ఇకాజ్ మొబైల్ పేమెంట్ అప్లికేషన్
హైదరాబాద్: డీసీబీ బ్యాంక్‌తో కలిసి మొబైల్ పేమెంట్స్ కంపెనీ ఇకాజ్- తన తాజా మొబైల్ పేమెంట్ అప్లికేషన్ ‘ఎంఓడబ్ల్యూ’ను ఆవిష్కరించింది. డబ్బు పంపేవారి లేదా స్వీకరించేవారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ సమాచారంతో సంబంధం లేకుండా పేమెంట్లు పంపగలగడం దీని ప్రత్యేకత. తమ మొబైల్ నంబర్, పేరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా యూజర్లు ఈ యాప్ సేవలను పొందవచ్చు. పేమెంట్‌కు వీలుగా తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు జతచేయాలి.
రిసీవర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా పేమెంట్ చేయవచ్చు. పేయర్ కార్డ్ నుంచి డబ్బు డెబిట్ అయి, నేరుగా రిసీవర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. బ్యాంక్ ఖాతాలో డబ్బు డిపాజిట్‌కు కూడా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు.