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న ‘కార్డు రీడరు’ అనే మిషన్‌లో లెసైన్స్‌ను(స్మార్ట్‌కార్డును) పెడతారు. వాహనదారుడు చేసిన తప్పులన్నీ చిప్‌లో అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి కార్డు పెట్టగానే సిస్టంపై కనిపిస్తాయి. రవాణాశాఖ అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలో వారి వద్ద ఉండే ‘కార్డు రీడర్ల’లో ఒకసారి కార్డు పెడితే చాలు... ఇక అంతా అప్డేట్ అయిపోతుంది. అక్కడికక్కడే పూర్తి వివరాలు, చేసిన తప్పుల వివరాలు జాబితా వెంటనే ప్రత్యక్షమవుతుంది. దీంతో లెసైన్స్దారుడిపై చర్యలకు ఉపక్రమిస్తారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా... రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరణాలు ఎక్కువయ్యూయి. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపం, తెలిసి కూడా తప్పులు చేయడం, తక్కువ అపరాధరుసుం కావడంతో పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. రవాణాశాఖ చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించడం శృతిమించితే అభ్యర్థి లెసైన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్ రూట్, మద్యం సేవించి వాహనాన్ని నడపడం, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలు చేయడం, ప్రమాదంలో వ్యక్తుల పాణాలు పోవడానికి కారణమవ్వడం ఇలా.. ఏ తప్పు చేసినా కార్డులో నమోదు అయిపోతుంది. తప్పులు ఎక్కువైతే.. ఆరు నెలలు వాహనం నడపకుండా సప్పెండ్ చేస్తారు. ఆ తరువాత కూడా మారక పోతే 5 ఏళ్లపాటు తాత్కాలిక రద్దు(చేసిన తప్పును బట్టి శాశ్వత రద్దు) చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జిల్లాకు చేరిన కార్డు రీడర్లు.. రవాణాశాఖలో పని చేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలకు ‘కార్డు రీడర్’ అనే ప్రత్యేకమైన మిషన్‌ను ప్రభుత్వం త్వరలోనే అందజేయనుంది. ఇప్పటికే జిల్లాకు కార్డు రీడర్లు చేరాయి. వాటి సాఫ్ట్ వేర్ఇంకా లోడ్చేయక పోవడంతో అందజేయలేదు. కొద్ది రోజుల్లోనే తనిఖీ అధికారులకు ఇవి అందజేస్తారు. వీటిలో స్మార్ట్ కార్డును పెట్టగానే అభ్యర్థి వివరాలు పూర్తిగా ప్రత్యక్షమవుతాయి. కార్డు నఖీలీదా కాదా, అభ్యరిథ అవునాకాదా, ఏ వాహననానికి అర్హుడు, ఎన్ని తప్పులు చేశాడు అన్న సమగ్ర సమాచారం ఎంవీఐ వద్ద ఉన్న మిషన్‌లో తెలిసిపోతుంది. దీంతో కలర్ జిరాక్స్ లెసైన్స్‌లు, డూప్లికేట్ ఇలాంటి ఇట్టే కనిపెట్టేయవచ్చు. త్వరలో నూతన విధానం ప్రారంభిస్తాం ‘కార్డు రీడర్’లు జిల్లాకు చేరాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో నూతన విధానం ప్రారంభిస్తాం. గతంలో లెసైన్స్‌పై అభ్యర్థి ఫొటో, పేరు ఇతర వివరాలు ఉండేవి. ఇప్పుడు జారీచేస్తున్న స్మార్ట్‌కార్డుల్లో కార్డుపైనే కాకుండా కార్డులో ఉండే చిప్‌లో అభ్యర్థి ఫొటో, ఎడమచేతి బొనవేలిముద్ర తదితర పూర్తివివరాలు ఉంటాయి. నకిలీ, కలర్జిరాక్స్ లెసైన్స్‌లను అరికట్టేందుకు కార్డురీడర్లు ఉపయోగపడతారుు. వాహనాన్ని నడిపేటప్పుడు తప్పని సరిగా ఒరిజినల్ లెసైన్స్ ఉండాలి. అంతా ఆన్లైన్ కాబట్టి ప్రతి ఉల్లంఘనా నమోదు అవుతుంది. తనిఖీ అధికారికి డ్రైవర్ లేదా లైస్న్స్ దారుడి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. -ఎస్.వెంకటేశ్వరావు, ఉప రవాణాశాఖ అధికారి(శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు) డ్రైవర్ల తప్పుల చిట్టా చిప్‌లో భద్రం దేశంలోనే మొదటి సారిగా జిల్లాలో స్మార్ట్ విధానం లెసైన్స్దారుడి సమగ్ర సమాచారం కార్డులోనే.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు కొద్ది రోజుల్లోనే శ్రీకాకుళం జిల్లాలో అమలుకు శ్రీకారం.. త్వరలో అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జిల్లాకు చేరిన కార్డు రీడర్లు, త్వరలో తనిఖీ అధికారులకు అందజేత.. -
ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత కోసం తెలంగాణ సర్కారు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (విశిష్ట గుర్తింపు కార్డు) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పౌరుడికీ విశిష్ట ప్రయోజనాలున్న సరికొత్త ‘స్మార్ట్ కార్డు’ ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే రేషన్ సరుకుల పంపిణీ మొదలు సామాజిక పింఛన్లు, విద్యార్థుల ఆర్థిక సాయం తదితర సంక్షేమ పథకాల ఫలాలన్నీ ఈ కార్డు ఆధారంగానే అందించే దిశగా చర్యలు వేగిరం చేస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ అంశం అతిత్వరలో కార్యరూపం దాల్చనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రతి వ్యక్తికీ కార్డు.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ రేషన్ కార్డుల ఆధారంగా కొనసాగుతున్నాయి. కొత్తగా సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చే క్రమంలోనూ రేషన్ కార్డుల గణాంకాలే కీలకం. కానీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు చేరడంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు అరికట్టి కేవలం లబ్ధిదారుడికి మాత్రమే ప్రయోజనం కలిగేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉండగా.. ఈ స్థానంలో ఇకపై ప్రతి వ్యక్తికి స్మార్ట్‌కార్డు ఇవ్వనున్నారు. దాదాపు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ తరహాలోనే ఈ స్మార్ట్‌కార్డులను జారీ చేయనున్నారు. జిల్లా యంత్రాంగంతో ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్స్‌పల్ కార్యదర్శి రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి జిల్లా అధికారులు పలు సందేహాలు అడగగా ఆయన కొత్త స్మార్ట్‌కార్డుల అంశాన్ని వివరించారు. ఆధార్‌తో అనుసంధానం.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డులతో బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారుడికి చేరాల్సిన సంక్షేమ ఫలాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా నేరుగా ఖాతాకు చేరుతాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ కార్డులు సైతం ఆధార్ కార్డుతో అనుసంధానమవుతాయి. స్మార్ట్‌కార్డులో ఆధార్ నంబర్‌తోపాటు సంబంధిత వ్యక్తి వివరాలు నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం గ్యాస్ సిలిండర్ రాయితీకి ఆధార్‌ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు అక్రమాలకు అడ్డుకట్టపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు స్మార్ట్ కార్డులు, ఆధార్ కార్డుల ద్వారా అమలైతే అక్రమాలను అరిక ట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ స్మార్ట్‌కార్డుల అంశానికి సంబంధించి మరింత స్పష్టత రానుంది. -
ఇక స్మార్ట్ కార్డ్ సేవలు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కోటికి చేరుకుంటున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు పరంగా అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎంటీసీ బస్సులు, మినీ బస్సులు, ఆటోలు, లోకల్‌రైళ్లు, షేర్ ఆటోలు ఇలా ఎన్నో వాహనాలు సేవలు అందిస్తున్నాయి. ఈ కోవలోకి త్వరలో మెట్రోరైలు కూడా రాబోతోంది. మెట్రోరైలు పథకానికి రూపకల్పనకు ముందే స్మార్ట్‌కార్డ్ పరిచయంపై పలుసార్లు చర్చలు జరిపారు. అనేక తర్జనభర్జనల పిదప ఎట్టకేలకూ ఒక నిర్ణయానికి వచ్చారు. మెట్రోరైల్ వారి ద్వారా అందుబాటులో వచ్చే స్మార్ట్‌కార్డ్ ప్రయాణికులకు అనేక విధాల సౌకర్యంగా ఉంటుం ది. ఈ స్మార్టు కార్డు ద్వారా నగర బస్సు సర్వీసులు, ఆటోలు, పార్కింగ్ ప్రదేశాలు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇలా 32 రకాల సేవలకు అవసరమైన నగదును ఈ స్మార్టుకార్డు ద్వారా చెల్లించవచ్చు. ఈ కార్డును ప్రవేశపెట్టేముందు అన్ని రకాల రవాణా సేవల వారితో చర్చలు జరిపి నియమ నిబంధనలను తెలియజేస్తారు. ఆ తరువాత స్మార్టు కార్డు సేవలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరుస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో యునిబేర్ కార్డు పేరుతో ఇలాంటి పలు సేవలు అందుతున్నాయి. అయితే చెన్నైలో స్మార్టు కార్డు సేవలను ఎంతమాత్రం ప్రజలు స్వీకరిస్తారోననే అనుమానాలున్నాయి. లోకల్ రైళ్లలో రోజుకు సగటున ప్రయాణించే లక్షమందిలో 50 వేల మంది మాత్రమే సీజన్ టిక్కెట్లు కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇది చాలా తక్కువ శాతంగా మెట్రోరైల్వే భావిస్తోంది. ఈ కారణంగా స్మార్టు కార్డును ప్రవేశపెట్టడంపై పలు రవాణా సంస్థలు ఇంకా చర్చలు సాగిస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ, చెన్నై నగర అభివృద్ధి విభాగ అధికారులు స్మార్ట్ కార్డు విషయాన్ని నిర్ధారించారు. స్మార్ట్ కార్డు ప్రవేశం పూర్తిస్థాయిలో ఖరారైన తరువాత ఆటో రిక్షా వారి మీటర్లలో సైతం మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. లండన్, హాంకాంగ్ వంటి నగరాల్లో ఇటువంటి స్మార్ట్‌కార్డులు ఇప్పటికే బహుళ ప్రజాభిమానాన్ని పొందినందున చెన్నైలో కూడా ప్రవేశపెట్టాలని మెట్రోరైలు యాజమాన్యం నిర్ణరుుంచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
ఇది మా ప్రభుత్వం..మా మాటే వినాలి!
మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ నేతల హల్చల్ గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని రగడ ఎంసీతో వాగ్వాదం ఆదోని రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు హల్చల్ చేశారు. ఇది మా ప్రభుత్వం.. మా మాట వినకపోతే అంతే సంగతి అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. శనివారం స్మార్ట్‌కార్డు మండల కో-ఆర్డినేటర్ నరసింహారెడ్డితో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని పనులు చేయించుకున్నారని, ప్రస్తుతం తమకు అధికారం వచ్చినా మా పనులు చేయకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. గ్రామంలో సర్పంచ్‌కు తెలియకుండానే ఫినో కంపెనీ యాజమాన్యం గ్రామ కో-ఆర్డినేటర్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ బైచిగేరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ధనుసింగ్ ప్రశ్నించారు. గ్రామ కో-ఆర్డినేటర్ల ఎంపికలో తన ప్రమేయం లేదని ఎంసీ సమాధానం ఇచ్చినప్పటికీ శాంతించకుండా చిందులేశారు. కపటి గ్రామంలో కూడా నిబంధనలుకు విరుద్ధంగా కో-ఆర్డినేటర్లను ఎంపిక చేశారని ఆ గ్రామ నాయకుడు మాధవతో పాటు మరికొంతమంది అధికారులపై విరుచుకుపడ్డారు. నెట్టేకల్, దిబ్బనకల్, గోనబావి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఈరన్న, లక్ష్మన్న, వలమన్న తదితరులు గ్రామ కో-ఆర్డినేటర్లను తొలగించాలని ఎంసీకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంసీ నర్సింహారెడ్డి ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఫోన్లో వివరిస్తుండగా అడ్డు తగిలిన దేశం నేతలు ప్రస్తుతం ఎంపికైన వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. నాయకులు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్‌తో ఫోన్లో మాట్లాడుతూ అవసరమైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పింఛన్లు పంచాలని, కొత్తగా ఎన్నికైన వారితో పంపిణీ చేయించేది లేదని ఖరాకండీగా తేల్చి చెప్పారు. దాదాపు గంటపాటు ఎంపీడీఓ సలీంబాష సమక్షంలోనే టీడీపీ నాయకులు, మండల కో-ఆర్డినేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయాన్ని జిల్లా కో-ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంసీ నర్సింహారెడ్డి విలేకరులకు చెప్పారు. -
తొలగింపులపై తిరుగుబావుటా
ఎమ్మిగనూరు రూరల్: స్మార్ట్ కార్డు లేదనే సాకుతో పింఛన్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తమపై రుద్దడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఆందోళనకు కారణమవుతోంది. ఎమ్మిగనూరు మండలంలో ఒక్క జూన్ నెలలోనే 410 పింఛన్లను తొలగించడంతో బాధితులు రోడ్డెక్కారు. సోమవారం గుడేకల్ గ్రామానికి చెందిన 170 మంది లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు సోమప్ప సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. పింఛన్లను పునరుద్ధరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. వీరికి వివిధ ప్రజా సంఘాల నేతలు రాముడు, జబ్బార్ మద్దతు పలికారు. మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వకపోగా.. ఏకంగా తొలగించడం పట్ల వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్ఐలు ఇంతియాజ్‌బాషా, నల్లప్పలు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వారు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంపీడీఓ పద్మజ అక్కడికి చేరుకుని పింఛన్లను పునరుద్ధరించే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పడంతో బాధితులు శాంతించారు. -
పండుటాకులకు పస్తులే
సామాజిక ‘భద్రత’ అంటూనే ప్రభుత్వం ‘బొటన వేలి పరీక్ష’ పెట్టి పండుటాకులను తీవ్ర హింసకు గురిచేస్తోంది. వయసు మీద పడి.. ఒంట్లో సత్తువ పోయి.. నెత్తురు సచ్చిన వృద్ధులకు స్మార్ట్ కార్డు విధానం అమలు చేయడం వల్ల నెలనెలా వచ్చే రూ. 200 పింఛన్ కూడా రాకుండా పోతోంది. మలిసంధ్య వేళలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధులు ప్రభుత్వం పెట్టిన విషమ పరీక్షలో ఓడిపోయి పస్తులుంటున్నారు. పింఛన్ కోసం నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పింఛన్‌దారుల అవస్థలు వర్ణణాతీతం. పింఛన్‌రాక, ఆసరాలేక దయనీయంగా కాలం వెళ్లదీస్తు న్నారు. మొత్తం 57,328 మంది వృద్ధాప్య పింఛన్‌దారులున్నారు. వీరిలో వేలిముద్రలు సరిపోవడంలేదని 19 వేల మందికి ప్రభుత్వం పింఛన్ నిలిపివేసింది. ఏం జరిగిందో.. పింఛన్ ఎందుకు రావడం లేదో తెలియక వృద్ధులు స్థానిక మండల కార్యాలయాల చుట్టూ తిరిగి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపడిపోతున్నారు. దయగల వాళ్లు వారి పట్ల జాలిపడి దోసెడు నీళ్లు తాపి, చెట్టు నీడకు కూర్చోబెడితే వాళ్లు బతికినట్టు, లేకుంటే అక్కడే అనాథ శవాలుగా మారిపోతున్నారు. ఇలాంటి హృదయ విదారకరమైన సంఘటనలు జిల్లాలో ఎన్నో జరుగుతున్నాయి. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకంటూ స్మార్ట్‌కార్డు మిషన్ల వినియోగాన్ని అమల్లోకి తెచ్చారు. పింఛన్‌దార్ల బొటన వేలిముద్రలు సేకరించి నమోదు చేశారు. ప్రతి నెలా పింఛన్‌దారుల బొటన వేలిముద్రలను స్మార్ట్‌కార్డు తెర మీద తీసుకొని, పాతవాటితో సరిపోతేనే ఆ నెల పింఛన్ ఇస్తారు. ఇలా నమోదు చేసిన వేలిముద్రలు మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతున్నాయి. ఆ తరువాతి నెల నుంచే సమస్యలు మొదలవుతున్నాయి. వృద్ధుల్లో రక్తంలేక నరాల బలహీనత వస్తోంది. సత్తువ లేకపోవడం, వణుకుతూ బలహీనంగా వేలు అద్దుతుండటంతో స్మార్ట్ కార్డు మిషన్ వారి వేలి ముద్రలను గుర్తించలేకపోతోంది. దీంతో వేలి ముద్రలు సరిపోవడం లేదంటూ అధికారులు ఏకంగా పింఛన్లను నిలిపివేస్తున్నారు. తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో దాదాపు 19 వేల మంది వృద్ధుల పింఛన్లు నిలిపివేసినట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. భిక్షాటన చేస్తున్న పెంటమ్మ వెల్దుర్తి మండలం కుకునూర్‌కు చెందిన పెంటమ్మకు 68 ఏళ్లు. గ్రామంలో ఉన్న గుడిసె శిథిలావస్థలో ఉన్నందున పక్కన ఉన్న ఓ ముస్లింల ఇంట్లో తలదాచుకుంటోంది. కొడుకు, కోడలు ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వలస పోగా ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. వేలిముద్రలు సరిపోవటం లేదని ఆమెకు పింఛన్ నిలిపివేశారు. పూట గడిచే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఆమె భిక్షాటనతో బతుకీడుస్తోంది. వెల్దుర్తిలో నిర్వహించే ప్రజావాణిలో అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటున్నా ఉపయోగం లేదు. పింఛన్ రాకపోవడంతో గ్రామంలో ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరుగుతూ పిడికెడు మెతుకులు అడుక్కుని తింటోంది. - పెంటమ్మ, కుకునూర్ సాంకేతిక, మానవీయ కారణాలుంటాయి జననం నుంచి మరణం వరకు వేలిముద్రల్లో ఎలాంటి మార్పులుండవు. స్మార్ట్ కార్డు మిషన్ వృద్ధుల వేలిముద్రలను అన్ని వేళల్లో ఒకే తీరుగా అంగీకరించకపోవడానికి సాంకేతిక పరమైన, మానవీయ కారణాలుంటాయి. మిషన్ మీద వేలిముద్రలు నమోదు చేసే సమయంలో నిపుణులు జాగ్రత్తగా ఉండి సేకరించాలి. వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ నరాల బలహీనత ఏర్పడి చేతులు వణుకుతాయి. దీంతో వేలుముద్రలు సరిగా పడకపోవడం వల్ల మిషన్ వాటిని గుర్తించకపోవచ్చు. - రాజేందర్‌రెడ్డి, వేలిముద్రల నిపుణుడు, ఫోరెన్సిక్ సీఐ ఏలు అద్దితే పేరు రావట్లేదటా.. నెలనెలా ఇన్నూర్ల(రూ. 200) పింఛన్ వచ్చేది. ఇప్పుడు పింఛన్ రాక ఐదు నెలల పొద్దు అవుతుంది. ఏందో మిషన్ మీద ఏలు అద్దితే పేరు వస్తలేదని సారోళ్లు పైసలు ఇస్తలేరు. పేరు కూడా తప్పుగా ఉందంట్రుండ్రు. నడవటానికి చేతగానీ ముసల్దాన్ని..రోగమొస్తే ఆస్పత్రికి పోదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. పూట గడవటం కష్టంగా మారింది.. తూప్రాన్ మండలం, కిష్టాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల పోచమ్మఅంటూ కంటతడి పెట్టుకుంది. బంధువుల వేలిముద్రలను ఎన్రోల్ చేసేందుకు అనుమతి కోరాం వృద్ధాప్య ఫింఛన్లలో కొందరు పింఛన్‌దారుల వేలిముద్రలు సరిపోకపోవడంతో సమస్య తలెత్తిన మాట నిజమే.. గతంలో నమోదు చేసిన నమూన వేలి ముద్రలతో ప్రస్తుత వేలిముద్రలను స్మార్ట్ కార్డు యంత్రాలు పోల్చుకోలేకపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోస్టల్ శాఖ ద్వారా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల వేలిముద్రలు చెరిగిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యుల్లో ఒకరి వేలిముద్రలను నమోదు చేసుకోవచ్చు. అయితే, ఫినో, మనిపాల్ ఏజెన్సీల ద్వారా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు ఈ సౌకర్యం లేదు. ఈ లబ్ధిదారులకు సైతం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పెన్షన్ డిస్బర్స్మెంట్ అధికారిని నియమించి పంపిణీని పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - పి.రాజేశ్వర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ -
కాఠిన్యానికి పరాకాష్ట
వేళ్లు లేని కుష్ఠు రోగులకు మంజూరు కాని పింఛన్లు వేలిముద్రలు వేస్తేనే స్మార్ట్ కార్డులని నిబంధన నాలుగు నెలలుగా అందని వైనం లబోదిబోమంటున్న బాధితులు విధి వంచితులు.. నిస్సహాయుల విషయంలో మానవత్వంతో వ్యవహరించడం మన కనీస కర్తవ్యం. మనుషులమైనందుకు అది మన సహజ లక్షణం. అయితే అనేక సందర్భాల్లో ఆ మానవ(తా)ధర్మం మరుగున పడుతోంది. దయ, కరుణ మాయమై కాఠిన్యం కమ్ముకుంటోంది. దాంతో సాయం పొందాల్సిన దీనులు కష్టాల పాలవుతున్నారు. ఆదుకునేవారు లేక వేదనతో విలవిలలాడుతున్నారు. అనకాపల్లిలో అదే జరుగుతోంది. పట్టణం చేరువలో కృష్ణాపురం లెప్రసీ కాలనీలో కుష్ఠు పీడితుల కష్టం తెలిసే మనసు కరిగిపోతుంది. ఇక్కడ సుమారు 40 మందికి నాలుగు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదు. వేలిముద్రలు వేస్తే తప్ప ఇవ్వబోమని అధికారులు కరాఖండీగా చెబుతున్నారు. అయితే ఏం.. అంటారా? ముద్ర వేయడానికి వారికి వేళ్లే లేవు! వ్యాధి వల్ల వేళ్లే లేకుంటే ముద్రలేం వేస్తామని ఆ బాధితులు బావురుమంటున్నారు. అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్: చూపులేని వాడిని ‘ఏం కనిపించదా?’ అని ప్రశ్నిస్తే ఎంత వేదన కలుగుతుంది! కాళ్లు లేనివాడిని ‘నడిచి రాలేవా?’ అని గద్దిస్తే ఎంత బాధనిపిస్తుంది! అనకాపల్లి లెప్రసీ కాలనీలో నిర్భాగ్యులకు అధికారులు వేస్తున్న ప్రశ్నలు వింటే వారికే కాదు.. మనకూ మనస్సు చివుక్కుమనిపిస్తుంది. నిబంధనలంటూ కఠినంగా వ్యవహరిస్తున్న వారి తీరు చూస్తే అయ్యో అనిపిస్తుంది. వేళ్లే లేని వారు వేలి ముద్రలు వేయాలని పట్టుబడుతున్న తీరు చూస్తే ఆగ్రహం తారస్థాయికి చేరుతుంది. అనకాపల్లి పట్టణం సమీపంలోని కృష్ణాపురం లెప్రసీ కాలనీ రోగుల పింఛను వ్యవహారాన్ని పరిశీలిస్తే అధికారుల తీరు ఆవేదన కలిగిస్తుంది. నాలుగు నెలలుగా పింఛను దక్కక నానా పాట్లూ పడుతున్న వారి దీన స్థితి హృదయాన్ని ద్రవింపజేస్తుంది. పట్టణంలోని రామకృష్ణాపురం సమీపంలో 1972లో ప్రభుత్వం లెప్రసీ కాలనీ ఏర్పాటు చేసింది. 31 ఇళ్లల్లో 115 మంది ఉంటున్నారు. వీరిలో 65 మంది లెప్రసీ రోగులు. 40 మందికి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ ఇస్తోంది. నాలుగు నెలల క్రితం వరకు వీరికి పింఛను సక్రమంగా అందేది. ప్రభుత్వం స్మార్ట్ కార్డుల ద్వారా పింఛన్ల పంపిణీ ప్రారంభించడంతో వీరి కష్టాలు మొదలయ్యాయి. పింఛను పొందాలంటే వేలిముద్రలు తప్పనిసరయ్యాయి. అదే లెప్రసీ రోగులకు శాపంగా మారింది. ఈ నలభైమంది రోగులకు చేతి వేళ్లులేవు. వేలి ముద్రలు లేవన్న కారణంగా నాలుగు నెలలుగా వీరికి అధికారులు పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్‌పైనే ఆధారపడి బతుకుతున్న వీరంతా ఏపనీ చేయలేని అసహాయ స్థితిలో ప్రస్తుతం యాచకులుగా మారి పొట్టపోసుకుంటున్నారు. నిబంధన వాస్తవమే అయినా తమకు వేళ్లేలేనప్పుడు వేలి ముద్రలు ఎలా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ పరిస్థితిని చూసి ప్రత్యామ్నాయ నిబంధన పెట్టాలన్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేని వేళ్లు ఎలా తేగలం? వేలి ముద్రలు లేవని నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. లేని వేళ్లు ఎలా తేగలం? పింఛన్ సొమ్ముతోనే జీవిస్తున్నాం. ఇప్పుడు అదికూడా రాకపోవడంతో ఇబ్బంది ప డుతున్నాం. అధికారులు మా సమస్యను అర్ధం చేసుకోవాలి. - డోకర గోపి, లెప్రసీ బాధితుడు అధికారులు అవమానిస్తున్నారు చేతి వేళ్లుంటేనే పింఛన్ మం జూరు చేస్తామని అధికారులు అవమానకరంగా మాట్లాడుతున్నారు. పింఛన్ అందక, ప్ర త్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాం. గత్యంతరం లేక మండుటెండలో యాచన చేసి బతుకుతున్నాం. - మావూరి మల్లేష్, లెప్రసీ కాలనీ ప్రెసిడెంట్ ఇవ్వకపోవడం వాస్తవమే నాలుగు నెలల నుంచి పింఛన్లు ఇవ్వకపోవడం వాస్తవమే. వేలిముద్రలు లేని కారణంగా, స్మార్ట్ కార్డుల పంపిణీ జరగలేదు. ఈ సమస్యను డీఆర్డీఏ పీడీ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. వచ్చే నెల నుంచి వేలి ముద్రలు వేయలేని లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వేలిముద్రలను సేకరించి పంపిణీ చేస్తాం. -జగదీష్, మణిపాల్ సర్వీస్ ప్రొవైడర్ మేనేజర్. -
మెట్రో స్మార్ట్ కార్డు ఇక బస్సుల్లోనూ..
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో వాడే స్మార్ట్ కార్డును డీటీసీ బస్సులతోపాటు క్లస్టర్ బస్సుల్లో వాడే సదుపాయం ఢిల్లీవాసులకు త్వరలోనే లభించనుంది. ఢిల్లీ ప్రభుత్వం వద్ద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను లెప్టినెంట్ గవర్నర్ ఆమోదించి ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపారు. మెట్రో స్మార్డ్ కార్డును బస్సులలో కూడా ప్రయాణికులు ఉపయోగించడానికి అనువుగా చేయడం కోసం బస్సులలో టికెట్ జారీ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీలో మార్పులు చేయడమో లేక మెట్రో స్మార్ట్ కార్డును స్వీకరించేలా దానిని మార్పు చేయడమో చేస్తామని రవాణా విభాగం అధికారులు అంటున్నారు. 2011 డిసెంబర్లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్త కార్డును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఢిల్లీ మెట్రో 2012లో మెట్రోతో పాటు మెట్రో ఫీడర్ బస్సులలో ఉపయోగించగల మోర్ ఢిల్లీ కార్డును విడుదల చేసింది. డీటీసీ బస్సులలో కూడా స్మార్ట్ కార్డు ఉపయోగించగల సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రతిపాదన పెండింగులోనే ఉండిపోయింది. అయితే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందువల్ల రవాణా విభాగం అధికారులతో చర్చించి స్మార్ట్ కార్డును బస్సులలో కూడా ఉపయోగించే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పిస్తామని మెట్రో అధికారులు అంటున్నారు. -
చిల్లర బాధలకు చెల్లు!!
న్యూఢిల్లీ: బస్సు ఎక్కిన తర్వాత చిల్లర లేదనో... టికెట్ పోగొట్టుకున్నామనో... ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. జేబులోనుంచి స్మార్ట్ కార్డు తీసి కండక్టర్ వద్దనున్న ఎలక్ట్రానిక్ మిషన్‌పై స్వైప్ చేసి, ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు.. ప్రశాంతంగా గమ్యానికి చేరుకోవచ్చు. టికెటింగ్, పేపర్ పాస్‌లు, కరెన్సీ వ్యవస్థకు స్వస్తి చెబుతూ ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్(డీఐఎంటీఎస్) బస్సుల్లోనూ స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రయోగాత్మకంగా ముందు మిలీనియమ్ డిపో బస్సులో ఈ కార్డులను ప్రవేశపెట్టాలని డీఐఎంటీఎస్ నిర్ణయించింది. త్వరలో తమ బస్సుల్లో ఈ కార్డులు అందుబాటులోకి రానున్నాయని మిలీనియమ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు. ‘ఈ స్మార్ట్ కార్డులు దాదాపుగా డెబిట్ కార్డుల్లా పనిచేస్తాయి. కండక్టర్ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ రీడర్‌పై దీనిని స్వైప్ చేయాలి. ఎక్కడికి వెళ్లాలో చెబితే ఆ ప్రాంతానికి సంబంధించిన కోడ్‌ను కండక్టర్ ఎంటర్ చేస్తాడు. దీంతో కార్డులో నిల్వ ఉన్న నగదులోనుంచి ప్రయాణ చార్జీ తగ్గుతుంది. ఇందుకోసం కొంతమందితో కలిసి ఇటీవల ప్రయోగాత్మకంగా పరిశీలించాం. మెట్రో స్మార్డ్ కార్డులకు, వీటికి చాలా తేడా ఉంది. స్టేషన్లలో ఉండే యంత్రాలపై మెట్రో కార్డులను స్వైప్ చేసి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ కదిలే బస్సుల్లో ఈ యంత్రాల ఏర్పాటు అసాధ్యం. అందుకే కండక్టర్ వద్ద ఉండే ఎలక్ట్రానిక్ రీడర్‌పై స్వైప్ చేస్తే చాలు. అయితే ఈ యంత్రంపై కేవలం వెళ్లాల్సిన గమ్యాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఈ కార్డులు అమల్లోకి వస్తే కాగితపు టికెట్లు, పాస్‌లను రద్దు చేస్తాం. ప్రతిరోజూ జేబులో చిల్లర ఉన్నాయో? లేదో? ప్రయాణికులు ఎందుకు చూసుకోవాలి? ప్రతిరోజూ బస్‌పాస్‌ను ఎందుకు కొనుక్కోవాలి? ప్రశాంతంగా మొబైల్ నుంచి తమ స్మార్ట్ కార్డులో సమయమున్నప్పుడు బ్యాలెన్స్ వేసుకుంటే సరి... ఇక ఎటువంటి చింతాలేని బస్సు ప్రయాణం ఎంజాయ్ చేయవచ్చ’ని డీఐఎంటీఎస్ చీఫ్ సహాయ్ తెలిపారు. -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకూ ఆరోగ్య బీమా!
