డీసీబీ బ్యాంక్‌ నుంచి విదేశాలకు రెమిటెన్స్‌ సర్వీసులు | Remittance services from abroad to DCB Bank | Sakshi
Sakshi News home page

డీసీబీ బ్యాంక్‌ నుంచి విదేశాలకు రెమిటెన్స్‌ సర్వీసులు

Published Mon, Mar 12 2018 12:12 AM | Last Updated on Mon, Mar 12 2018 12:12 AM

Remittance services from abroad to DCB Bank - Sakshi

ముంబై: ప్రైవేట్‌ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్‌ తాజాగా ’డీసీబీ రెమిట్‌’ పేరిట రెమిటెన్స్‌ సర్వీసులు ప్రారంభించింది. దీనితో దేశీయంగా బ్యాంక్‌ ఖాతా ఉన్నవారు విదేశాలకు ఆన్‌లైన్‌లో నగదు పంపొచ్చు. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ, జర్మనీల కోసం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. నిర్ధారిత విదేశీ మారక రేటు ప్రకారం ముందుగా.. ఖాతాదారు ఏ బ్యాంకు ఖాతా నుంచైనా డీసీబీ బ్యాంక్‌ ఖాతాలోకి ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత తదుపరి పని దినం లోగా సదరు నగదును విదేశాల్లోని లబ్ధిదారు ఖాతాకు డీసీబీ బ్యాంక్‌ బదలాయిస్తుంది. విదేశీ కళాశాలల్లోని పిల్లల చదువుల కోసం, వైద్యం ఖర్చులు మొదలైన వాటి కోసం ఈ సత్వర రెమిటెన్స్‌ సేవలు ఉపయోగపడతాయని డీసీబీ బ్యాంక్‌ రిటైల్‌ విభాగం హెడ్‌ ప్రవీణ్‌ కుట్టి తెలిపారు. ఎవెన్యూస్‌ పేమెంట్స్‌ సంస్థతో కలిసి డీసీబీ బ్యాంక్‌ ఈ కొత్త సర్వీసు ప్రారంభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement