బేస్‌రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
Published Thu, Aug 8 2013 12:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కనీస (బేస్) రుణ రేటును స్వల్పంగా 0.2% పెంచింది. దీంతో ఈ రేటు 9.60% నుంచి 9.80 శాతానికి చేరింది. ఫలితంగా ఈ రేటుకు అనుసంధానమైన ఆటో, కార్పొరేట్, ఇతర రుణ రేట్లు పెరగనున్నాయి. ఆగస్టు 3వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చిందని బ్యాంక్ ట్రెజరర్ అశీష్ పార్థసారథి తెలిపారు. రూపాయి విలువ బలోపేతానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న కఠిన లిక్విడిటీ చర్యలు, పాలసీ సమీక్షలో కీలక రేట్లను యథాతథంగా ఉంచిన నేపథ్యంలో యస్ బ్యాంక్ మొదట బేస్ రేటును పెంచింది. ఇప్పుడు ఇదే బాటను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుసరించింది.
Advertisement