
న్యూఢిల్లీ: ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు (వ్యాపారం) ఆర్‌బీఐ నుంచి ఆమోదం లభించినట్టు డీసీబీ బ్యాంకు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వీలుగా డీసీబీ బ్యాంకును ఏజెన్సీ బ్యాంకుగా నియమించినట్టు తెలిపింది.
ప్రైవేటురంగ బ్యాంకులనూ ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది మే నెలలో నిర్ణయాన్ని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే డీసీబీ బ్యాంకుకు ఈ ఆమోదం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment