చెన్నై, సాక్షి ప్రతినిధి : కోటికి చేరుకుంటున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు పరంగా అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎంటీసీ బస్సులు, మినీ బస్సులు, ఆటోలు, లోకల్‌రైళ్లు, షేర్ ఆటోలు ఇలా ఎన్నో వాహనాలు సేవలు అందిస్తున్నాయి. ఈ కోవలోకి త్వరలో మెట్రోరైలు కూడా రాబోతోంది. మెట్రోరైలు పథకానికి రూపకల్పనకు ముందే స్మార్ట్‌కార్డ్ పరిచయంపై పలుసార్లు చర్చలు జరిపారు. అనేక తర్జనభర్జనల పిదప ఎట్టకేలకూ ఒక నిర్ణయానికి వచ్చారు. మెట్రోరైల్ వారి ద్వారా అందుబాటులో వచ్చే స్మార్ట్‌కార్డ్ ప్రయాణికులకు అనేక విధాల సౌకర్యంగా ఉంటుం ది. ఈ స్మార్టు కార్డు ద్వారా నగర బస్సు సర్వీసులు, ఆటోలు, పార్కింగ్ ప్రదేశాలు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇలా 32 రకాల సేవలకు అవసరమైన నగదును ఈ స్మార్టుకార్డు ద్వారా చెల్లించవచ్చు.
ఈ కార్డును ప్రవేశపెట్టేముందు అన్ని రకాల రవాణా సేవల వారితో చర్చలు జరిపి నియమ నిబంధనలను తెలియజేస్తారు. ఆ తరువాత స్మార్టు కార్డు సేవలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరుస్తారు. ప్రస్తుతం ఢిల్లీలో యునిబేర్ కార్డు పేరుతో ఇలాంటి పలు సేవలు అందుతున్నాయి. అయితే చెన్నైలో స్మార్టు కార్డు సేవలను ఎంతమాత్రం ప్రజలు స్వీకరిస్తారోననే అనుమానాలున్నాయి. లోకల్ రైళ్లలో రోజుకు సగటున ప్రయాణించే లక్షమందిలో 50 వేల మంది మాత్రమే సీజన్ టిక్కెట్లు కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇది చాలా తక్కువ శాతంగా మెట్రోరైల్వే భావిస్తోంది.
ఈ కారణంగా స్మార్టు కార్డును ప్రవేశపెట్టడంపై పలు రవాణా సంస్థలు ఇంకా చర్చలు సాగిస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ, చెన్నై నగర అభివృద్ధి విభాగ అధికారులు స్మార్ట్ కార్డు విషయాన్ని నిర్ధారించారు. స్మార్ట్ కార్డు ప్రవేశం పూర్తిస్థాయిలో ఖరారైన తరువాత ఆటో రిక్షా వారి మీటర్లలో సైతం మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. లండన్, హాంకాంగ్ వంటి నగరాల్లో ఇటువంటి స్మార్ట్‌కార్డులు ఇప్పటికే బహుళ ప్రజాభిమానాన్ని పొందినందున చెన్నైలో కూడా ప్రవేశపెట్టాలని మెట్రోరైలు యాజమాన్యం నిర్ణరుుంచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఇక స్మార్ట్ కార్డ్ సేవలు
Published Sun, Aug 24 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement