ఐడీబీఐ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు..
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ తాజాగా బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు 9.75 శాతం నుంచి 9.65 శాతానికి తగ్గింది. అలాగే బ్యాంక్ బీపీఎల్‌ఆర్‌కు కూడా కత్తెర వేసింది. దీంతో ఇది 14.25 శాతం నుంచి 14.15 శాతానికి పడింది. ఇక బ్యాంక్.. రిటైల్ డిపాజిట్ రేట్లను కూడా 10-25 బేసిస్ పాయింట్ల మధ్యలో తగ్గించింది. తాజా మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఇటీవలనే ఎంసీఎల్‌ఆర్‌ను కూడా తగ్గించింది.