డీసీబీ బ్యాంక్‌ లాభం 7 శాతం అప్‌ | Dcb Bank's profit up 7% | Sakshi
Sakshi News home page

డీసీబీ బ్యాంక్‌ లాభం 7 శాతం అప్‌

Published Tue, Jul 17 2018 12:42 AM | Last Updated on Tue, Jul 17 2018 12:42 AM

Dcb Bank's profit up 7% - Sakshi

ముంబై:  ప్రైవేట్‌ రంగంలోని డీసీబీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.65 కోట్ల నికర లాభం వచ్చిందని, 7 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ తెలియజేసింది.

నికర వడ్డీ ఆదాయం పెరగడం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం వృద్ది చెందిందని వివరించింది. గత క్యూ1లో రూ.233 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో 17 శాతం వృద్ధితో రూ.273 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 4.23% నుంచి 3.90 శాతానికి తగ్గింది.  

రుణాలు 31 శాతం అప్‌..
బ్యాంక్‌ ఇచ్చిన రుణాలు 31 శాతం వృద్ధితో రూ.21,243 కోట్లకు పెరిగాయని,  డిపాజిట్లు కూడా 31 శాతం పెరిగి రూ.25,032 కోట్లకు చేరాయని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు 6 శాతం తగ్గి (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 14 శాతం) రూ.33 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో (గత ఆర్థిక సంవత్సరం క్యూ4) 1.79 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.86 శాతానికి పెరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement