మీరు దూకుడుగా వాహనాలు నడుపుతారా
మీరు దూకుడుగా వాహనాలు నడుపుతారా... రోడ్డు నిబంధనలు ఖాతరు చేయరా... రాజకీయ, ఆర్థిక బలాలన్నీ ఉన్నాయి.. ఎదురులేదనుకుంటున్నారా... అయితే, ఇకపై వీటన్నీటికీ చెక్ చెప్పండి. వాహనం నడపడంలో జాగ్రత్తలు పాటించండి. లేకుంటే మీ లెసైన్స్ రద్దువుతుంది. వాహనం నడిపేందుకే పనికిరారు... త్వరలో జిల్లాలో అమలుకానున్నస్మార్ట్‌కార్డు లెసైన్స్ విధానంలో ఇదే జరగనుంది. తస్మాత్ జాగ్రత్త..!
అరసవల్లి:దేశంలోనే తొలిసారిగా రవాణాశాఖ సమూల మార్పులకు నాంది పలికింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా, తప్పు చేసిన సమయంలో అపరాధ రుసుం చెల్లిస్తూ.. నిరభ్యంతరంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపించేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పాటు, కొత్త పరికరాలను జిల్లాకు అందజేసింది. ప్రస్తుతం రవాణాశాఖ ఇస్తున్న స్మార్ట్ కార్డులతో కొత్త టెక్నాలజీని అనుసంధానం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది.
లెసైన్సే కీలకంగా...
వాహనం నడిపే ప్రతి వ్యక్తికి లెసైన్స్ కీలకం. స్థానికతను కూడా లెసైన్సే తెలియజేస్తుంది. ద్విచక్రవాహనం నుంచి హెవీ వాహనం వరకు దేనిని నడిపినా లెసైన్స్ తప్పని సరి. దీనినే ఆధారం చేసుకుని వాహనదారులందరూ రోడ్డు నిబంధనలు పాటించేలా చర్యలకు ఉపక్రమించింది. వాహనాల నడపడంలో దూకుడు తనానికి చెక్‌చెబుతూ, నకిలీలను అరికడుతూ, లెసైన్స్‌దారు పూర్తి సమాచారం కార్డులోనే ఇమిడిపోయే నూతన స్మార్ట్‌కార్డు విధానాన్ని ప్రవేశటింది. ఈ కార్డు కేవలం స్మార్ట్ కాదండోయో.. వ్యక్తి(కార్డుదారుడి) సమాచారం ఎల్లప్పుడు అప్‌డేట్‌లా ఉండే నూతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన చిప్ అనుసంధానమై ఉంటుంది. రోడ్డు నిబంధనలు అతిక్రమించి ఫైన్ కట్టేసి వెళ్లి పోతామంటే ఇకపై కుదరదు. చిప్‌లో తప్పులు ఎక్కువ నమోదైతే లెసైన్స్ రద్దు చేస్తారు.
గుట్టంతా కార్డులోనే...
వాహనం నడిపేందుకు జారీచేసిన లెసైన్స్‌లో అభ్యర్థి పూర్తి వివరాలు ఉండేలా, స్మార్ట్ కార్డు రూపంలో డ్రైవింగ్ లెసైన్స్‌లు రవాణాశాఖ జారీ చేస్తుంది. ఇది స్మార్ట్ అని అంతా అనుకున్నారు. కాని ఆ స్మార్ట్‌లో ఉన్న స్మార్ట్ చూస్తే ఇంత ఉందా అనక తప్పదు. లెసైన్స్‌పై పేరు ఇతర వివరాలు కాకుండా.. కార్డుతో అనుసంధానంగా ఉండే చిప్‌లో అభ్యర్థి ఫొటో, ఎడమచేతి బొటన వేళిముద్ర, పూర్తివివరాలు ఉంటాయి. లెసైన్స్‌ను తీసుకున్న రోజు నుంచి రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఏ పనిచేసినా కార్డులో నమోదవుతుంది.
దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చిప్‌లో పొందుపరిచారు. లెసైన్స్ రెన్యువల్ చేసే సమయంలో రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న ‘కార్డు రీడరు’ అనే మిషన్‌లో లెసైన్స్‌ను(స్మార్ట్‌కార్డును) పెడతారు. వాహనదారుడు చేసిన తప్పులన్నీ చిప్‌లో అప్‌డేట్ అయి ఉంటాయి కాబట్టి కార్డు పెట్టగానే సిస్టంపై కనిపిస్తాయి. రవాణాశాఖ అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలో వారి వద్ద ఉండే ‘కార్డు రీడర్ల’లో ఒకసారి కార్డు పెడితే చాలు... ఇక అంతా అప్‌డేట్ అయిపోతుంది. అక్కడికక్కడే పూర్తి వివరాలు, చేసిన తప్పుల వివరాలు జాబితా వెంటనే ప్రత్యక్షమవుతుంది. దీంతో లెసైన్స్‌దారుడిపై చర్యలకు ఉపక్రమిస్తారు.
ప్రమాదాల నివారణే లక్ష్యంగా...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరణాలు ఎక్కువయ్యూయి. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపం, తెలిసి కూడా తప్పులు చేయడం, తక్కువ అపరాధరుసుం కావడంతో పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. రవాణాశాఖ చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించడం శృతిమించితే అభ్యర్థి లెసైన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్ రూట్, మద్యం సేవించి వాహనాన్ని నడపడం, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలు చేయడం, ప్రమాదంలో వ్యక్తుల పాణాలు పోవడానికి కారణమవ్వడం ఇలా.. ఏ తప్పు చేసినా కార్డులో నమోదు అయిపోతుంది. తప్పులు ఎక్కువైతే.. ఆరు నెలలు వాహనం నడపకుండా సప్పెండ్ చేస్తారు. ఆ తరువాత కూడా మారక పోతే 5 ఏళ్లపాటు తాత్కాలిక రద్దు(చేసిన తప్పును బట్టి శాశ్వత రద్దు) చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
జిల్లాకు చేరిన కార్డు రీడర్లు..
రవాణాశాఖలో పని చేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలకు ‘కార్డు రీడర్’ అనే ప్రత్యేకమైన మిషన్‌ను ప్రభుత్వం త్వరలోనే అందజేయనుంది. ఇప్పటికే జిల్లాకు కార్డు రీడర్‌లు చేరాయి. వాటి సాఫ్ట్ వేర్‌ఇంకా లోడ్‌చేయక పోవడంతో అందజేయలేదు. కొద్ది రోజుల్లోనే తనిఖీ అధికారులకు ఇవి అందజేస్తారు. వీటిలో స్మార్ట్ కార్డును పెట్టగానే అభ్యర్థి వివరాలు పూర్తిగా ప్రత్యక్షమవుతాయి. కార్డు నఖీలీదా కాదా, అభ్యరిథ అవునాకాదా, ఏ వాహననానికి అర్హుడు, ఎన్ని తప్పులు చేశాడు అన్న సమగ్ర సమాచారం ఎంవీఐ వద్ద ఉన్న మిషన్‌లో తెలిసిపోతుంది. దీంతో కలర్ జిరాక్స్ లెసైన్స్‌లు, డూప్లికేట్ ఇలాంటి ఇట్టే కనిపెట్టేయవచ్చు.
త్వరలో నూతన విధానం ప్రారంభిస్తాం
‘కార్డు రీడర్’లు జిల్లాకు చేరాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో నూతన విధానం ప్రారంభిస్తాం. గతంలో లెసైన్స్‌పై అభ్యర్థి ఫొటో, పేరు ఇతర వివరాలు ఉండేవి. ఇప్పుడు జారీచేస్తున్న స్మార్ట్‌కార్డుల్లో కార్డుపైనే కాకుండా కార్డులో ఉండే చిప్‌లో అభ్యర్థి ఫొటో, ఎడమచేతి బొనవేలిముద్ర తదితర పూర్తివివరాలు ఉంటాయి. నకిలీ, కలర్‌జిరాక్స్ లెసైన్స్‌లను అరికట్టేందుకు కార్డురీడర్‌లు ఉపయోగపడతారుు. వాహనాన్ని నడిపేటప్పుడు తప్పని సరిగా ఒరిజినల్ లెసైన్స్ ఉండాలి. అంతా ఆన్‌లైన్ కాబట్టి ప్రతి ఉల్లంఘనా నమోదు అవుతుంది. తనిఖీ అధికారికి డ్రైవర్ లేదా లైస్‌న్స్ దారుడి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
-ఎస్.వెంకటేశ్వరావు, ఉప రవాణాశాఖ అధికారి(శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు)
డ్రైవర్ల తప్పుల చిట్టా చిప్‌లో
భద్రం
దేశంలోనే మొదటి సారిగా
జిల్లాలో స్మార్ట్ విధానం
లెసైన్స్‌దారుడి సమగ్ర
సమాచారం కార్డులోనే..
నిబంధనలు అతిక్రమిస్తే
చర్యలు తప్పవు
కొద్ది రోజుల్లోనే శ్రీకాకుళం
జిల్లాలో అమలుకు శ్రీకారం..
త్వరలో అన్ని జిల్లాలకు
మార్గదర్శకాలు
జిల్లాకు చేరిన కార్డు రీడర్లు,
త్వరలో తనిఖీ అధికారులకు
అందజేత..