50శాతం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకూ ఆరోగ్య బీమా సదుపాయాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీరు చెల్లించాల్సిన ప్రీమియంలో 50 శాతాన్ని తానే చెల్లించనుంది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారికి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) పథకం కింద స్మార్ట్‌కార్డ్ ఆధారిత నగదు రహిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని కేంద్రప్రభుత్వం 2007, అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ పథకం కింద అసంఘటిత రంగంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, హైవేల శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ గురువారం తెలిపారు. ఈ పథకం కింద ఆటో రిక్షా డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ప్రీమియంలో 50 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇదిగాక రిజిస్ట్రేషన్ ఫీజు కింద అదనంగా మరో రూ.30 చెల్లించాలి. మిగతా 50 శాతం ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25 శాతం చొప్పున భరిస్తాయి. ఈ పథకం కిందకు వచ్చే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లను గుర్తించి.. డేటాను రూపొందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. -
ఆర్టీఏలో స్మార్ట్ కార్డుల కొరత
పలుచోట్ల నిలిచిపోయిన పంపిణీ వినియోగదారుల పడిగాపులు సాక్షి, సిటీబ్యూరో: రోజూ వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లెసైన్స్‌లు అందజేసే రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ఆర్టీఏ కేంద్రాల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షలకు హాజరైన వాళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి సకాలంలో స్మార్టు కార్డులు లభించట్లేదు. సాధారణంగా పరీక్షలు ముగిసిన వారంలోపు విని యోగదారుల ఇంటికి చేరేలా వీటిని పంపిణీ చేస్తారు. కానీ వారం, పది రోజులుగా డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్ల వివరాలను ముద్రిం చి వినియోగదారులకు అందజేసేం దుకు కార్డులు లేకపోవడంతో చాలాచోట్ల ప్రక్రియ నిలిచిపోయింది. డి మాండ్ మేరకు రవాణాశాఖ ఎప్పటికప్పుడు కొత్తకార్డులను రాష్ట్ర టెక్నికల్ సర్వీసుల విభాగం నుంచి తెప్పిస్తుం ది. ఇందుకోసం ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. కొద్ది రోజులుగా అధికారు లు ఈ విషయాన్ని మరిచారు. దాం తో పలు ఆర్టీఏ కార్యాలయాల్లో కార్డుల ప్రింటింగ్, పంపిణీ నిలిచిపోయాయి. వేలల్లో డిమాండ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పది ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో రోజూ 5 వేల మంది వాహనదారులు డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహన చిరునామా బదిలీలు, వాహన యాజమాన్య బదిలీలు, డ్రైవింగ్ లెసైన్స్‌ల పునరుద్ధరణ వంటి సేవలు పొందుతారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు 500 కార్డుల చొప్పున ప్రింట్చేసి వాహనదారులకు పంపిణీ చేస్తారు. కొంతకాలంగా కార్డుల పంపిణీ పోస్టల్ ద్వారా జరుగుతుంది. వాహనదారులు పౌరసేవల కోసం హాజరైన రోజు నుంచి వారంలోపు నేరుగా వారి ఇళ్లకు చేరేలా ఈ ప్రక్రియన కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కసారిగా కార్డుల ప్రింటింగ్, పంపిణీ నిలిచిపోవడంతో పలు కార్యాలయాల్లో వేల సంఖ్యలో కార్డుల ముద్రణ పెండింగ్‌లో పడింది. దీంతో సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన పని వారం, పది రోజులుగా నిలిచిపోవడం వల్ల కొత్త కార్డులు వచ్చినా ఒకేసారి ముద్రించి పంపిణీ చేయడం అసాధ్యం. ఉద్యోగులపై పని భారం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం పరీక్షలకు హాజరై, ఉత్తీర్ణులైనట్లుగా గుర్తింపును పొందినప్పటికీ కార్డులు అందకపోవడం వల్ల వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానాలు చెల్లించుకోవలసి వస్తోంది. -
ఆత్మలకూ పింఛన్లు!
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. చనిపోయిన వారి వివరాలు రికార్డుల్లో నమోదు చేయడం లేదు. ఉపాధి నిమిత్తం శాశ్వతంగా వలసపోయిన వారి వివరాలనూ సేకరించడం లేదు. దీంతో వీరి పేరిట నేటికీ పింఛన్ మంజూరవుతూనే ఉంది. వీరందరూ క్రమం తప్పకుండా డబ్బు పొందుతున్నట్లు రికార్డుల్లో చూపి.. పింఛన్ పంపిణీ చేసే సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్)లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నొక్కేస్తున్నారు. స్మార్ట్ కార్డ్ యంత్రాలు సరిగా పనిచేయకపోయినా.. పని చేస్తున్నట్లు చూపుతున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, మునిసిపాలిటీల్లో 4,08,645 మంది లబ్ధిదారులు ప్రతి నెలా సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 2,37,320 మంది వృద్ధులు, 10,929 మంది చేనేత కార్మికులు, 95,697 మంది వితంతువులు, 16,781 మంది అభయ హస్తం లబ్ధిదారులు, 47,782 మంది వికలాంగులు, 136 మంది గీత కార్మికులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లుగా 53 మండలాల్లో స్మార్టకార్డుల ద్వారా సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్)లు పంపిణీ చేస్తున్నారు. మిగతా 10 మండలాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులే పింఛన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో చనిపోయిన, వలస వెళ్లిన వారికి సంబంధించిన పింఛన్ డబ్బును సీఎస్పీలు, పంచాయతీ కార్యదర్శులు దొంగ సంతకాలు, వేలిముద్రలతో డ్రా చేసుకుంటున్నారు. కొండంత దోపిడీ.. గోరంత రికవరీ పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన ‘సాట్’ అనే సంస్థ ద్వారా జిల్లాలో సామాజిక తనిఖీలు నిర్వహించింది. మూడు విడతలుగా జరిగిన ఈ తనిఖీల్లో పింఛన్ పంపిణీ అక్రమాల గుట్టు వెలుగులోకి వచ్చింది. రూ.56.98 లక్షలు స్వాహా అయినట్లు తేలింది. అధికారులు అక్రమార్కుల నుంచి రూ.9.28 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. పంపిణీ అస్తవ్యస్తం ప్రతి నెలా ఒకటో తేదీ ప్రారంభించి ఐదో తేదీ లోగా ముగించాల్సిన పింఛన్ల పంపిణీ ఆరు నెలలుగా సక్రమంగా జరగడం లేదు. బడ్జెట్ విడుదలలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యంతో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. క్షేత్ర స్థాయిలో వైఫల్యాల కారణంగా కూడా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకటో తేదీన పింఛన్ డబ్బు వస్తుందని ఎదురుచూసే అభాగ్యులకు నిరాశే మిగులుతోంది. దీనికి తోడు ఎప్పుడిస్తారనే స్పష్టమైన తేదీలు ప్రకటించకపోవడంతో వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తపాలా, స్మార్టు కార్డు ఏజెన్సీల ద్వారా పంపిణీ నిర్వహిస్తున్నారు. పింఛన్లకు సంబంధించిన నిధులు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నుంచి ఆయా పంపిణీ ఏజెన్సీలు, అధికారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి ఉప తపాలా, కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)ల ప్రధాన ఖాతాల్లోకి.. ఇలా లబ్ధిదారులకు అందేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. వృద్ధుల అగచాట్లు గ్రామంలో వంద మంది లబ్ధిదారులు ఉంటే సీఎస్పీల ద్వారా పింఛన్ అందజేస్తున్నారు. వందకు లోపు ఉంటే వారు సుదూర ప్రాంతానికెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. వృద్ధులు కిలోమీటర్ల దూరం నడవలేక ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారికి ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు వృద్ధుల చేతి వేళ్ల గీతలు ఒక్కోసారి స్మార్ట కార్డలో మ్యాచ్ కాకపోవడంతో పింఛన్ ఇవ్వకుండా సీఎస్పీలు వెనక్కు పంపుతున్నారు. స్మార్ట కార్డుల పరీక్ష నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని వృద్ధులు కోరుతున్నారు. -
మల్టీపర్పస్.. మెట్రో ఈ-పర్స్
