ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 524 కోట్లు
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 524 కోట్లు
Published Thu, Aug 8 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ రూ. 524 కోట్ల నికర నష్టాన్ని ప్రక టించింది. ఇందుకు రూపాయి విలువ క్షీణించడంతో విదేశీ కరెన్సీ రుణాలు భారంకావడం, ఫ్రాన్స్ కార్యకలాల గుడ్‌విల్ నష్టాలు ప్రభావం చూపాయి. గతేడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్-జూన్’12లో సైతం రూ. 586 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. నిజానికి రూపాయి విలువ క్షీణించడంవల్ల కంపెనీకి ఎగుమతుల ఆదాయం పెరుగుతుంది.
అయిదే ఇదే సమయంలో డెరివేటివ్స్‌లో ఏర్పడ్డ మార్క్ టు మార్కెట్(ఎంటూఎం) నష్టాలు, విదేశీ కరెన్సీ రుణాలు భారంకావ డం వంటి అంశాలు దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్షీణించిన అమ్మకాలు: ప్రస్తుత సమీక్షా కాలంలో అమ్మకాలు కూడా రూ. 3,205 కోట్ల నుంచి రూ. 2,633 కోట్లకు క్షీణించాయి. యూఎస్ మార్కెట్ల నుంచి ప్రత్యేక హక్కుల ఆదాయం తగ్గడంతో అమ్మకాలు పరిమితమయ్యాయని కంపెనీ సీఈవో అరుణ్ సాహ్నే చెప్పారు.
Advertisement
Advertisement