=కెడిట్ కార్డు తరహాలో కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు =అందుబాటులో 16 రకాల సేవలు =రీచార్జీ ఆప్షన్ కూడా... =హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ రూపకల్పన =ఆర్టీసీ, ఎంఎంటీఎస్తోనూ అనుసంధానం =ఆధునిక పద్ధతిలో టికెటింగ్ =2015 నుంచి అందుబాటులోకి! సాక్షి, సిటీబ్యూరో: క్రెడిట్ కార్డు.. డెబిట్ కార్డు.. పెట్రో కార్డు.. ఈ వరసలో కొత్తగా చేరనుంది ‘కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు (సీఎస్సీ)’. హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్ అండ్ టీ ఈ బహుళ ప్రయోజనకార్డును అందుబాటులోకి తేనున్నాయి. నగరవాసుల వాలెట్‌లోకి కొత్తగా చేరనున్న ఈ కార్డు.. సెల్ఫోన్లో ప్రీపెయిడ్ రీచార్జి తరహాలో ఒక్కసారి టాప్అప్ చేస్తే అందులో డబ్బులు అయిపోయే వరకు మెట్రోలో తిరగొచ్చు. మాల్స్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకులకు నగదు బదిలీ చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూడొచ్చు. ఇలా 16 రకాల సేవలను వినియోగించుకోవచ్చు. బహుళ ప్రయోజన కార్డుగా రాబోతున్న ఈ సీఎస్‌సీని తొలివిడత మెట్రోరైలు పట్టాలపైకి వచ్చే 2015 ఉగాది నాటికే అందుబాటులోకి తెచ్చే యోచనలో మెట్రోరైలు, ఎల్అండ్టీ అధికారులున్నారు. మెట్రో... ప్రజల జీవన గమనం ‘మెట్రోరైలు కేవలం ప్రయాణం కోసమే కాదు... నగర ప్రజల జీవితంలో ఓ భాగం’.. ఇది జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ చెబుతున్న మాట. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న అధికారులు స్మార్ట్ కార్డులనూ ఇందులో భాగంగానే తెరపైకి తెస్తున్నారు. ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి పాకెట్లో పైసా లేకుండా నగరమంతా తిరిగి అవసరమైన షాపింగ్ చేసుకొని హాయిగా ఇంటికి చేరుకునే తరహాలో హెచ్ఎంఆర్ ఈ కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డును రూపొందిస్తోంది. ఇందులో రూ.వెయ్యి రీచార్జీ చేసుకుంటే మెట్రో ప్రయాణంతో పాటు క్రెడిట్ కార్డును ఉపయోగించుకున్నట్టే 16 రకాల సేవలకు దీన్ని వినియోగించుకోవచ్చని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కార్డులు.. టోకెన్లు.. మెట్రోరైలులో ప్రయాణించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్సీ) ద్వారా టికెటింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నారు. దీనికి మూలం కాంటాక్ట్‌లెస్ ఫేర్ మీడియా టెక్నాలజీ అని హెచ్ఎంఆర్ చెబుతోంది. శామ్సంగ్ కంపెనీకి ఈ బాధ్యతను ఇప్పటికే అప్పగించారు. ఈ విధానంలో టికెట్ తనిఖీ ఇతరత్రా పనులన్నీ సెన్సర్లు, మిషన్ల ద్వారా జరిగిపోతాయి. ఏఎఫ్సీ టికెట్ల జారీ రెండు రకాలు.. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డు (సీఎస్సీ): ఇందులో మళ్లీ రెండు రకాలు.. కేవలం మెట్రో రైలు పాస్‌గానే ఉపయోగించుకోవచ్చు. ‘ఈ-పర్స్’ గానూ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వివిధ రకాలైన 16 సేవలు పొందవచ్చు. కాంటాక్ట్ లెస్ స్మార్ట్ టోకెన్ (సీఎస్టీ): టోకెన్ అంటే, రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికి ముందు తీసుకునే టికెట్. దీన్ని అవసరమైతే రానుపోను కూడా ఒకేచోట కొనుగోలు చేయవచ్చు. టోకెన్ అంత వరకే ఉపయోగపడుతుంది. ఏఎఫ్సీ విధానంలో లభించే మెట్రో పాస్‌ల సేవలు ఎలక్ట్రానిక్/స్టోర్డ్ వాల్యూ పర్స్(ఈ-పర్స్) పాస్ అంటే స్మార్ట్ కార్డు అన్నమాట. దీంతో పాటు టూరిస్ట్ పాస్, ట్రిప్ పాస్, డైలీ పాస్, వీక్లీ పాస్, మంత్లీ పాస్, హాలిడే పాస్‌లు కూడా ఏఎఫ్సీ విధానంలో మెట్రోరైలు అందించనుంది. సిటీబస్సుల్లో పాస్‌లతో ఉద్యోగాలకు వెళ్లే వారు కూడా మెట్రోరైలు అందించే పాస్‌లనూ వినియోగించుకోవచ్చు. ఉద్యోగులకు ఆర్టీసీ తరహాలో రాయితీ ఇచ్చే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పటి డిమాండ్, మార్కెట్ లెవల్‌ను బట్టి రాయితీలిచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
పింఛన్‌కు స్మార్ట్ సెగ
కావలి, న్యూస్‌లైన్ : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తూ.చ.తప్పకుండా అమలుచేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పదేపదే మాటతప్పుతోంది. ఎంతో మంది పూటగడవడానికి ఆధారమైన పింఛన్‌కే ఎగనామం పెడుతోంది. నేరుగా రద్దు చేస్తే ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత తప్పదని భావించి అడ్డదారుల్లో కుట్ర అమలు చేస్తోంది. అందుకోసం స్మార్ట్ కార్డులను వినియోగించుకుంటోంది. సంక్షేమ పథకాలకు కోతపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం రెండు నెలల క్రితం కావలి పట్టణంలో 500 మందికి పింఛన్లు కట్ చేసింది. ఇప్పుడు మరో 700 మందికి దాదాపు పింఛన్ రద్దు చేసేసింది. ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఆ నిర్ణయాన్ని అడ్డదారిలో అమలు చేస్తోంది. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసమంటూ స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తెచ్చారు. లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్మార్ట్ కార్డుల్లో తప్పులున్నాయంటూ ఇప్పటికే పలువురికి పింఛన్లు నిలిపేశారు. స్మార్ట్‌కార్డుల రూపకల్పనలో సాంకేతికపరంగా జరిగిన తప్పులకూ లబ్ధిదారులనే బాధ్యులుగా చేస్తున్నారు. ఆధార్, రేషన్, స్మార్ట్‌కార్డులను ఒకదానితో ఒకటి పోల్చి ఏ ఒక్క వివరం సరిపోకపోయినా, కనీసం ఓ అక్షరం తేడా వచ్చినా లబ్ధిదారులకు పింఛన్ దూరమవుతోంది. మరోవైపు వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోయినా తర్వాత నెలలో వారికి పింఛన్ ఉండదు. ఈ క్రమంలో వివిధ కారణాలు చూపుతూ వందలాది మందికి కొన్ని నెలలుగా పింఛన్ అందించడం లేదు. ఫొటోలు తీయించుకున్న వారికీ మళ్లీ తీయాలంటూ తిప్పుతున్నారు. వీరంతా వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోలేదనే సాకు చూపి జాబితాలో పేర్లు తొలగించేందుకేనని సమాచారం. ఇదంతా తెలియని లబ్ధిదారులు ఇదేమి తెలియని లబ్ధిదారులు నెలల తరబడి వ్యయప్రయాసలకోర్చి పింఛన్ పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఓ వైపు ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు సక్రమంగా పింఛన్ పంపిణీ చేయని పాలకులు మళ్లీ అర్జీలు స్వీకరిస్తామంటూ 18వ తేదీన కావలిలో రచ్చబండ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. ఇదేం తిప్పట బాబోయ్ పింఛన్ల కోసం తిరిగి,తిరిగి విసిగి వేసారిపోయిన వందలాది మంది లబ్ధిదారులు బుధవారం కావలిలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరు కొద్ది నెలలుగా వైకుంఠపురం మున్సిపల్ స్కూలులోని పింఛన్ల పంపిణీ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ పంపిణీ చేసే సిబ్బంది వివిధ కారణాలు చెబుతూ వీరిని మళ్లీమళ్లీ తిప్పించుకుంటున్నారు. గత నెలలో వస్తే వారం తర్వాత ఇస్తామని, మళ్లీ వస్తే పది రోజుల తర్వాత అని, మరోసారి వస్తే రెండు నెలలకు కలిపి ఇస్తామని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ 5వ తేదీ నుంచి రోజూ పింఛన్ల కోసం తిరుగుతున్నామని, పింఛన్‌గా వచ్చే డబ్బు ఆటో చార్జీలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి బాధలను ‘న్యూస్‌లైన్’ మెప్మా సిబ్బంది రవీంద్రబాబు, పింఛన్లు పంపిణీ చేసే ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధి పవన్ దృష్టికి తీసుకెళ్లగా కొన్ని సాంకేతిక కారణాలతో గత నెలలో పింఛన్ చెల్లించలేదని చెప్పారు. స్మార్టు కార్డులకు సంబంధించి ఫొటోలు తీసే సమయంలోనూ కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఖర్చులు తడిసి మోపెడయ్యాయి మక్బూల్ జాన్ రూ.200 పింఛన్ కోసం గత నెల నుంచి 8 సార్లు పంపిణీ కేంద్రం చుట్టూ తిరిగాను. ఆటో చార్జీలు రూ.500 అయ్యాయి. ఎలాంటి ఆధారం లేని నాకు పింఛన్ ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఇలా చేసే ప్రభుత్వం ఇక ఉండకూడదు. తిప్పుకోవడం సరికాదు రమణమ్మ వృద్ధులను ఇలా ఇష్టానుసారం తిప్పుకోవడం సరికాదు. వృద్ధాప్యంలో పింఛన్ ఆదరువుగా ఉంటుందనుకున్నాను. ప్రభుత్వం మాపై చిన్నచూపు చూసింది. ఇది సరైన విధానం కాదు. దీనికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మా ఉసురు తప్పక తగులుతుంది. -
కచ్చితత్వమెక్కడ?
=‘ఉపాధి’ చెల్లింపుల్లో ప్రయోగాలు =పర్యవేక్షణపై దృష్టిపెట్టని అధికారులు =మూల్యం చెల్లించుకున్నాకే అప్రమత్తం సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభమై ఆరేళ్లు పూర్తయ్యాయి. చెల్లింపుల విషయంలో నేటికీ కచ్చితత్వం లేదు. అధికారులు ప్రయోగాలకు పెద్దపీట వేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఫలితాలు రాలేదు సరికదా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పోస్టల్ ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతున్నారు. పర్యవేక్షణ కొరవడితే ఇందులోనూ బోల్తా పడటం ఖాయం. వేతనాల చెల్లింపునకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నట్టు మొదట్లో అధికారులు చంకలు గుద్దారు. తామే ఆదర్శమని గొప్పలు చెప్పారు. ఆ తర్వాత బయో మెట్రిక్ విధానమన్నారు. దాన్ని కూడా పక్కాగా అమలు చేయలేదు. ఈక్రమంలో ఉపాధి చెల్లింపుల మూలసూత్రాన్ని పక్కన పెట్టేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టల్ ద్వారానే ప్రధానంగా చెల్లింపులు చేపట్టాలి. వేతనదారుడి పేరుతో ఖాతా ప్రారంభించి,అందులో వేతనం జమయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. యూని యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఫినో అనే సంస్థతో చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. తమకెదురులేదన్నట్టుగా ఇష్టానుసారంగా ఆ సంస్థ వ్యవహరించింది. దొరికినోడికి దొరికినంతగా దోచుకున్న పరిస్థితి ఏర్పడింది. యూనియన్ బ్యాంకుకు వచ్చిన నిధులను నేరుగా కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్(సీఎస్పీ)లకు ఇవ్వకుండా మధ్యలో మండల కో- ఆర్డినేటర్లకివ్వడం, వారు తిరిగి సీఎస్పీలకు ఇవ్వడం... ఇలా చేతులు మారిన క్రమంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఇప్పుడా పద్ధతిని రద్దు చేసి పోస్టల్ ద్వారా చెల్లింపులకు నిర్ణయించారు. వేతనదారుల పాసు పుస్తకాల ప్రారంభం, బయోమెట్రిక్ పద్ధతిలో భాగంగా వేతనదారుల ఫొటో, ఫింగర్ ప్రింట్స్ సేకరణ తదితర ప్రక్రియ అంతా డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో బ్రాంచి పోస్టాఫీసుల్లో పాసు పుస్తకాలు తెరవాల్సి ఉంది. అంతేకాకుండా పంపిణీ విధానంపై అవగాహన కలిగి ఉండాలి. మరోవైపు బయోమెట్రిక్ వేలి ముద్రల సేకరణ ఏపీ ఆన్లైన్ సిబ్బంది చేయాలి. ఈ విధంగా అటు పోస్టల్, ఇటు ఏపీ ఆన్లైన్ సిబ్బంది సమాంతరంగా పనిచేసి, పంపిణీ విధానం అమల్లోకి తీసుకురావాలంటే కనీసం ఆరు నెలల సమ యం పడుతుంది. కానీ డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్న డెడ్‌లైన్ పెట్టడం, ఆ ప్రక్రియపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆదరాబాదరాగా అంతా జరిగిపోతోంది. ప్రారంభంలోనే అప్రమత్తం కాకుంటే భవిష్యత్‌లో ఎం చేసినా లాభం లేదు. ఇందుకు పొరుగు జిల్లా విజయనగరంలోని పరిస్థితే తార్కాణం. ఇక్కడ పాసు పుస్తకాల ప్రారంభం తదితర విషయాల్లో పర్యవేక్షణ లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యం చెల్లించుకున్నాక అప్రమత్తమవ్వడం కన్నా ముందుగానే పక్కా పర్యవేక్షణ చేస్తే ఫలితం ఉంటుంది. -
ఆర్టీఏలో ‘స్మార్ట్’ దోపిడీ
సాక్షి,సిటీబ్యూరో: బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన ఓ వాహనదారుడు ఖైరతాబాద్ కేంద్ర రవాణా కార్యాలయంలో గతేడాది డిసెంబర్ 13న తన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రవాణాశాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తు పూర్తి చేసిన ఆయన ఫీజు చెల్లించి, సెల్ఫ్అడ్రస్ కవర్‌తో పాటు అధికారులకు సమర్పించాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైదని, వారం రోజుల్లో స్మార్ట్ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుందని అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటికి 10 నెలలైనా ఇప్పటి వరకు కార్డు అందలేదు. ఈ పది నెలల్లో కనీసం 20 సార్లు అయన ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అధికారులు సమస్య ను పరిష్కరించకపోగా.. వెళ్లిన ప్రతీసారి కార్డు ఇంటికే వస్తుందని చెప్పి అతడ్ని పంపేశారు. ఆర్సీ (రిజిస్ట్రేషన్ కార్డు) లేకుండా వాహనం నడపడంతో పలుసార్లు ఆయన ట్రాఫిక్ పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది. సదరు వాహనదారుడు నాలుగు రోజుల క్రితం మళ్లీ అధికారులను సంప్రదించ గా.. ‘ఆర్టీఏ అధికారులు పంపించిన (అసలు పంపకుండానే) ఆర్సీ ఎక్కడో పోగొట్టుకున్నట్లుగా దరఖాస్తు చేసుకొంటే డూప్లికేట్ ఆర్సీ ఇస్తామంటూ’ చావుకబురు చల్లగా చెప్పారు. వాహనం రిజిస్ట్రేషన్ కోసం మొత్తం ఫీజు, రూ.25 పోస్టల్ చార్జీ చెల్లించిన వాహనదారుడికి రవాణాశాఖ అందజేసిన పౌరసేవ ఇది. ఒక్క ఎన్బీటీనగర్ వాహనదారుడి సమస్య మాత్రమే కాదు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి మాత్రమే ఇది పరిమితం కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని రవాణా కార్యాలయాల్లో జరుగుతున్న ‘స్మార్ట్’ దోపిడీ ఇది. వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులను, డ్రైవింగ్ లెసైన్స్‌లను పోస్టు ద్వారా పంపించినట్లు చెబుతున్నప్పటికీ వాటిని తిరిగి దళారులకే అప్పగిస్తున్నారు. దళారులకు, ఆర్టీఏ సిబ్బందికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో కార్డుపై రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పోస్టులో కార్డు వస్తుందని ఎదురు చూసే వినియోగదారులకు మాత్రం ఎన్బీటీనగర్ వాహనదారుడికి జరిగిన అనుభవమే ఎదురవుతోంది. అప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌లకు దళారుల చేతి వాటానికి జేబులు గుల్ల చేసుకుంటున్న వాహనదారులు.. స్మార్ట్‌కార్డు కోసం మరోసారి ఇలా కాసులు చెల్లించక తప్పడం లేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం... రవాణాశాఖ పౌరసేవల నిర్వహణలో కీలక విధులు నిర్వహించే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. నగరంలోని రవాణా కార్యాలయాలపై ఉన్నతాధికారుల నిఘా, పర్యవేక్షణ లేకపోవడం, కేవలం ప్రధాన కార్యాలయానికే పరిమితం కావడంతో ఇ క్కడి సిబ్బంది ప్రతీ పనికి లంచం తీసుకుంటున్నారు. పాతబస్తీ బహదూర్‌పురా వంటి కార్యాలయాల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ వ్యాపారంలా మారిందని, డబ్బులు చెల్లిస్తే తప్ప కార్డు చేతికి అందడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నతాధికారులు బహిరంగంగానే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘వెలుగు’లో చీకట్లు!
తిమ్మాజిపేట, న్యూస్‌లైన్: నాటి ‘వెలుగు’.. నేటి ‘ఇందిరాక్రాంతి పథం’ సిబ్బంది కొందరు అక్రమాలకు తెరతీశారు. ఆమ్ఆద్మీ పథకం ద్వారా బాధితులకు అందజేయాల్సిన పరిహారంలో అవకతవకలకు పాల్పడ్డారు. పక్కదారి పట్టిన రూ.మూడు లక్షలను రికవరీ చేయించాలని ఉన్నతాధికారులు స్థానిక ఏపీఎం నిర్మలామేరీని ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన సామాజిక తనిఖీ సభలో అక్రమాలు వెలుగుచూశాయి. ఉపాధి పనులపై ఈ నెల14 నుంచి 24వ తేదీ వరకు మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఈ తనిఖీ నిర్వహించారు. ఉపాధి పనులు, కూలీలకు వేతనం చెల్లింపు, ఐకేపీ ద్వారా ఉపకార వేతనాలు, ఆమ్ఆద్మీ పథకంలో బాధితులకు అందుతున్న పరిహారం, స్మార్ట్‌కార్డుల ద్వారా పింఛన్లు అందుతున్న తీరు తదితర అంశాలపై సామాజిక తనిఖీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. వివరాలను డీఆర్పీలు వివరించారు. ఇవిగో అక్రమాలు.. కుటుంబ యజమాని సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే అమ్ఆద్మీ బాండు కలిగి ఉన్న వారి కుటుంబంలో నామినీకి సాధారణ మరణమైతే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు జరిగే రూ.70వేలు ఐకేపీ(వెలుగు) ద్వారా చెల్లిస్తారు. అయితే మండలంలోని ఆయా గ్రామాల్లో బాధిత కుటుంబాలకు రూ.3.47 లక్షల పరిహారం లెక్క తేలలేదని అధికారులు తేల్చారు. పరిహారం సక్రమంగా ఎందుకు పంపిణీచేయలేదని సంబంధిత అధికారులు బీమామిత్రపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బుద్ధసముద్రంలో రూ.55వేలు, బాజీపూర్‌లో రూ.33.90వేలు, బావాజిపల్లిలో రూ.36.50వేలు, పుల్లగిరిలో రూ.37.20వేలు, చేగుంటలో రూ.8400, మారేపల్లిలో రూ.3వేలు, తిమ్మాజిపేటలో రూ.2,400, గొరిటలో రూ.1200, అమ్మపల్లిలో రూ.1200, పోతిరెడ్డిపల్లిలో రూ.55వేలు, నేరళ్లపల్లిలో రూ.30వేలు అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖిలో వెల్లడైంది. వీటిపై విచారణ జరిపి రికవరీ చేయాలని డీపీఎం శేషరావు ఐకేపీ సిబ్బందికి సూచించారు. అలాగే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మండలంలోని ఇప్పలపల్లిలో రూ.22,400, రాళ్లచెరువు తండాలో రూ.11,600, పోతిరెడ్డిపల్లిలో రూ.5వేలు..ఇతర గ్రామాల్లో మొత్తం రూ.45వేల లెక్కతేలలేదు. వీటికి సంబంధించి స్మార్ట్‌కార్డు సిబ్బంది, గ్రామసంఘాల వీఓలు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కార్యక్రమంలో పీఓ పాపయ్య, ఎండీఓ హరినందన్‌రావు, డీవీఎం సుబ్రమణ్యం, క్లస్టర్ ఏపీడీ శ్యాముల్, ఐకేపీ డీఏపీఎం శేషరావు, క్యూసీ కృష్ణయ్య, ఎస్ఆర్పీ రాజేశ్వరి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ నాల్డేజ్ - ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్
1. The operating system does all of the following EXCEPT? 1) provide a way for the user to interact with the computer. 2) manage the central processing unit (CPU). 3) manage memory and storage. 4) enable users to perform a specific task such as document editing. 2. The ability to recover and read deleted or damaged files from a criminals computer is an example of a law enforcement specialty called? 1) simulation 2) animation 3) robotics 4) computer forensics 3. Allocation of a resources in a time dependent manner to several program simultaneo-usly called? 1) multi user 2) multi tasking 3) time sharing 4) none of these 4. Which of the following is an example of a binary number? 1) A1BCD1 2) 23456 3) 005 4) 100101 5. _____ controls the way in which the computer system functions and provides a means by which users can interact with the computer? 1) the operating system 2) the motherboard 3) the platform 4) application software 6. All of the following statements concerning windows are true EXCEPT? 1) windows are an example of a command-driven environment. 2) windows can be resized and repositioned on the desktop. 3) more than one window can be open at a time. 4) toolbars and scrollbars are features of windows. 7. In the binary language each letter of the alphabet, each number and each special character is made up of a unique combination of? 1) eight bytes. 2) eight characters. 3) eight bits. 4) eight kilobytes. 8. Verification of a login name and password is known as? 1) configuration 2) accessibility 3) authentication 4) logging in 9. This type of memory is commonly called temporary or volatile storage? 1) ROM 2) RAM 3) Flash Memory 4) Virtual Memory 5) None of these 10. Which of the following can be used to select the entire document? 1) CTRL+A 2) ALT+F5 3) SHIFT+A 4) CTRL+K 5) CTRL+H 11. The simultaneous processing of two or more programs by multiple processors is? 1) Multiprogramming 2) Multitasking 3) Time-sharing 4) Multiprocessing 5) None of these 12. The default view in Excel is view? 1) Work 2) Auto 3) Normal 4) Roman 5) None of these 13. In Word, you can force a page break? 1) By positioning your cursor at the appropriate place and pressing the Fl key 2) By positioning your cursor at the appropriate place and pressing Ctrl+Enter 3) By using the Insert/ Section Break 4) By changing the font size of your document 5) None of these 14. Help Menu is available at which button? 1) End 2) Start 3) Turn off 4) Restart 5) Reboot 15. The micro processor was introduced in? 1) First generation computers 2) Second generation computers 3) Third generation computers 4) Fourth generation computers 5) None of these 16. Computers use the__ language to process data? 1) Processing 2) Kilobyte 3) Binary 4) Representational 5) None of these 17. Computer process data into information by working exclusively with? 1) Multimedia 2) Words 3) Characters 4) Numbers 5) None of these 18. In the binary language each letter of the alphabet, each number and each special character is made up of a unique combination of? 1) Eight bytes 2) Eight kilobytes 3) Eight characters 4) Eight bits 5) Eight terabytes 19. The term bit is short for? 1) Megabyte 2) Binary language 3) Binary digit 4) Binary number 5) None of these 20. A string of eight 0s and 1s is called a? 1) Megabyte 2) Byte 3) Kilobyte 4) Gigabyte 5) Numbers 21. A__ is approximately one billion bytes? 1) Kilobyte 2) Bit 3) Gigabyte 4) Megabyte 5) Terabyte 22. A__ is approximately a million bytes? 1) Gigabyte 2) Kilobyte 3) Megabyte 4) Terabyte 5) None of these 23. __ is any part of the computer that you can physically touch? 1) Hardware 2) Program 3) An application 4) Software 5) None of these 24. The components that process data are located in the? 1) Input devices 2) Output devices 3) System unit 4) Storage component 5) None of these 25. All of the following are exampl es of input devices EXCEPT a? 1) Scanner 2) Mouse 3) Keyboard 4) Printer 5) None of these 26. A unit of data storage which is equal to 2 to the 70th power is known as:? 1) Yottabite 2) Zebibyte 3) Yobibyte 4) Petabyte 5) Terabyte 27. Which of the following langu-ages were used in the first generation computers? 1) Machine Language 2) Assembly language 3) C-language 4) High level language 5) None of these 28. Which of the following options are used to provide guidance to users while they use application in computer? 1) Software 2) Wizard 3) Wiki 4) None of these 5) All of the above 29. V-RAM is used for which of the following? 1) Video and graphics 2) Text and images 3) Softwares 4) Only text 5) None of these 30. SQL (Structured Query Lang-uage) is used for___? 1) Creating databases and tables 2) Creating, Modifying and Querying databases 3) Modifying databases 4) None of these 5) All of the above 31. __is not a payment card techn-ology? 1) Magnetic stripe card 2) Smart card 3) fleet card 4) All of them are payment card technologies. 5) None of these 32. ____is also known as electronic check? 1) Debit card 2) Smart card 3) Credit card 4) DD 5) None of these 33. Which of the following printer cannot print graphics? 1) Ink-jet 2) Daisy Wheel 3) Laser 4) Dot-matrix 5) None of these 34. Best Quality graphics is produced by? 1) Dot Matrix 2) Laser Printer 3) Inkjet Printer 4) Plotter 5) All of the above 35. A___is a bi-stable electronic circuit that has two stable states? 1) Multivibrator 2) Flip-flop 3) Logic gates 4) laten 5) None of these 36. DOS stands for? 1) Disk Operating System 2) Disk Operating Session 3) Digital Operating System 4) Digital Open system 5) None of these 37. Which of the following are input devices? 1) Keyboard 2) Mouse 3) Card reader 4) Scanner 5) All of these 38. Who is the chief of Miocrosoft? 1) Babbage 2) Bill Gates 3) Bill Clinton 4) Bush 5) None of these 39. Examples of output devices are? 1) Screen 2) Printer 3) Speaker 4) All of these 5) None of these 40. Which of the following is also known as brain of computer? 1) Control unit 2) Central Processing unit 3) Arithmetic and language unit 4) Monitor 5) None of these